.పోలవరం పూర్తి చేసేది తెలుగుదేశమే,, తెలుగువన్ ఆన్ లైన్ పోల్ సర్వే

Publish Date:Jul 27, 2023

Advertisement

పోలవరం ఎవరు పూర్తి చేస్తారు? అంటూ తెలుగువన్ ఆన్ లైన్ లో నిర్వహించిన పోల్ కు అద్భుత స్పందన లభించింది. మొత్తం కేవలం ఒక్క రోజు వ్యవధిలో 63వేల మంది ఈ పోల్ లో పాల్గొనగా వారిలో 84 శాతం మంది పోలవరం పూర్తి చేయడం అన్నది తెలుగుదేశం వల్లే అవుతుందని నిర్ద్వంద్వంగా చెప్పారు. కేవలం 12 శాతం మంది వైసీపీ పోలవరం పూర్తి చేస్తుందన్నారు. ఈ జాతీయ ప్రాజెక్టును బీజేపీయే పూర్తి చేస్తుందని 5శాతం మంది అభిప్రాయపడ్డారు. దార్శనికత ఉన్న నేత చంద్రబాబు మాత్రమే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయగరన్నది అత్యధిక ఆంధ్రుల అభిప్రాయమని తెలుగువన్ ఆన్ లైన్ పోల్ సర్వేలో అత్యధికులు అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టులైనా, ప్రగతి అయినా, పురోగతి అయినా ఒక్క చంద్రబాబు వల్లే సాధ్యమౌతుందన్నది ఏపీలో మెజారిటీ ప్రజల అభిప్రాయంగా ఈ ఆన్ లైన్ పోల్ సర్వేలో ద్వారా అత్యధికులు తమ అభిప్రాయాన్ని చెప్పారు. కేవలం పోలవరం తెలుగుదేశం మాత్రమే పూర్తి చేస్తుందంటూ టీడీపికీ టిక్ పెట్టడమే కాకుండా మెసేజీల ద్వారా తన అభిప్రాయాన్ని కూడా వెల్లడించారు.

 

రాష్ట్రం ప్రగతి పథంలో నడవాలంటే మరోసారి చంద్రబాబు అధికారంలోకి రావాల్సిందేనన్నది మెజారిటీ ప్రజల అభిప్రాయంగా ఈ పోల్ లో తేలింది. అసలు పోలవరం పురోగతి మందగించడానికీ, ప్రాజెక్టు పరిస్థితి ఈ రోజిలా తయారవ్వడానికి వైసీపీయే కారణమని పలువురు మెసేజీల రూపంలో ఈ పోల్ లో కుండబద్దలు కొట్టిన చందంగా చెప్పారు. జగన్ అధికారంలోకి వచ్చిన క్షణం నుంచీ పోలవరంను నిర్వీర్యం చేయడమే లక్ష్యమన్నట్లుగా వ్యవహరించారన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కొందరైతే ఒక అడుగు ముందుకేసి.. అభివృద్ధి కార్యక్రమాలను కచ్చితంగా, లోపరహితంగా చేయగల ఒకే ఒక్క దార్శనికుడు చంద్రబాబు మాత్రమేనని చెప్పడమే కాకుండా.. ఏపీ ప్రజలు ఇప్పటికైనా మేల్కోవాలని పేర్కొన్నారు.

 రివర్స్ టెండరింగ్ వల్ల  పోలవరం సాగు నీటి ప్రాజెక్టు, జల విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులలో 628 కోట్ల రూపాయలు ఆదా చేశామని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంది.. కానీ జగన్ సర్కార్ ప్రతిదీ రివర్స్ లోనే చెప్పిందన్నది  కాంట్రాక్టు సంస్థ కోట్ చేసిన మొత్తానికి అదనంగా 500 కోట్ల రూపాయలు చెల్లించడంతోనే తేటతెల్లమైందంటున్నారు.  తెలుగుదేశం హయాంలో పోలవరం పనులు  చేపట్టినప్పుడు రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమలులో ఉంది. కానీ రివర్స్ టెండరింగ్ అంటూ జగన్ సర్కార్ మరో సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించే సమయానికి జగన్ సర్కార్ తీసుకు వచ్చిన కొత్త ఇసుక విధానం మేరకు టన్ను ఇసుకకు 375 రూపాయల చొప్పున చెల్లించాలసి వచ్చింది. దీంతో రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదా అన్న జగన్ సర్కార్ మాటలు డొల్లగానే మిగిలిపోయాయంటూ నెటిజన్లు పోలవరంపై తెలుగువన్ నిర్వహించిన ఆన్ లైన్ పోల్ లో పేర్కొన్నారు.  

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.
హైదరాబాద్‌ నగరంలో శాంతిభద్రతల నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టేందుకు పోలీస్‌ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు.
దసరా పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉపఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడినా.. అసాధారణ ధైర్యసాహసాలతో 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన
కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న వేళ.. దాని భవిష్యత్తుపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో సెప్టెంబర్ 22న జరిగిన 18 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని ఇంద్రపల్లి హరిణి హత్య ఉదంతం
మోసపోయాం.. గోసపడుతున్నాం..సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఆగ్రహం.!
రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో కోకాపేట్‌ నియోపోలిస్‌ వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల అంశం మరోసారి అత్యంత వేడెక్కింది
విద్యావలయంలో గంజాయి మొక్క కలకలం..!
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.