తెలుగువన్ ఎప్పుడో చెప్పింది... జాతీయ మీడియా ఇప్పుడు కోడై కూస్తోంది!

Publish Date:Aug 31, 2022

Advertisement

 ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో త్వరలో కొత్త కూటమి ఏర్పడనుందని ఇప్పుడు జాతీయ మీడియా కోడై కూస్తోంది. ఇదే విషయాన్ని తెలుగువన్ ఎప్పుడో చెప్పింది.  . తెలుగుదేశం   నాలుగేళ్ల‌ తరువాత, జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) లోకి    తిరిగి రాబోతున్నట్లు జాతీయ మీడియా ఇప్పుడు చెబుతోంది. కానీ ఏపీలో కొత్తటమి కొలువుదీరనున్నదని తెలుగువన్ గతంలోనే చెప్పేసింది. ఏపీ తెలంగాణలలో పరస్పర ప్రయోజనాల పరిరక్షణకు తెలుగుదేశం, బీజేపీలు దగ్గర కాబోతున్నాయని వెల్లడించిన తెలుగువన్  ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు అన్న కథనంలో తెలుగుదేశం, బీజేపీలు దగ్గరౌతున్న విషయాన్నికళ్లకు కట్టినట్లు వివరించింది.  ఇప్పుడు జాతీయ మీడియా కూడా అదే కోణంలో కథనాలు ప్రసారం చేస్తున్నది.  

నాలుగేళ్ల కిందట తెగతెంపులు చేసుకుని వెళ్లిన తెలుగుదేశం పార్టీని తిరిగి ఎన్‌డీఏలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతుయనీ,  ఆంధ్ర, తెలంగాణల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ యోచిస్తున్నదనీ రిపబ్లిక్‌ టీవీ చానల్‌ ఓ కథనం ప్రసారం చేసింది. ఈ   చానల్‌ బీజేపీకి అనుకూలమన్న ప్రచారం ఉన్న సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీకి గట్టి ఓటు బ్యాంకు ఉందని..   అందుచేత వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ సానుకూలంగా ఉందని చానల్‌ వెల్లడించింది.

‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌’ సందర్భంగా ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో పర్యటించినప్పుడు ప్రధాని మోదీతో కరచాలనం చేసి.. ఐదు నిమిషాలు ముచ్చటించిన విషయాన్ని ప్రస్తావించింది. అలాగే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థులకు టీడీపీ మద్దతిచ్చిందని.. 75వ స్వాతంత్య్ర దినోత్సవం రోజున త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన చంద్రబాబు.. మోదీపై ప్రశంసల జల్లు కురిపించారని గుర్తుచేసింది.

‘2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ, బీజేపీ తెగతెంపులు చేసుకున్నాయి. హామీలు నెరవేర్చలేదని ఆరోపిస్తూ టీడీపీ మోదీ కేబినెట్‌ నుంచి వైదొలగింది. ఇటు బీజేపీ కూడా ఆంధ్రలో చంద్రబాబు మంత్రివర్గానికి గుడ్‌బై చెప్పింది.ఆసందర్భంలో రెండు పార్టీలూ కూడా పరస్పరం ఆరోపణలు గుప్పంచుకున్న సంగతి తెలిసిందే. అయితే అప్పటికీ ఇప్పటికీ తెలుగురాష్ట్రాలలో పరిస్థితులలో గణనీయ మార్పు వచ్చిందని పేర్కొన్న ఆ మీడియా టీడీపీ ఎన్‌డీఏలో చేరే అవకాశముందని  వివరించింది.

By
en-us Political News

  
జగన్ సర్కార్ సృష్టించిన భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరిస్తున్నామన్నారు.  క్యూఆర్ కోడ్, బ్లాక్‌చైన్ సాంకేతికత,  కరెన్సీ నోట్ల తరహా సెక్యూరిటీ ఫీచర్లతో రూపొందించిన ట్యాంపర్ ప్రూఫ్ పాసు పుస్తకాలను రైతులకు అందిస్తున్నామన్నారు.
పొత్తు ధర్మానికి విరుద్ధంగా, శ్రేణుల్లో అయోమయం సృష్టించేలా వ్యవహరిస్తున్నవీరి వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రెండు పార్టీల హైకమాండ్ లూ రంగంలోకి దిగాయి. ఇకపై ఎలాంటి బహిరంగ విమర్శలకు దిగకూడదని, సంయమనం పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఇరు నేతలకు అధిష్ఠానాల నుంచి సీరియస్ వార్నింగ్ లు వెళ్లినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
రాజమహేంద్రవరంలో డాక్టర్ ప్రియాంక ఘటన అయినా.. కాశీబుగ్ట సమీపంలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజు అరవవర్మ హిట్ అండ్ రన్ కేసు అయినా.. రాజకీయంతో సంబంధం లేకుండా ఈ విషయంలో నిర్లక్ష్య డ్రైవంగ్ తో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటనగానే చూసి నిందితులకు శిక్ష పడాలనే ఎవరైనా కోరుకుంటారు. కానీ జగన్ రెడ్డి రూట్ మాత్రం సపరేట్ గా కనిపిస్తోంది.
గత కొంత కాలంగా ఆయన బీజేపీ గూటికి చేరుతారా, లేదా ఫ్యాన్ పార్టీలోనే చేరి హోం కమింగ్ అంటారా అన్న చర్చ జోరుగా సాగుతోంది.  ఆ మధ్య ఒక సారి తాను సొంత పార్టీ పెడతానంటూ ప్రకటించి సంచలనం సృష్టించిన విజయసాయి.. ఆ తరువాత ఆ విషయంలో ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు. అయితే గత రెండు మూడు రోజులుగా.. సోషల్ మీడియాలోనూ, పొలిటికల్ సర్కిల్స్ లోనూ మళ్లీ విజయసాయి కొత్త పార్టీ వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి.
వివిధ చేతివృత్తులు, సాంప్రదాయ వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న రజక, నాయిబ్రాహ్మణ, కుమ్మరి, చేనేత, మత్స్యకార, గాండ్ల,  ఇతర వెనుకబడిన కులాలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఉపాధి పరికరాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
కాలంతో పాటు  రాజకీయ పరిస్థితులు కూడా మారుతుంటాయి. ఒకప్పుడు కొందరిని లక్ష్యంగా చేసుకుని విసిరిన ఈ పదబంధం, ఇప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాల మధ్య ఎవరిని ఉద్దేశించాలన్న చర్చ జోరందుకుంది.  రాజకీయ విశ్లేషకులు ,  మేధావులు ఈ అంశంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
మెగా డీఎస్సీ   ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. , మెగా డీఎస్సీ పట్ల యువతలో బై అండ్ లార్జ్ హర్షం వ్యక్తం అవుతోంది. నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉందన్న భావనే సర్వత్రా గట్టిగా వ్యక్త మౌతోంది. డీఎస్సీకి వ్యతిరేకంగా వైసీపీ నిరసనలకు వ్యతిరేకంగా జగన్ ఖిల్లా అయిన కడపలో యువత రోడ్డెక్కారు.
 ఒంగోలు ఎమ్మెల్యే  దామచర్ల జనార్ధన్‌రావు, మాజీ మంత్రి,   జనసేన   సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి విభేదాలు ఇరు పార్టీల మధ్యా రాజకీయ రచ్చకు కారణమైంది.  దామచర్ల, బాలినేని మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, అలాగే ఆరోపణలు, ప్రత్యారోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.  
యువ రాజకీయనాయకుడిగా గతంలో ఎదుర్కొన్న విమర్శలను పటాపంచలు చేస్తూ, పరిపాలనా విధానాల్లో సాధించిన పరిణతి, స్పష్టమైన వ్యూహాలతో ఆయన తన రాజీకీయ ఇమేజ్‌ను పూర్తిగా ట్రాన్స్ ఫార్మ్ చేసుకున్నారని ఆ కథనం పేర్కొంంది.
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయం మళ్లీ ఒక్కసారిగా తీవ్రస్థాయిలో వేడెక్కింది.
టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో యూనిట్ ఇంఛార్జ్‌లకు నిర్వహించిన శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు
2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంలో తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుందని చెప్పారు.
దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈ పరిణామాలు నారా లోకేష్ నాయకత్వ తీరుపై, కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.