Publish Date:May 31, 2023
తెలంగాణ హైకోర్టులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి భారీ ఊరట లభించింది. ఆయనకు ముందస్తు బెయిలు లభించింది. సీబీఐకి సమాచారం ఇవ్వకుండా దేశం విడిచి వెళ్లకూడదనీ, అలాగే ప్రతి శనివారం సీబీఐ విచారణకు హాజరు కావాలని షరతులు విధించింది. వివేకా హత్య కేసులో సీబీఐ అవినాష్ రెడ్డి పాత్రకు సంబంధించి ఒక్క ఆధారాన్ని కూడా చూపలేకపోయిందని కోర్టు పేర్కొంది. ఇలా ఉండగా అవినాష్ ముందస్తు బెయిలు పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ లో గత శుక్ర, శనివారాలలో సుదీర్ఘ వాదలను జరిగాయి. ఆ సందర్భంగా సీబీఐ తన కౌంటర్ అఫిడవిట్ లో తొలి సారిగా ఏపీ సీఎం జగన్ పేరు ప్రస్తావించింది.
అవినాష్ ను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. అనంతరం కోర్టు అవినాష్ రెడ్డి తల్లి అనారోగ్యం దృష్ట్యా బుధవారం (మే 31) వరకూ అరెస్టు చేయద్దని ఆదేశిస్తూ ముందస్తు బెయిలుపై తన నిర్ణయాన్ని అదే రోజు వెలువరిస్తామని పేర్కొంది. ఈ రోజు ఉదయం తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ అవినాష్ కు షరతులతో కూడిన ముందస్తు బెయిలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. వెకేషన్ బెంచ్ ఉత్తర్వులపై సీబీఐ, వివేకా కుమార్తె సునీత సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయని అంటున్నారు.
ఇలా ఉండగా అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిలు లభించడంపై న్యాయ నిపుణులలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపుగా అవినాష్ రెడ్డిపై ఉన్న ఆరోపణలనే ఎదుర్కొంటున్న ఆయన తండ్రి భాస్కరరెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ ఇంత కాలం అవినాష్ ను ఎందుకు అరెస్టు చేయలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముందస్తు బెయిలు విషయంలో తెలంగాణ హై కోర్టు, సుప్రీం కోర్టూ కూడా ఎటువంటి నిర్ణయం వెలువరించకుండా, అరెస్టు చేయకుండా ఎటువంటి ఆదేశాలూ ఇవ్వకపోయినా సీబీఐ ఆయనను అరెస్టు చేయకపోవడాన్ని తప్పుపడుతున్నారు. సీబీఐ అవినాష్ కు అరెస్టు కాకుండా తప్పించుకోవడానికి ఉన్న అన్ని అవకాశాలనూ ఇచ్చిందనీ అంటున్నారు.
ఇప్పుడు కూడా సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు తీర్పుకు భిన్నమైన ఉత్తర్వులు వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. హైకోర్టు కూడా తన విచారణలో సీబీఐ తప్పులనే ఎత్తి చూపిందని, అవినాష్ పోన్ ఇంత వరకూ ఎందుకు స్వాధీనం చేసుకోలేదనీ ప్రశ్నించింది. మొత్తం మీద అవినాష్ కు ముందస్తు బెయిలు విషయంలో సీబీఐ వైఫల్యం ప్రస్ఫుటంగా బయటపడిందంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-hi-court-grants-anticipatory-bail-to-avinash-39-156125.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.