కాంగ్రేసు గాలానికి చిక్కిన తెలంగాణా యంపీలు
Publish Date:Dec 5, 2012
Advertisement
ఒకటా! రెండా! వందసంవత్సరాలుగా కష్టపడి నేర్చిన విద్య అది. అందుకే కాంగ్రేసు అంత సులువుగా మన తెలంగాణా యంపీలకి గాలంవేసి పట్టేసి తనదారికి తెచ్చుకోగలిగింది. ఇప్పుడే అందిన వార్త ఏమిటంటే, ఈ నెల 29వ తేదిన కాంగ్రేసు ‘అఖిల పక్ష సమావేశం’ నిర్వహిస్తామని ఒట్టేసి చ్చెపడంతో, విజయం సాదిన్చేసామంటూ రెండువేళ్ళు చూపించుతూ యఫ్ డి ఐ బిల్లు పై కాంగ్రేసుకి అనుకూలంగా ఓటేసేందుకు సభలోకి ఉరికేరు మన తెలంగాణా యంపీలు అందరూ. ఇంతకీ విజయం సాదించింది వాళ్ళా లేక వాళ్ళని బుట్టలో వేసుకొన్న కాంగ్రెస్ అధిష్టనమా? వాళ్ళే చెప్పాలి మరి. ‘అఖిల పక్ష సమావేశం’ అనే ఒక ఐడియా మొదటినుండి తన బుర్రలో ఉంచుకొనే, కాంగ్రేసు అంట దైర్యంగా ఉంది. లేక పొతే అప్పటికి అప్పుడు ఇటువంటి వాళ్ళని దారికి తెచ్చుకోవాలంటే సాద్యమా? అసలు, ఆ ముక్క కూడా అనకుండానే వాళ్ళు దారికి వస్తారేమోనని , నిన్న షిండే కమలనాథుల ద్వారా ప్రయత్నించింది కాంగ్రేసు. అప్పుడు వాళ్ళు లొంగల పోయేసరికి తన అమ్ముల పోదిలోంచి ఒక తుప్పు పట్టిన బాణం (‘అఖిల పక్ష సమావేశం’-ఐడియా) బయటికి తీసి వాల్లమీదకి వదిలింది అంతే అందరూ పడిపోయేరు. మరి ఇటువంటి మరెన్ని బాణాలు కాంగ్రేసు అమ్ముల పొదిలో ఉన్నాయో ఎవరికీ తెలుసు? ఒక దెబ్బకి రెండు పిట్టలు కొట్టే అవకాశం చేతిలోంచి జారి పోతుంటే ఏమిచేయ లేక కే.సి.ఆర్. కూడా వాళ్ళని కసితీర తిట్టుకొంటూ కాంగ్రేసుకి వ్యతిరేకంగా ఓటు వేసేందుకు వాళ్ళ వెనుకే అతనూ లోపలి పోయేడని మరో తాజా వార్త. ఇక, రేపటి నుండి వాళ్ళని కే.సి.ఆర్. అతని అనుచరులు ఎలా యేకిపారేస్తారో మరి తలుచుకొంటేనే వాళ్ళ ఒళ్ళు గగుర్పోడవకమానదు. తెలంగాణా తిరిగి రావడం కన్నా, అక్కడే డిల్లీలోనే మొహం దాచుకొంటే మేలనుకొనే అవకాశము కూడా వాళ్ళకి ఉంది. అప్పుడే బి.జే.పి, ‘అఖిల పక్ష సమావేశం’ పేరు చెప్పి కాంగ్రేసు కొత్త నాటకాం మొదలు పెట్టిందని దుయ్యబట్టడం మొదలు పెట్టేసింది. కాంగ్రేసు ‘అఖిలపక్ష సమావేశం ఐడియా’ వినగానే మొదట తెరాస నేత ఈటెల రాజేందర్ కూడా ఇదే మాట చెపుతూ, తెలంగాణా కాంగ్రేసు యంపీలని బుట్టలో పడవద్దని అయన మరీ మరీ హెచ్చరించినా పాపం ఫలితం లేకపోయింది. అయినా, సోనియమ్మా ఆగ్రహానికి గురయ్యే దైర్యం కాంగ్రేసులో ఎవరికి ఉంది? ఆమెను కాదని పార్టీ వీడితే, మన తెలంగాణా యంపీలు కెసిఆర్ వెనుక తిరుగగలరా? అందుకే, ముందు కాస్త బెట్టు చేసి తెలంగాణా ప్రజల ముందు హీరోయిజం ప్రదర్శించినా, తరువాత కాంగ్రేసు దారిలోనే నడిచేరు వాళందరూ. అలాగని, వాళ్ళంతా హైదరాబాదు తిరిగి వచ్చేక ప్రెస్సు మీట్స్ పెట్టి డాంబికాలు పలుకకమానారు, తెరాస, టి-జే.యే.సి. మరియు బిజెపిలూ కలిసి కట్టుగా వాళ్ళ వెంట పడక మానవు. కొస మెరుపు ఏమిటంటే, ప్రస్తుతం పార్లమెంటులోనే ఉన్నలగడపాటి హడావుడిగా బయటకి వచ్చి మీడియాని పిలిచి ‘ఎవరెన్ని సమావేశాలు పెట్టుకొన్నపటికీ ఇప్పుడప్పుడే తెలంగాణా మాత్రం ఖచ్చితంగా రాదు’ అని గబ గబా చెప్పేసి మళ్లీ వచ్చినంత వేగంగా సభలోకి హడావుడిగా వెళ్లి పోయాడు.
http://www.teluguone.com/news/content/telangana-mps-23-19520.html
58 సంవత్సరాల వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్
పెంపుడు కుక్క యజమానిని కాల్చింది అంటే ఏదో ఫన్ని వీడియో అనుకుంటారు చాలా మంది. ఎందుకంటే ఫన్ని వీడియోలలో ఎక్కువగా అలాంటి సన్నివేశాలు చూసి నవ్వుకుంటాం. నిజజీవితంలో కూడా ఇలాంటి సంఘటన జరిగిందని తెలిసి ఆశ్చర్యపడుతున్నారు.
ఢిల్లీ లో గత నెల 16 వ తేదీన జరిగిన పారా మెడికల్ స్టూడెంట్ ఫై జరిగిన అత్యాచారంలో ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.
ఓ హత్య కేసులో నిందితునిగా ఉన్న గుంటూరు జిల్లా గురజాల శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు బెయిల్ ప్రయత్నాలకు పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గండి కొట్టారు. కాంగ్రెస్ నాయకుడు ఉన్నం నరేంద్ర హత్య కేసులో యరపతినేని మూడవ నిందితునిగా ఉన్న విషయం తెలిసిందే.
గత నెల 28 న ఢిల్లీ లో తెలంగాణాఫై జరిగిన అఖిల పక్ష సమావేశంలో తెలంగాణా అనుకూల వైఖరి తీసుకొని ఆ ప్రాంతంలో ఎలాగో గట్టేక్కామని తెలుగు దేశం పార్టీ భావిస్తున్న సమయంలో ఆ పార్టీకి చెందిన ఆంధ్రా ప్రాంత నేతల నుండి పార్టీకి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇంతవరకు చంద్రబాబు ‘రెండుకళ్ళ’ సిద్దాంతంతో తెలంగాణా ప్రజలను మోసంచేస్తున్నాడని నిందించిన తెరాస, మొన్నజరిగిన అఖిలపక్షసమావేశంలో తెలుగుదేశంపార్టీ తెలంగాణాకి అనుకూల వైఖరిని ప్రకటించిన తరువాత, ఆపార్టీని మెచ్చుకోలేక, వ్యతిరేకించనూ లేక తెరాస ఇబ్బందుల్లో పడినట్లు కనిపిస్తోంది.
అసలే పోర్న్ స్టార్..ఇక జిస్మ్ల్ చిత్రంలో తన అందాలతో యువతను మత్తెక్కించి చిత్తుచేసింది. అలాంటి పోర్న్ స్టార్ డిసెంబరు 31న ఓ వేదిక మీద డాన్స్ చేయాలంటే మాటలా. తన ఫాలోయింగ్ ను బట్టి తను కూడా ఉంటుంది. అందం ఉన్నప్పుడు చూపిస్తేనే ఎవరయినా చూస్తారు.
అమెరికాకు చెందిన యువతి ఒలీవియా కల్ఫో మిస్ యూనివర్స్-2012గా ఎంపికయ్యారు. ఫిలిప్పిన్స్, వెనిజులాకు చెందిన యువతులు మిస్ యూనివర్స్ పోటీల్లో రెండు, మూడో స్థానాల్లో నిలిచారు. భారత్‌కు చెందిన అందాల సుందరి శిల్పాసింగ్ టాప్-16వరకు వచ్చి నిలిచిపోయారు.
ఈ నెల 28 న ఢిల్లీ లో జరిగే అఖిల పక్ష సమావేశంలో తెలంగాణా కు వ్యతిరేకంగా మాట్లాడితే, తెలుగు దేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణా లో చేస్తున్న పాదయాత్రలు కాస్తా పరుగు యాత్రలుగా మారతాయని తెలంగాణా రాష్ట్ర సమితి ఎంఎల్ఎ కే. తారక రామా రావు హెచ్చరించారు.
అగ్రరాజ్యం అమెరికాలో ఉన్మాదుల కాల్పుల పర్వం కొనసాగుతూనే ఉంది. అమాయకుల ప్రాణాలకు అక్కడ విలువ లేదని వరుస సంఘటనలు రుజువు చేస్తున్నాయి.
మాజీ ఎం ఎల్ సి కాసాని జ్ఞానేశ్వర్ వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్దం చేసుకున్నారు.
ఇబ్రహీంపట్నంలో ఓ యువకుడు తనను ప్రేమించడం లేదని ఓ విద్యార్ధిని గొంతు కోసి చంపేశాడు. ఇబ్రహీంపట్నం కు చెందిన బాలరాజ్, భాగ్యలతల మొదటి కుమార్తె నిఖిత బికాం చదువుతూ, సిఏ కోచింగ్ తీసుకొంటోంది. బుధవారం సాయంత్రం రాఘవేందర్ ఆమె ఇంట్లోకి వచ్చి గొంతు కోసి చంపాడు.
నా తండ్రి విగ్రహాన్ని పార్లమెంటులో పెట్టి ఒక్కదాన్నే క్రెడిట్ కొట్టేయాలన్న ఆలోచన నాకు లేదు. నా తమ్ముడు బాలకృష్ణ అన్న మాటలు నాకు చాలా బాధకలిగించాయి. ఎన్టీఆర్ విగ్రహం అందరం కలిసి ఇద్దామని నా ఇంటికి వచ్చింది నిజమే. అయితే కుటుంబ సభ్యులు రాసిన లేఖ మీద సంతకం చేయాలని నన్ను అడగలేదు.





