ఆమెను హింసించింది ఆ మైనరే !
Publish Date:Jan 5, 2013
Advertisement
ఢిల్లీ లో గత నెల 16 వ తేదీన జరిగిన పారా మెడికల్ స్టూడెంట్ ఫై జరిగిన అత్యాచారంలో ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇందులో ఓ మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. అత్యాచారం అనంతరం ఆ అభాగ్యురాలిని బస్సులోనుండి తోసివేయాలనే నిర్ణయం తీసుకొనడంతో పాటు, ఆమెను బస్సులో చిత్ర హింసలకు గురి చేసిన ఆ బాలుడు మాత్రం ప్రస్తుతం కఠిన శిక్ష నుండి మినహాయింపు పొందే అవకాశం ఉంది. ఉద్యమకారులతో పాటు, పోలీసులకు కూడా మింగుడు పడని ఈ విషయంలో ఏమీ చేయలేని పోలీసులు ఆ బాలుడి పేరును చార్జ్ షీట్ లో నుండి తొలగించారు. ఇప్పటి చట్టాల ప్రకారం బాల నిందితులు ఎంత నేరానికి పాల్పడినా మూడు సంవత్సరాలకు మించి జైలులో పెట్టడానికి వీలు లేదు. అసలు బస్సులో వారందరినీ అత్యాచారానికి ఉసిగొల్పింది ఆ బాలుడేనని సమాచారం ! ఆ యువతిఫై ఆ బాలుడు రెండు సార్లు అత్యాచారం చేశాడు కూడా. ఆమె జననాంగాలలోకి రాం సింగ్ తో కలిసి రాడ్ దూర్చడం వంటి దారుణ పనులకు ఒడిగట్టిన ఆ బాలుడు ప్రస్తుతం మైనర్ అయిన కారణంగా అతి తక్కువ శిక్షతో బయట పడే అవకాశం ఉంది. మైనర్ అయినా కూడా ఆ బాలుడు చేసిన పనులు దారుణంగా ఉన్నాయని, అవసరమైతే ఈ విషయంలో చట్టాలను సవరించాలని ఆ యువతి సోదరుడు మీడియా తో అన్నారు. ఈ కారణాలతో బాల నేరస్తుల చట్టాన్ని సవరించాలనే డిమాండ్ ఊపందుకుంటోంది.సాక్షాత్తు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తేజేంద్ర ఖన్నా కూడా ఇలా డిమాండ్ లు చేస్తున్న వారిలో ముందు వరసలో ఉన్నారు.
http://www.teluguone.com/news/content/delhi-rape-minor-23-20239.html
58 సంవత్సరాల వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్
పెంపుడు కుక్క యజమానిని కాల్చింది అంటే ఏదో ఫన్ని వీడియో అనుకుంటారు చాలా మంది. ఎందుకంటే ఫన్ని వీడియోలలో ఎక్కువగా అలాంటి సన్నివేశాలు చూసి నవ్వుకుంటాం. నిజజీవితంలో కూడా ఇలాంటి సంఘటన జరిగిందని తెలిసి ఆశ్చర్యపడుతున్నారు.
ఓ హత్య కేసులో నిందితునిగా ఉన్న గుంటూరు జిల్లా గురజాల శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు బెయిల్ ప్రయత్నాలకు పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గండి కొట్టారు. కాంగ్రెస్ నాయకుడు ఉన్నం నరేంద్ర హత్య కేసులో యరపతినేని మూడవ నిందితునిగా ఉన్న విషయం తెలిసిందే.
గత నెల 28 న ఢిల్లీ లో తెలంగాణాఫై జరిగిన అఖిల పక్ష సమావేశంలో తెలంగాణా అనుకూల వైఖరి తీసుకొని ఆ ప్రాంతంలో ఎలాగో గట్టేక్కామని తెలుగు దేశం పార్టీ భావిస్తున్న సమయంలో ఆ పార్టీకి చెందిన ఆంధ్రా ప్రాంత నేతల నుండి పార్టీకి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇంతవరకు చంద్రబాబు ‘రెండుకళ్ళ’ సిద్దాంతంతో తెలంగాణా ప్రజలను మోసంచేస్తున్నాడని నిందించిన తెరాస, మొన్నజరిగిన అఖిలపక్షసమావేశంలో తెలుగుదేశంపార్టీ తెలంగాణాకి అనుకూల వైఖరిని ప్రకటించిన తరువాత, ఆపార్టీని మెచ్చుకోలేక, వ్యతిరేకించనూ లేక తెరాస ఇబ్బందుల్లో పడినట్లు కనిపిస్తోంది.
అసలే పోర్న్ స్టార్..ఇక జిస్మ్ల్ చిత్రంలో తన అందాలతో యువతను మత్తెక్కించి చిత్తుచేసింది. అలాంటి పోర్న్ స్టార్ డిసెంబరు 31న ఓ వేదిక మీద డాన్స్ చేయాలంటే మాటలా. తన ఫాలోయింగ్ ను బట్టి తను కూడా ఉంటుంది. అందం ఉన్నప్పుడు చూపిస్తేనే ఎవరయినా చూస్తారు.
అమెరికాకు చెందిన యువతి ఒలీవియా కల్ఫో మిస్ యూనివర్స్-2012గా ఎంపికయ్యారు. ఫిలిప్పిన్స్, వెనిజులాకు చెందిన యువతులు మిస్ యూనివర్స్ పోటీల్లో రెండు, మూడో స్థానాల్లో నిలిచారు. భారత్‌కు చెందిన అందాల సుందరి శిల్పాసింగ్ టాప్-16వరకు వచ్చి నిలిచిపోయారు.
ఈ నెల 28 న ఢిల్లీ లో జరిగే అఖిల పక్ష సమావేశంలో తెలంగాణా కు వ్యతిరేకంగా మాట్లాడితే, తెలుగు దేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణా లో చేస్తున్న పాదయాత్రలు కాస్తా పరుగు యాత్రలుగా మారతాయని తెలంగాణా రాష్ట్ర సమితి ఎంఎల్ఎ కే. తారక రామా రావు హెచ్చరించారు.
అగ్రరాజ్యం అమెరికాలో ఉన్మాదుల కాల్పుల పర్వం కొనసాగుతూనే ఉంది. అమాయకుల ప్రాణాలకు అక్కడ విలువ లేదని వరుస సంఘటనలు రుజువు చేస్తున్నాయి.
మాజీ ఎం ఎల్ సి కాసాని జ్ఞానేశ్వర్ వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్దం చేసుకున్నారు.
ఇబ్రహీంపట్నంలో ఓ యువకుడు తనను ప్రేమించడం లేదని ఓ విద్యార్ధిని గొంతు కోసి చంపేశాడు. ఇబ్రహీంపట్నం కు చెందిన బాలరాజ్, భాగ్యలతల మొదటి కుమార్తె నిఖిత బికాం చదువుతూ, సిఏ కోచింగ్ తీసుకొంటోంది. బుధవారం సాయంత్రం రాఘవేందర్ ఆమె ఇంట్లోకి వచ్చి గొంతు కోసి చంపాడు.
నా తండ్రి విగ్రహాన్ని పార్లమెంటులో పెట్టి ఒక్కదాన్నే క్రెడిట్ కొట్టేయాలన్న ఆలోచన నాకు లేదు. నా తమ్ముడు బాలకృష్ణ అన్న మాటలు నాకు చాలా బాధకలిగించాయి. ఎన్టీఆర్ విగ్రహం అందరం కలిసి ఇద్దామని నా ఇంటికి వచ్చింది నిజమే. అయితే కుటుంబ సభ్యులు రాసిన లేఖ మీద సంతకం చేయాలని నన్ను అడగలేదు.
పార్లమెంట్ లో ఎన్ టి ఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించే విషయంలో మాటల యుద్ధం కొనసాగుతోంది.





