తెలంగాణలో ఎవరి గోల ఏమిటో?

Publish Date:Dec 13, 2022

Advertisement

ఆంధ్ర ప్రదేశ్ రెండుగా విడిపోయి, ఎనిమిదేళ్లు నిండి పోయాయి, అయినా ఇంకా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య  చాలా విషయాల్లో దాయాది తగవులు మాత్రం అలానే కొనసాగుతున్నాయి. విభజన చట్టంలోని అనేక అంశాలు అపరిష్కృతంగానే ఉన్నాయి. విబేధాలు, విమర్శలు, కోర్టు వివాదాలు కొనసాగుతున్నాయి. అయినా అక్కడ ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ, ఇక్కడ తెలంగాణలో అధికారంలో ఉన్న తెరాసల మధ్య స్నేహ పూర్వక సంబంధాలే కొనసాగుతున్నాయి.

అలాగే  ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యక్తిగతంగా మంచి మిత్రులుగానే మెలుగుతున్నారు. చిన్న చిన్న పొర పొచ్చాలు ఉన్నా రాజకీయ ,స్నేహ సంబంధాల విషయంలో మాత్రం ఇచ్చి పుచ్చుకునే ధోరణి కొనసాగుతోంది. భారాస కు వైకాపా రెడ్ కార్పెట్  స్వాగతం పలికిందంటే, ఇక ఆ రెండు పార్టీల మధ్య స్నేహ బంధంగా ఎంత పటిష్టంగా వుందోవేరే చెప్పనక్కరలేదు.

ఆలాగే, ఉభయ తెలుగు రాష్టాల రాజకీయాల విషయానికి వస్తే  ఎవరిదారి వారిది, అన్నట్లుగా  అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎవరి పరిధికి వారు పరిమితమై రాజకీయం చేస్తున్నారు. అయితే, ఇంతవరకు ఒక లెక్క, ఇప్పడు మరో లెక్క అన్నట్లుగా కథ మారింది. ముఖ్యంగా, తెలంగాణలో రాజకీయ ఈక్వేషన్స్ వేగంగా మారి పోతున్నాయి. అధికార  తెరాసని వరసగా రెండు సార్లు గెలిపించిన తెలంగాణ సెంటిమెంట్, ఇప్పడు అంత వేడిగా లేదు. చాలా వరకు  చల్లబడింది. అంతేకాదు  పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో కుటుంబ పాలన, కుటుంబ అవినీతి పెరిగిపోయిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్న నేపధ్యంలో  తెలంగాణ సెంటిమెంట్ తిరగబడింది. మరో వంక తెరాస,భారాసగా పేరు మార్చుకుని జాతీయ రాజకీయాలపై దృష్టి కేంద్రీకరించడంతో కొన ఊపిరితో మిగిలిన ఆ కాస్త సెంటిమెంట్  కూడా తుడిచి పెట్టుకు పోయింది. 

ఈ నేపధ్యంలో తెలంగాణ రాజకీయాలలో ఏపీ పాలిటిక్స్  వచ్చి కలవడంతో తెలంగాణ రాజకీయ లెక్కలు మారుతున్నాయనే చర్చకు తెర లేచింది. నిజానికి తెలంగాణ రాజకీయాలు 2018 ఎన్నికల నుంచి చాలా దూరం వచ్చాయి.  2018లోనూ బీజేపీ బరిలో ఉన్నా, తెరాస,కాంగ్రెస్ పార్టీలను మాత్రమే ప్రజలు ప్రధాన ప్రత్యర్దులుగా గుర్తించారు. 2014లో  తెలుగు దేశంతో పొత్తు జనసేన మద్దతుతో పోటీచేసి ఐదు అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న బీజేపీ 2018లో నాలుగు సీట్లు కోల్పోయి, గోషామహల్ ( రాజా సింగ్) స్థానం ఒక్కటి మాత్రమే నిలబెట్టుకుంది. అయితే, ఆ తర్వాత ఆరు నెలలకే జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా నాలుగు లోక్ సభ స్థానాలు గెలుచుకుంది. ఇక అక్కడి నుంచి మునుగోడు వరకు కథ మారుతూ వచ్చింది. తెరాసకు ప్రధాన ప్రత్యర్ధి స్థానం  కోసం జరిగిన పోటీలో బీజేపీ కాంగ్రెస్ పై పైచేయి సాధించింది.  

ఈ నేపధ్యంలో, తెలంగాణ ప్రభుత్వ వ్యతిరేక ఓటును మరింతగా చీల్చేందుకు, తెరాస వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అందులో భాగంగానే  గురితప్పి తెలంగాణలో వాలిన జగనన్న విడిచిన బాణం, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇమేజ్  పెంచేందుకు, ఆమెను తెరాస ప్రత్యర్ధిగా చూపేందుకు, ఆమె పాదయాత్రను అడ్డుకోవడం, అరెస్ట్, గృహ నిర్భందం, రోడ్ (భైఠాయింపు) షో డ్రామాలతో రక్తి కట్టిస్తున్న తెరాస నాయకత్వం, ఇప్పడు ఏపీకి చెందిన మరో, ‘స్టార్’ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ ను తెర మీదకు తెచ్చింది. ఏపీలో ప్రస్తుతానికి బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్  తెలంగాణ తెర మీదకు ఎంట్రీ ఇచ్చారు. ఏపీలోనే కాదు  తెలంగాణలోనూ జనసేన పోటీ చేస్తుందనే సంకేతాలు ఇచ్చారు. జనసేన 32 స్థానల్లో పోటీ చేస్తుందని ప్రచారం జరుగుతోంది. బీజేపీ అంతర్గత లెక్కల్లో, అదే విధంగా కేసీఆర్ సర్వేల్లో బీజేపీ 32 స్థానల్లో తెరాసకు గట్టి పోటీ ఇస్తుందని, ఆ 32 స్థానాల్లో బీజేపీ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు. ఇప్పడు పవన్ కళ్యాణ్  32 సీట్లలో పోటీ చేస్తారని ప్రచరం జరగడంతో పవన్, కేసేఆర్ వదిలిన బాణం అనే అనుమానానికి బలం చేకురుతోందని బీజేపీ నాయకులు అంటున్నారు.

అయితే ఇది నాణానికి ఒక వైపు, ఉహాగానం, అయితే, మరో వైపున షర్మిల బీజేపీ టచ్ లోకి వెళ్ళారని  అందుకే ఆమె అరెస్ట్ ఎపిసోడ్ లో ప్రధాని మోడీ సహా బీజేపీ నేతలు ఆమెకు సంఘీభావం ప్రకటించారని తెరాస నాయకులు అనుమానాలు వ్యక్త పరుస్తున్నారు. అదే విధంగా ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం అవినీతిపై ఈడీ,సిబిఐలకు ఫిర్యాదు చేసిన షర్మిల త్వరలో ఢిల్లీకి వెళ్లి కేసీఆర్ ప్రభుత్వం పైన మరిన్ని ఫిర్యాదులు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకే కేసీఆర్ ఆమెను టార్గెట్ చేశారని  మొదటి సారిగా  పాద యాత్రను అడ్డుకుని అరెస్ట్ చేశారని అంటున్నారు.

అయితే  పవన్ కళ్యాణ్ విషయంలో ఇప్పటికే క్లారిటీతో ఉన్న బీజేపీ రాష్ట్ర నాయకులు  షర్మిలతో సంబంధాల విషయంలో  మౌనంగా ఉండడంతో అనుమానాలు బలపడుతున్నాయని అంటున్నారు. తెలంగాణలో జనసేనతో తమ పార్టీకి పొత్తు ఉండదని బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గతంలోనే స్పష్టం చేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నబీజేపీ  నాయకులు షర్మిల విషయంలో మాత్రం మౌనంగా ఉంటున్నారు. నిజానికి, బీజేపీ నాయకత్వం  షర్మిలతోనే కాదు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో  ఉభయ తెలుగు రాష్ట్రాలలో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉందని బీజేపీ సీనియర్ నాయకుడు ఒకరు, చెప్పారు. అయితే 2018 లో, కేసేఆర్, చంద్రబాబుబు బూచిగా చూపించి, తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని  కొంచెం అటూ ఇటవుతోందని అంటున్నారు.

అదలా ఉంటే ఉహా గానాలు, వ్యూహా గానాలు ఎలా ఉన్నా, ఇప్పటికిప్పుడు బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకోదని,  నిజానికి  బీజేపీనే కాదు తెరాస సహా ఏ పార్టీ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోదని విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికలు సమీపించే వరకు ఆట ఆలా సాగుతూనే ఉంటుందనే మాట కూడా పొలిటికల్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తోంది.అంతవరకు ఎవరి గోల వారిది ..చూసి, విని ఆనందించండి.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్.. ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ల్పపీడన ప్రభావంతో జులై మూడో వారంలో దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మధ్య భారతదేశం, తూర్పు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న ఈ వినూత్న నిరసన ప్రదర్శనలకు మెల్లిమెల్లిగా జనం ముఖం చాటేస్తున్నారు. పరీక్షల అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్‌తో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం.. ఆరంభంలో లక్షలాది మంది యువతను ఆకర్షించింది. అయితే క్రమక్రమంగా జనాదరణ కోల్పోయి ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆ పార్టీ నిరసనలు తూతూ మంత్రంగా మారాయి.
ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో స్థానిక ఎన్నికల జరిగే అవకాశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఇప్పటికే తమ పార్టీ శ్రేణులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే ఎన్నికల వ్యూహాలను పక్కాగా అమలు చేయడానికి కూటమి పార్టీల ముఖ్య నేతల కీలక సమావేశం బుధవారం జరగనుంది.
హరీష్ రావు ఇప్పుడు తన కుటుంబ వ్యాపారమైన మిల్చీ మిల్క్  విషయంలో తలెత్తుతున్న ప్రశ్నలకు, వెల్లువెత్తుతున్న విమర్శలకూ సమాధానం చెప్పుకోలేక సతమతమౌతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.