ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు జగన్ కు పులివెందుల భయం పట్టుకుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది. 2024 ఎన్నికలలో పార్టీ ఓటమి జగన్ రాష్ట్రంలో పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటను చేస్తారని అంతా భావించారు. అయితే అందుకు భిన్నంగా ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
నిజమే.. జగన్ ఇటీవలి కాలంలో క్రమం తప్పకుండా పులివెందులలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలు ఆయనలో భయాన్ని సూచిస్తున్నాయంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. గతంలో అంటే జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఆయన పులివెందుల పర్యటనలు చాలా చాలా అరుదుగానే చేపట్టే వారు. తన తండ్రి వైఎస్ జయంతి, వర్ధంతి సందర్భాలు కాకుండా ఆయన పులివెందులలో అడుగుపెట్టడం అనేది చాలా అరుదుగా జరిగేది. కానీ 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం, పులివెందులలో తన మెజారిటీ గణనీయంగా తగ్గడంతో ఆయన పులివెందుల పర్యటనలు పెరిగాయి.
అన్నిటికీ మించి పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీకి డిపాజిట్ కూడా దక్కకుండా ఘోరంగా ఓడిపోయిన తరువాత ఆయనలో పులివెందులపై పట్టు జారిపోతోందన్న భయం మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. దీంతో అప్పటి నుంచి సమయం, సందర్భంతో సంబంధం లేకుండా క్రమం తప్పకుండా పులివెందుల వెడుతున్నారు. అక్కడ తన నివాసంలో రెండు మూడు రోజుల ఉంటున్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమావేశమౌతున్నారు. ప్రజా దర్బార్ తరహాలో వినతులు స్వీకరిస్తున్నారు.
నియోజకవర్గంలో తన పట్టు సడలకుండా ఉండటానికే ఆయన ఇటీవలి కాలంలో తరచూ పులివెందులలో పర్యటిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2024 ఎన్నికలలో పులివెందుల నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలలో వ్యతిరేకత కనిపించడంతో పాటు, పార్టీ క్యాడర్ లో కూడా ఉత్సాహం తగ్గి పెద్దగా పార్టీ కార్యక్రమాలు చేపట్టకపోవడంతో జగన్ ముందుజాగ్రత్త పడుతున్నారని అంటున్నారు.
[Pulivendula Fear in Jagan, Jagans Pulivendula visits, YCP Politics, Ap Politics, Telugu One]
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pulivendula-fear-in-jagan-39-230457.html
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.