టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు విడుదల విజేతలు ఎవరంటే?
Publish Date:Mar 3, 2025
Advertisement
తెలుగు రాష్ట్రాల టీచర్ ఎమ్మెల్సీ ఫలితాలు వెలువడ్డాయి. తెలంగాణలోని కరీంనగర్- నిజామాబాద్- ఆదిలాబాద్- మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య విజయం సాధించారు. ఇక నల్గొండ్ -వరంగల్-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ గా పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. తొలి ప్రాధాన్యత ఓటులో విజేత ఎవరన్నది తేలకపోవడందతో రెండో ప్రాధాన్యత ఓట్లతో శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. ఏపీ విషయానికి వస్తే ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్ధి గాదె శ్రీనివాసులు గెలుపొందారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లేక్కింపులో ఆయన విజేతగా నిలిచారు. ఈ ఎన్నికలో దాదాపు వెయ్యి ఓట్లు చెల్లలేదు.
http://www.teluguone.com/news/content/telugu-states-teachers-mlc-elections-39-193788.html





