అవినీతిలో అగ్రస్థానం ఎవరిదో!  తెలుగు రాష్ట్రాల మధ్య పోరు..

Publish Date:Dec 23, 2021

Advertisement

‘అవినీతి సర్వాంతరయామి. అదొక ప్రపంచ సమస్య’...ఇది మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 40-45  ఏళ్ల క్రితం  ఎప్పుడో వెలిబుచ్చిన అభిప్రాయం. అలాగే,మరో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయిలో 15 పైసలు మాత్రమే నిజమైన లబ్దిదారులకు చేరుతోంది .. మిగిలిన 85 పైసలు మధ్య దళారీల జేబుల్లోకి పోతున్నాయని అన్నారు. ఇక ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ, అక్రమార్కులు విదేశాలకు తరలించుకుపోయిన అవినీతి సొమ్మును ఏడాదిలో వెనక్కి తీసుకోస్తానని మాటిచ్చి అధికారంలోకి వచ్చారు. నిజానికి మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో వెలుగు చూసిన అవినీతి కుంభకోణాలను నిచ్చెన మెట్లుగా చేసుకునే 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అవినీతి రహిత పాలన అందిస్తామని మోడీ మాటిచ్చారు. 

అయితే, గడచిన ఏడున్నర సంవత్సరాల మోడీ పాలనలో అవినీతి అదుపులోకి వచ్చిందా అంటే, లేదు. నిజానికి, ఇకొంత పెరిగింది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ (టీఐ) 180 దేశాలో  నిర్వహించిన అధ్యయన నివేదిక ప్రకారం మన దేశం గతసంవత్సరం (2020) కంటే ఈ సంవత్సరం (2021)ఆరు మెట్లు దిగజారి, 86 వస్తానానికి చేరింది. అంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మన దేశంలో అవినీతి పెరిగిందే కానీ, తరగలేదు.   

అదలా ఉంటే,తెలుగు రాష్ట్రాల్లో అవినీతిపై యూత్ ఫర్ యాంటీ కరప్షన్ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సర్వే ప్రకారం దేశంలో అవినీతిలో అగ్రస్థానం కోసం ఉభయ తెలుగు రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి పనికి రేటు ఫిక్స్ చేసి మరీ లంచాలు వాసులు చేస్తున్నారని, లంచం   ఇవ్వనిదే చావు సర్టిఫికేట్ కూడా రావడం లేదని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ తన స‌ర్వే నివేదికలో వెల్లడించింది. ఉభయ తెలుగు  రాష్ట్రాల్లోని అన్ని ప్రభుత్వ విభాగాల్లో 70 శాతంపైగానే అవినీతి నెలకొందని తేలింది. అధికారులలో 80 శాతం మంది అవినీతిపరులే ఉన్నారన్న‌ ప్ర‌జ‌ల అభిప్రాయాన్ని  స‌ర్వే రిపోర్టు పేర్కొంది. అత్యధికంగా రెవెన్యూ శాఖలో 85 శాతం అవినీతి ఉందని సర్వే స్పష్టం చేసింది. మూడో స్థానంలో పోలీస్ విభాగం అవినీతి 79 శాతం ఉందని తేల్చింది. అవినీతి నిర్మూలన కోసం పనిచేసే విజిలెన్స్ కమిషన్ , యాంటీ కరప్షన్ బ్యూరో వంటి వాటిపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ తన సర్వే వివరాలను వెల్లడించింది. రెండు రాష్ట్రాల్లోని రాజకీయ నేతల్లో 80 శాతం మంది అవినీతిపరులేనని ప్రజల తమ అభిప్రాయాన్ని వెల్లడించినట్లు సర్వే పేర్కొంది. 

కాగా ఈనివేదికను విడుదల చేసిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయ‌ణ‌ ప్రజలు ఎక్కువగా అనుసంధానం ఉండే విభాగాల్లోనే ఈ అవినీతి ఎక్కువగా కనిపిస్తోందన్నారు.దేశంలో అవినీతిపరులకు ఏళ్ళు పూళ్ళు గడిచినా శిక్షలు పడక పోవడం వలన రాజకీయ అవునీతి రోజు రోజుకు పెరిగిపోతోందే అభిప్రాయం వ్యక్త పరిచారు. తక్ష‌ణమే శిక్ష‌ పడితే ఇతరుల్లో భయం ఏర్పడుతుందని తద్వారా అవినీతి కొంత తగ్గుతుందని ఆయన అన్నారు,  ప్రభుత్వ విభాగాల్లో సాంకేతికతను ఉపయోగిస్తే అవినీతిని నియంత్రించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇన్ కంట్యాక్స్ విభాగాన్ని ఎలాగైతే అన్ లైన్ చేశారో అలాగే ప్రతి విభాగంలో టెక్నాలజీ ఉపయోగిస్తే అవినీతి నిర్మూలన సాధ్యం అవుతుతుందని పేర్కొన్నారు. 

ఎన్నికల ఆవినీతికి అడ్డుకట్ట వేయకుండా అవినీతిని ఆదుపు చేయడం అయ్యే పనికాదని, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నికలలో గెలిచిన ప్రజాప్రతినిధులు, ప్రజాప్రతినిధులకు లంచాలు ఇచ్చి ఉద్యోగాలు, పోస్టింగులు, బదిలీలు తెచ్చుకునే అధికారుల నుంచి నిజాయతీని ఆశించడం కూడా అత్యాశే అంటున్నారు,విజ్ఞులు. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ఓటుకు ఆరు వేలు తీసుకోవడమే కాకుండా, యా డబ్బులకోసం ధర్నాలు చేయడం చూసిన తర్వాత, పెద్ద ఎత్తున అవినీతి ప్రయోజనాలు పొందుతోంది రాజకీయ న్యాకులు, అధికారులే అయినా, అవినీతిలో  సామాన్య ప్రజలకు మినహాయింపు ఇవ్వలేమని అంటున్నారు.

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.