టార్గెట్ 175 ఆఫ్ 175.. మరి అభ్యర్థులెవరు?

Publish Date:Dec 13, 2022

Advertisement

వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్... పక్కాగా ఫిక్స్ అయిపోయారు. అదీ కూడా మొత్తం 175కి 175 అసెంబ్లీ స్థానాలు తమ పార్టీ ఖాతాలో పడి పోవాలనే లక్ష్యంతో సీఎం జగన్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఆ క్రమంలో పని చేసిన వారికే మళ్లీ టికెట్లు.. అంటూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సమీక్షా సమావేశంలో సీఎం జగన్ క్లియర్ కట్‌గా స్పష్టం చేశారు. 

దీంతో తమకు మరో  ఛాన్స్ లేదని ఇప్పటికే వైసీపీలోని   పలువురు ఎమ్మెల్యేలు ఒక నిర్ణయానికి వచ్చేశారు.  మరోవైపు.. పలువురు ఎంపీలను ఈ సారి అసెంబ్లీకి పంపాలని సీఎం జగన్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. వారిలో విశాఖ ఎంపీ .వి.వి.సత్యనారాయణ, కాకినాడ ఎంపీ వంగా గీత, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, బాపట్ల ఎంపీ మార్గాని భరత్, హిందూపురం ఎంపీ గోరంట్ల మాదవ్ ఉన్నట్లు సమచారం. 

విశాఖపట్నం లోక్‌సభ సభ్యుడు ఎం.వి.వి.సత్యనారాయణ సంగతే తీసుకుంటే.. విశాఖ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటన్నింటిలో.. ఎంవీవీ సత్యనారాయణపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సొంత పార్టీలోని నేతలు సైతం ఆయనపై అసంతృప్తితో రగలిపోతున్నారని.. ఈ విషయాన్ని పసిగట్టిన ఎంపీ సత్యనారాయణ.. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరిలోకి దిగుతానంటూ తన సన్నిహితుల వద్ద పేర్కొన్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానం  వద్ద కూడా ఆయన ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దీంతో విశాఖ తూర్పు లేదా ఉత్తరం నుంచి ఎంవీవీ సత్యనారాయణ రంగంలోకి దిగే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. 

ఇక కాకినాడ లోక్‌సభ సభ్యురాలు వంగా గీత కూడా ఈసారి అసెంబ్లీకి పోటీ చేసి.. మంత్రి పదవి దక్కించుకోవాలని చూస్తున్నారని తెలుస్తోంది. ఆ క్రమంలో కాకినాడకు కూత వేటు దూరంలోని పిఠాపురం నుంచి ఆమె బరిలోకి  దిగే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ఇక్కడున్న పెండెం దొరబాబుపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆయన్ని జగన్ పక్కన పెట్టినట్లు చెబుతున్నారు... దీంతో వచ్చే ఎన్నికల్లో వంగా గీత పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి  పోటీ చేస్తారని తెలుస్తోంది. 
    
రాజమండ్రి లోక్‌సభ సభ్యుడు మార్గాని భరత్ కూడా ఈ సారి అసెంబ్లీపై కన్ను వేసినట్లు సమాచారం. ఆయనపై ఎలాంటి ఆరోపణలు లేకున్నా.. సొంత పార్టీలోని నేతల్లో ఆయనపై పీకల వరకు అసంతృప్తి ఉందని తెలుస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి లోక్‌సభకు పోటీ చేస్తే.. సొంత పార్టీలోని వారే పనిగట్టుకొని మరీ తనను ఓడిస్తారని భరత్‌కు క్లియర్ కట్‌గా అర్థమైందని.. ఈ నేపథ్యంలో రాజమండ్రి నగర అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు భరత్.. తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. ఓ వేళ ఆయన అసెంబ్లీలో అడుగు పెడితే.. బీసీ వర్గానికి చెందిన తనకు జగన్ కేబినెట్‌లో బెర్త్ గ్యారంటీ అని భరత్ పూర్తిగా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.    

ఇక మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి.. నరసారావుపేట నుంచి   పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బందరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నానికి ఎంపీ బాలశౌరి మధ్య పచ్చగడ్గి వేస్తే భగ్గుమంటోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బాలశౌరిని బందరు లోక్‌సభ స్థానం నుంచి కాకుండా మరో చోటు నుంచి పోటీ చేయించేందుకు పేర్ని నాని కంకణం కట్టుకొని మరీ జగన్ వద్ద లాబీయింగ్ చేస్తున్నట్లు ఓ చర్చ అయితే బందరులో హల్‌చల్ చేస్తోంది. అదీకాక ప్రస్తుతం నరసారావుపేట ఎంపీ లావు కృష్ణాదేవరాయులు.. రాజధాని రైతులకు మద్దతు తెలపడంతో.. తాడేపల్లి ప్యాలెస్ పెద్దల ఆగ్రహానికి ఆయన గురయ్యారు. ఈ నేపథ్యంలో కృష్ణదేవరాయులు... సైకిల్ పార్టీలోకి జంప్ చేసేందుకు తన ప్రయత్నాలు చేసుకొంటున్నట్లు తెలుస్తోంది. 

బాపట్ల ఎంపి నందిగం సురేష్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి.. మంత్రి కావాలని ఆరాటపడుతున్నారు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరినట్లు తెలుస్తోంది. అయితే  జిల్లాలో ఎక్కడా అసెంబ్లీ సీట్లు ఖాళీ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు.. హోం శాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఓ వేళ.. ఆమె పార్టీ మారితే.. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ స్థానం నుంచి నందిగం సురేష్‌ను నిలిపే అవకాశం ఉందని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి.

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్.. న్యూడ్ వీడియోతో గట్టిగానే మకిలి అంటించుకొన్నారు. దీంతో పార్టీలోనే కాదు.. ప్రజల్లో సైతం ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఓ వేళ ఆయనపై వేటు వేస్తే.. వచ్చే ఎన్నికల్లో ఆయన సామాజిక వర్గ ఓట్లు దూరమయ్యే పరిస్థితి ఉందని.. ఆ క్రమంలోనే జగన్ అండ్ కో.. గోరంట్ల విషయంలో కాస్త వెనక్కి తగ్గిందనే  ఓ టాక్ అయితే అప్పట్లో బాగానే నడిచింది. అయితే వచ్చే ఎన్నికల్లో హిందూపురం ఎంపీగా మరో వ్యక్తిని నిలబెట్టే అవకాశాన్ని జగన్ పార్టీ పరిశీలిస్తుంన్నదనే   చర్చ   ఫ్యాన్ పార్టీలో వాడి వేడిగా సాగుతోంది.  ఈ నేపథ్యంలో గోరంట్ల మాధవ్‌ను పెనుకొండ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దింపేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

 కడప ఎంపి వైయస్ అవినాశ్ రెడ్డి.. వైయస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంతే కాదు.. సీఎం   జగన్ ఫ్యామిలీ తప్ప..ఆ కుటుంబంలోని మరో ఫ్యామిలీ   అవినాశ్  రెడ్డికి వచ్చే ఎన్నికల్లో మద్దతు ఇచ్చే అవకాశాలు ఇసుమంతైనా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో వైఎస్ అవినాశ్ రెడ్డిని రాజంపేట ఎమ్మెల్యేగా బరిలో దింపాలని జగన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇక్కడ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి.. గతంలో టీడీపీలో ఉండి.. ఎన్నికలకు ముందు జగన్ పార్టీలో చేరారు. ఆయనను ప్రస్తుతం పార్టీ అధిష్టానం సాధ్యమైనంత దూరం పెట్టింది. దీంతో ఆయన మళ్లీ టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. 

మరో వైపు అన్నమయ్య జిల్లా కేంద్రంగా  రాజంపేటను కాదని  రాయచోటిని  చేయడంపై ప్రజల్లో ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దాంతో ఈ స్థానం నుంచి  ఆవినాశ్ రెడ్డిని బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయని పార్టీలో ఓ టాక్  వైరల్ అవుతోంది.

By
en-us Political News

  
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్.. ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ల్పపీడన ప్రభావంతో జులై మూడో వారంలో దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మధ్య భారతదేశం, తూర్పు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న ఈ వినూత్న నిరసన ప్రదర్శనలకు మెల్లిమెల్లిగా జనం ముఖం చాటేస్తున్నారు. పరీక్షల అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్‌తో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం.. ఆరంభంలో లక్షలాది మంది యువతను ఆకర్షించింది. అయితే క్రమక్రమంగా జనాదరణ కోల్పోయి ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆ పార్టీ నిరసనలు తూతూ మంత్రంగా మారాయి.
ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో స్థానిక ఎన్నికల జరిగే అవకాశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఇప్పటికే తమ పార్టీ శ్రేణులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే ఎన్నికల వ్యూహాలను పక్కాగా అమలు చేయడానికి కూటమి పార్టీల ముఖ్య నేతల కీలక సమావేశం బుధవారం జరగనుంది.
హరీష్ రావు ఇప్పుడు తన కుటుంబ వ్యాపారమైన మిల్చీ మిల్క్  విషయంలో తలెత్తుతున్న ప్రశ్నలకు, వెల్లువెత్తుతున్న విమర్శలకూ సమాధానం చెప్పుకోలేక సతమతమౌతున్నారు.
విజయ్ ప్రస్తుతం చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డు (ఈసీఆర్) లోని నీలాంకరి నివాసంలో ఉంటున్నారు. అక్కడి నుంచి ఆయన సచివాలయం ఉన్న రాజాజీ రోడ్డుకు రోజువారీ ప్రయాణం చేస్తున్నారు.
భౌగోళికంగా, రాజకీయంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు వేర్వేరు రాష్ట్రాలుగా విడిపోయినా, భాష, సంస్కృతి పరంగా తెలుగు ప్రజల మధ్య బంధం విడదీయరానిదని అన్నారు. తెలుగు సినిమా రంగానికి ప్రజలను ఏకం చేసే అద్భుతమైన శక్తి ఉందంటూ ఆమె వ్యాఖ్యానించారు.
తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఆదివారం నిర్వహించిన టీడీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ నేతల సమావేశం ఉద్రిక్తంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగాయి.
తెలంగాణ రక్షణ సేన పార్టీకి గుర్తింపు ఇవ్వాలని పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు.
సీఎం అవినీతి బండారం మొత్తం బయటపడిందన్న కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్ తీరు పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజా రంజక పాలనను పూర్తిగా గాలికొదిలేసి కేవలం ప్రతిపక్షాలపై నిందలు వేయడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.