బాబు నిర్ణయాలకు ‘దేశం’ బలి?

Publish Date:Sep 18, 2012

Advertisement

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయాలకు ఆ పార్టీ బలపీఠం ఎక్కనుంది. పార్టీని పటిష్టం చేసే కంగారులో చంద్రబాబు ఎస్సీల్లో మాదిగలకు మద్దతు ప్రకటించారు. వర్గీకరణకు అనుకూలంగా ఓటేశారు. దీంతో ఒక వర్గానికైనా దగ్గరయ్యామని చంద్రబాబు చంకలుగుద్దుకున్నారు. తాజాగా మాదిగదండోరా రాష్ట్ర అధ్యక్షుడు మందాకృష్ణమాదిగ సొంతంగా రాజకీయపార్టీని నెలకొల్పనున్నారు. దీని కోసం ముమ్మరంగా ఏర్పాట్లూ చేసుకుంటున్నారు. అయితే మాలలు తెలుగుదేశం పార్టీకి దూరం కావాలని నిశ్చయానికి వచ్చారు. వీరిని కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలు ఆకర్షిస్తున్నాయి.

 

దీంతో తెలుగుదేశం పార్టీకి మాలల ఓటుబ్యాంకు దూరమైంది. అయితే ఈ విషయాన్ని గమనించిన చంద్రబాబు మాదిగలను వర్గీకరణ పేరుతో దగ్గర చేసుకునేందుకు కసరత్తులు చేశారు. దీనిలో భాగంగానే వారితో కలిసి ఆందోళనకార్యక్రమాలు సాగిస్తున్నారు. అయితే మందాకృష్ణ పెట్టబోయే పార్టీలో అభ్యర్థులందరూ మాదిగలే. పైగా, దండోరా జిల్లా కమిటీల సహాయంతో పార్టీని నిర్మిస్తున్నారు. అందువల్ల మాదిగలు వర్గీకరణ కోసమని చంద్రబాబుకు మద్దతు పలికినా, తిరిగి తమ పార్టీలోకి వెళ్లిపోతారు. కేవలం తెలుగుదేశం పార్టీలో ఏళ్ల నుంచి కొనసాగుతున్న మాదిగ సామాజికనేతలే మిగులుతారు. మాదిగల ఓటుబ్యాంకు మొత్తం మందాకృష్ణ వెనుకే నిలవాలని నిశ్చయించుకుంది. దీంతో తెలుగుదేశం పార్టీ వర్గీకరణ వైపు మొగ్గు చూపి ఒకవైపు మాలలకు, మరోవైపు మాదిగలకు దూరమయ్యే స్థితిలో ఉంది. దీన్ని పట్టించుకోకుండా చంద్రబాబు తమ వెనుక మాదిగలున్నారని భావించారు. వర్గీకరణ నిర్ణయాన్ని బలపరిచి చంద్రబాబు పార్టీని బలి చేశారని మాలలు అంటున్నారు. తమ మందాకృష్ణ మాట దాటి అడుగుకూడా కదపబోమని మాదిదిగలు చెబుతున్నారు. ఎస్సీల్లో కీలకమైన ఈ రెండు సామాజికవర్గాలూ దూరమయ్యాక మిగిలిన సామాజికవర్గాలు ప్రభావం అంతగా కనిపించదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

By
en-us Political News

  
గతంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరి వ్యక్తుల పేర్లపై ఉన్న ఆస్తులు, ఇటీవల  కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట బదిలీ అయ్యాయన్న రేవంత్ రెడ్డి..  హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఖరీదైన ఆస్తులు, ఫైవ్ స్టార్ హోటళ్లు, అపార్ట్‌మెంట్లు, సర్వీస్ ప్రాపర్టీల వివరాలను వెల్లడించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. జిల్లాలో మొత్తం రూ.345.78 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఉపాధి కోసం రష్యా వెళ్లిన తెలంగాణకు చెందిన నలుగురు యువకులు అనూహ్యంగా అక్కడి మిలిటరీ క్యాంపులో చిక్కుకున్నారని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేచింది.
‘ది ప్యారడైజ్’ సినిమాలో ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో మాజీ సీఎం కేసీఆర్‌ను పోలిన పాత్రను పోషిస్తున్న నటుడు ప్రియదర్శిని మాజీ మంత్రి హరీశ్ రావు కలిసి అభినందించారు.
లక్ష్మీ భాస్కర్‌ను ఏసీబీ అధికారులు సెప్టెంబర్ 22న అరెస్ట్ చేశారు. ఆయన 48 గంటలకు మించి కస్టడీలో ఉన్నట్లు నిమ్స్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలకు పైగా కస్టడీలో ఉంటే నిబంధనల ప్రకారం అరెస్టయిన తేదీ నుంచే సస్పెండ్ అయినట్లు పరిగణిస్తారు.
హైదరాబాద్‌ పాతబస్తీలో ఆన్‌లైన్‌ ద్వారా ఆహార పదార్థాలను విక్రయిస్తున్న సంస్థలపై తెలంగాణ ఫుడ్‌ సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపించారు
హైదరాబాద్‌ గచ్చిబౌలి గోపన్‌పల్లిలో హైడ్రా తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
ఓ బహిరంగ సభలో కేటీఆర్ కేసీఆర్ తప్పు చేశారంటూ చేసిన  వ్యాఖ్యను ఎత్తి చూపుతూ బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ కేటీఆర్ ఆ సభలో ఏమన్నారంటే.. కేసీఆర్ గతంలో సొంత నియోజకవర్గాలలో ఆయా ఎమ్మెల్యేలకే అధికారాలు కట్టబెట్టి తప్పు చేశారని వ్యాఖ్యానించారు.
తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో త్వరగా అంగీకారం కుదిరేలా చర్యలు తీసుకుని, అనుమతులు ఇప్పించాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ను
JNTU కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది.
సికింద్రాబాద్ బొల్లారం పరిధిలో జరిగిన సంచలనాత్మక ఆర్మీ ఆయుధాల చోరీ ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.