OU: పీహెచ్‌‌డీ విద్యార్థి దారుణ హత్య..బ్యాట్‌తో కొట్టి చంపిన దుండగులు.!

Publish Date:Oct 1, 2026

Advertisement

రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో కోకాపేట్‌ నియోపోలిస్‌ వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. కారులో ఉన్న వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు బ్యాట్‌తో దాడి చేసి హత్య చేసిన అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్‌ టీమ్‌ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. అసలు హత్యకు గురైన వ్యక్తి ఎవరు? అతడిని ఎవరు చంపారు? ఎందుకు హత్య చేశారు? అనే ప్రశ్నలతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో మృతుడిని ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్న వెంకట్‌గా గుర్తించారు. వెంకట్‌ ప్రైవేట్‌ ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు ముందు వెంకట్‌ కుటుంబ సభ్యులకు చేసిన ఫోన్‌ కాల్‌ ఇప్పుడు కేసులో కీలకంగా మారింది. 

గుర్తుతెలియని వ్యక్తులు తనను కిడ్నాప్‌ చేసినట్లు వెంకట్‌ కుటుంబ సభ్యులకు ఫోన్‌లో చెప్పినట్లు సమాచారం. తనకు ఏదో ఎవరో తనను చంపేస్తారనే అనుమానం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.అయితే మరికాసేపట్లో ఇంటికి వచ్చేస్తానంటూ కుటుంబ సభ్యులకు వెంకట్‌ చెప్పాడు. ఆ తర్వాత అతడి నుంచి ఎలాంటి ఫోన్‌ కాల్‌ రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇదే సమయంలో కోకాపేట్‌ నియోపోలిస్‌ వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతుడు వెంకట్‌ అని నిర్ధారించడంతో కుటుంబ సభ్యులకు విషాద వార్త తెలిసింది. 

వెంకట్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లి  నియోపోలిస్‌ వద్ద కారును ఆపి వెంకట్‌పై దాడి చేసి హత్య చేసినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వెంకట్‌ ప్రైవేట్‌ ఫైనాన్స్‌ వ్యాపారం నేపథ్యంలో ఆర్థిక లావాదేవీలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎవరితోనైనా ఆర్థిక వివాదాలు ఉన్నాయా? వ్యక్తిగత కక్షలేమైనా ఉన్నాయా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. హత్యకు అసలు కారణం ఏమిటి? వెంకట్‌ను కిడ్నాప్‌ చేసింది ఎవరు? హత్య వెనుక ఎవరున్నారు? అనే ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనా స్థలంలో క్లూస్‌ టీమ్‌ సేకరించిన ఆధారాలతో పాటు వెంకట్‌ ఫోన్‌ కాల్స్‌, పరిచయాలు, ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తూ దర్యాప్తు ముమ్మరం చేశారు.

 

 

 

[ PhD student murder, Narsingi crime news, CM Ranga Reddy,  cricket bat attack, Telangana latest news, student killed in Hyderabad,  CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand, Hyderabad police, Telugu One, Telugu News ]

By
en-us Political News

  
కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న వేళ.. దాని భవిష్యత్తుపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో సెప్టెంబర్ 22న జరిగిన 18 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని ఇంద్రపల్లి హరిణి హత్య ఉదంతం
మోసపోయాం.. గోసపడుతున్నాం..సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఆగ్రహం.!
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల అంశం మరోసారి అత్యంత వేడెక్కింది
విద్యావలయంలో గంజాయి మొక్క కలకలం..!
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
రా బిడ్డా.. అసెంబ్లీకి’.. KTRకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్.!
భారతీయ రైల్వేలో ప్రయాణం చేయడానికి ప్రయాణికులు చాలా కాలం ముందే టికెట్లను రిజర్వ్ చేసుకుంటూ ఉంటారు.
తండ్రి అంటే పిల్లలకు ఉండే ప్రాణం, ఆప్యాయత ఎంతో గొప్పవి. కానీ ఆ ప్రేమ కొన్నిసార్లు ఊహకందని వింత నిర్ణయాలకు దారితీస్తుంది.
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో తీవ్ర కలకలం రేపిన ఉదంతంలో ఒకరు దారుణ హత్యకు గురయ్యారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.