తెలంగాణలో సర్ ముసాయిదా జాబితా విడుదల..!
Publish Date:Aug 17, 2026
Advertisement
92 లక్షల మంది ఓటర్లకు నోటీసులు..! ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) జాబితాను తెలంగాణ ఎన్నికల సంఘం విడుదల చేసింది ప్రస్తుత గణాంకాల ప్రకారం 2.64 కోట్లకు పైగా పౌరులతో ఈ ముసాయిదా జాబితాను ఖరారు చేశారు. అయితే డేటా సరిపోలని లేదా నమోదు కాకుండా మిగిలిపోయిన దాదాపు 92 లక్షల మంది ఓటర్లకు ప్రత్యక్షంగా నోటీసులు పంపించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీఈఓ స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 73 లక్షల మంది ఆబ్సెంట్, షిఫ్టెడ్ డూప్లికేట్ (ఎఎస్బి) కేటగిరీ పరిధిలోకి వచ్చినట్లు విశ్లేషించారు. అన్-మ్యాప్డ్ జాబితాలో చేరిన పౌరులు తమ ఓటు హక్కును కాపాడుకునేందుకు క్షేత్రస్థాయి అధికారుల ద్వారా పోస్టుల ద్వారా నోటీసులు చేరవేయనున్నారు. ఈ నోటీసులు అందుకున్న పౌరులకు స్పందించడానికి సెప్టెంబర్ 16 వరకు తగిన గడువును ఇచ్చారు. ఎన్యుమరేషన్ పూర్తయిన అనంతరం ప్రస్తుతం రాష్ట్రంలో ఓటర్ల శాతం 78.03 శాతంగా నమొదైందని అధికారులు ధ్రువీకరించారు. ఒకవేళ ముసాయిదా జాబితాలో పేర్లు లేని వారు లేదా కొత్తగా పేరు నమోదు చేసుకోవాలనుకునే అర్హులైన పౌరులు 'ఫార్మ్ 6ఏ' విధానం ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమైనందున ప్రతి ఒక్కరూ ముసాయిదా ఓటర్ల జాబితాను సరిచూసుకోవాలని ఎన్నికల యంత్రాంగం స్పష్టం చేసింది. శాసనసభ స్థానాల పరిధిలో తప్పుడు నమోదులు లేకుండా పారదర్శకంగా ఓటర్ల జాబితాను రూపొందించడమే లక్ష్యంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సహకారాన్ని కూడా కోరుతున్నారు. ప్రజా రవాణా లేదా స్థిరాస్తి మార్పుల వల్ల ఓట్లు కోల్పోయిన పౌరులకు ఈ ప్రక్రియ ఎంతో ఊరట కలిగిస్తుందని భావిస్తున్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గాల వారీగా బూత్ లెవల్ అధికారులు (బిఎల్ఓ) నిర్వహించే సమగ్ర విచారణ ఆధారంగా అభ్యంతరాలను పరిష్కరించి, త్వరలోనే పూర్తిస్థాయి తుది ఓటర్ల జాబితాను ప్రచురించేందుకు చర్యలు వేగవంతం చేస్తున్నారు. ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 15 వరకు అభ్యంతరాలు, సంబంధిత దరఖాస్తులను పరిశీలించనున్నట్లు అధికారులు వెల్లడించారు. పరిశీలన ప్రక్రియ పూర్తయిన అనంతరం అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు సుదర్శన్‌రెడ్డి తెలిపారు. SIR ప్రక్రియను పూర్తి చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 2 వేల మందికి పైగా అధికారులు పాల్గొంటారని సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు.
ఈ సందర్బంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి పలు కీలక విషయాలను వెల్లడించారు. సవరణ ప్రక్రియ ప్రారంభం కాకముందు తెలంగాణలో సుమారు 3.38 కోట్లకు పైగా ఓటర్లు నమోదై ఉండగా, నిర్దేశిత గడువులోగా ఎన్యుమరేషన్ పత్రాలు సమర్పించిన వారి ఆధారంగా కొత్త జాబితా తయారు చేశామని వివరించారు.
http://www.teluguone.com/news/content/telangana-draft-electoral-roll-36-229118.html





