సుప్రీంలో తెలంగాణ ప్రభుత్వం కేవియెట్.. కేటీఆర్ కు ఇక చుక్కలే!

Publish Date:Jan 7, 2025

Advertisement

ఒక వైపు ఏసీబీ, మరో వైపు ఈడీ, ఇంకో వైపు తెలంగాణ సర్కార్ ఇలా కేటీఆర్ పై ముప్పేట దాడి చేస్తూ ఆయనను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. ఫార్ములా ఈ కార్ కేసులో ఏసీబీ నమోదు చేసిన కేసు కొట్టివేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. కనీసం అరెస్టు నుంచి మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు ఇవ్వాలన్న ఆయన విజ్ణప్తినీ తిరస్కరించింది. దీంతో  ఏసీబీ దూకుడు పెంచింది. ఫార్ములా ఈ రేస్ లో భాగస్వామి అయిన గ్రీన్ కో తెలంగాణ, ఏపీలోని కార్యాలయాలపై ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నది. అదే సమయంలో కేటీఆర్, ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఇద్దరి నివాసాలలో సోదాలకు అనుమతి తీసుకుంది. ఇక నేడే రేపొ ఈ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్ ను అరెస్టు చేయాడానికి పకడ్బందీగా అడుగులు వేస్తున్నది. 

ఈ నేపథ్యంలో తన క్వాష్ పిటిషన్ కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో కేటీఆర్ ఉన్నారని విశ్వసనీయంగా తెలిసింది. సుప్రీంను ఆశ్రయించే ఉద్దేశంతో ఆయన ఇప్పటికే తన లీగల్ టీమ్ తో చర్చిస్తున్నారు.  అలాగే పార్టీలోని ప్రముఖలతో కూడా ఆయన తన నివాసంలో సమావేశమయ్యారు. మాజీ మంత్రి హరీష్ రావు, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా కేటీఆర్ నివాసానికి చేరుకున్నారు. మొత్తంగా నేడో, రేపో కేటీఆర్ సుప్రీంను ఆశ్రయించే అవకాశాలున్నాయని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే అనూహ్యంగా తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేవియెట్ దాఖలు చేసింది. ఫార్ములా ఈ కార్ కేసులో కేటీఆర్ సుప్రీం కోర్టును ఆశ్రయించే యోచన చేస్తుండగానే రేవంత్ సర్కార్ ఒక అడుగు ముందుకు వేసి  ఒక వేళ కేటీఆర్ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే.. తమ వాదనలు కూడా వినాలని కోరుతూ సుప్రీం కోర్టులో కేవీయెట్ దాఖలు చేసింది.

 ఫార్ములా ఈ కార్ రేసింగ్ విషయంలో జరిగిన అవకతవకలు, అవినీతిలో కేటీఆర్ ప్రమేయం ఉందనడానికి తమ వద్ద ఆధారాలున్నాయని ఆ పిటిషన్ లో పేర్కొంది. అలాగే ఈ కేసులో భాగస్వామి అయిన గ్రీన్ కో.. బీఆర్ఎస్ మధ్య క్విడ్ ప్రోకో వ్యవహారానికి సంబంధించిన ఆధారాలూ ఉన్నాయని పేర్కొంటూ.. కేటీఆర్ సుప్రీంను ఆశ్రయిస్తే ఆయన పిటిషన్ తో పాటు తమ పిటిషన్ ను కూడా విచారించాలనీ, తమ వాదననూ వినాలని కోరుతూ తెలంగాణ సర్కార్ సుప్రీం కోర్టులో కేవియెట్ దాఖలు చేసింది. 

By
en-us Political News

  
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.