తెలుగుదేశం జైత్రయాత్ర ఆరంభం!

Publish Date:Jul 27, 2022

Advertisement

ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీ తన జైత్ర యాత్ర మొదలెట్టింది. అధికార వైసీపీపై ప్రజల్లో పెరిగిపోతున్న వ్యతిరేకతను ఒక కోపరేటివ్ బ్యాంక్ పాలక మండలి ఎన్నికలు బట్టబయలు చేశాయి. రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత ఇలాకా కొవ్వూరు కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలక మండలి ఎన్నికల్లో మొత్తం 11 స్థానాలనూ తెలుగుదేశం క్లీన్ స్వీప్ చేయడంతో టీడీపీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టిన చందంగా హోంమంత్రి నియోజకవర్గంలో టీడీపీ   సత్తా చాటింది. దీంతో కొవ్వూరులో టీడీపీ జెండాల రెపరెపలు మొదలయ్యాయి.

ఒక్క  ఛాన్స్ అంటూ అధికార పగ్గాలు అందుకున్న  జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలా భ్రష్టుపట్టించిందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్థికంగా రాష్ట్రాన్ని హీన స్థితికి తేవడమే కాకుండా వైసీపీ సర్కార్ అనాలోచిత నిర్ణయాల కారణంగా అన్ని వర్గాల ప్రజలు   అగచాట్లు పడుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచడం, ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీల పెంపు, చెత్త మీద కూడా పన్ను వేయడం లాంటి అనాలోచిత చర్యలతో వైసీపీ సర్కార్ పై జనంలో ఓ రేంజ్ లో అసహనం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో జరిగిన కొవ్వూరు కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో టీడీపీ అన్ని స్థానాల్లో విజయకేతనం ఎగరేయడం గమనార్హం. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయానికి ఇదే తొలిమెట్టు అంటూ ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. నిజానికి 1983 నుంచీ ఇక్కడ టీడీపీ హవాయే కొనసాగుతోంది. ఎన్నిక ఏదైనా గెలుపు మాదే అంటూ కొంత కాలంగా విర్రవీగుతున్న వైసీపీ నేతల అత్యుత్సాహానికి కొవ్వూరు అర్బన్ బ్యాంక్ ఎన్నికలు బ్రేకులు వేశాయని చెప్పాలి. కొవ్వూరు వైసీపీలో గ్రూపు రాజకీయాల కారణంగానే టీడీపీ విజయం సులువు అయిందని, తమకు ఓటమి ఎదురైందని ఆ పార్టీ నేతలే ఒప్పుకుంటున్నారు. ఇదే విషయాన్ని బహిరంగంగా చెబుతుండడం గమనించదగ్గ విషయం. అయితే.. అర్బన్ బ్యాంక్ పాలక మండలి ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ.. జిల్లా సహకార అధికారికి వైసీపీ ఫిర్యాదు చేయడాన్ని చూసి స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.

కాగా.. కొవ్వూరు కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు పాలక వర్గంపై దశాబ్దాలుగా టీడీపీ ఆధిపత్యమే కొనసాగుతోంది. అయితే.. టీడీపీని ఈసారి ఎలాగైనా దెబ్బకొట్టాలనే కుట్రతో వైసీపీ చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం విశేషం. నిజానికి వచ్చే ఆగస్టు 4తో ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం ముగుస్తోంది. దీంతో సొసైటీల మాదిరిగా త్రిసభ్య కమిటీ వేసి అర్బన్ బ్యాంకును చేజిక్కించుకోవాలని అధికార పార్టీ వేసిన ఎత్తుగడను టీడీపీ నేతలు తిప్పికొట్టడం గమనార్హం. 1964 కో ఆపరేటివ్ సొసైటీ చట్టం 43 ప్రకారం ఎన్నికలు నిర్వహించుకుని, ఏకగ్రీవంగా ఎన్నికైన తదుపరి పాలకవర్గాన్ని ప్రకటించారు.

కొవ్వూరు కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలకవర్గం ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి హోం మంత్రి తానేటి వనితే కారణం అంటూ ఆ పార్టీ నేత కంఠమణి రమేష్ నిప్పులు చెరుగుతున్నారు. మంత్రిపై మనస్తాపంతో కొవ్వూరు శ్రీరామా ప్రాథమిక సహకార పరపతి సంఘం అధ్యక్ష పదవికి రాజీనామా ప్రకటించారు. దీంతో కొవ్వూరు నియోజకవర్గంలోని వైసీపీలో లుకలుకలు బట్టబయలయ్యాయి.

By
en-us Political News

  
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.