సుప్రీంలో కర్నాటకకు ఎదురుదెబ్బ.. తమిళనాడుకు ఊరట.!

Publish Date:Aug 17, 2026

Advertisement

కర్నాటక, తమిళనాడు మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న కావేరీ నదీ జలాల పంపిణీ  వివాదంలో  సుప్రీంకోర్టు  కీలక   తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో ఏక కాలంలో కర్ణాటక ప్రభుత్వానికి  షాక్, తమిళనాడు సర్కార్ కు ఊరట ఇచ్చింది.  సుప్రీం ఈ తీర్పులో కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ జారీ చేసిన ఉత్తర్వులను   కచ్చితంగా అమలు చేసి తీరాల్సిందేనని  విస్పష్టంగా పేర్కొంది. ఈ తీర్పు తమిళనాడు  రాష్ట్ర ప్రభుత్వానికి ఉపశమనం కలిగించింది.  

 కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ తమిళనాడు రైతు ప్రయోజనాలను,  సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రోజుకు 12 వేల క్యూసెక్కుల చొప్పున వరుసగా 12 రోజుల పాటు కావేరీ జలాలను విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే..  తమ సొంత రాష్ట్రంలో నీటి నిల్వలు లేవని చెబుతూ కర్ణాటక ప్రభుత్వం ఈ ఉత్తర్వులను పూర్తిస్థాయిలో అమలుచేయలేదు.   నిర్ణీత పరిమాణంలో తమకు నీరు అందకపోవడంతో తమిళనాడులోని వేలాది ఎకరాల వ్యవసాయ భూములు ఎండిపోయే ప్రమాదం ఏర్పడిందని పేర్కొంటూ ఆరోపిస్తూ తమిళనాడు ప్రభుత్వం  సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 

ఈ పిటిషన్ విచారణ సందర్భంగా  కర్ణాటక ప్రభుత్వం తమ వద్ద ఉన్న   నివేదికలను న్యాయస్థానం ముందు ఉంచి,  కర్ణాటకలోని కావేరీ బేసిన్ జలాశయాలకు ఈ ఏడాది అనుకున్న రీతిలో ఇన్ ఫ్లో రాలేదని, రాష్ట్రం తీవ్రమైన కరువు పరిస్థితులను ఎదుర్కొంటోందని  వాదించింది. ముఖ్యంగా కర్ణాటకలోని నాలుగు ప్రధాన జలాశయాలైన కృష్ణరాజ సాగర్, కబిని, హారంగి,  హేమావతి జలాశయాల్లో నీటి పరిమాణం సాధారణ సగటు కంటే 47 శాతం తక్కువగా ఉందనీ పేర్కొంది. తాగునీటికే ఇబ్బందులు పడుతున్న సమయంలో తమిళనాడుకు రోజుకు 12 వేల క్యూసెక్కుల చొప్పున 12 రోజుల పాటు నీరు ఇవ్వడం అసాధ్యమని పేర్కొంది. 

 ఇరు పక్షాల  వాదనలను విన్న అనంతరం సుప్రీం కోర్టు..  కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఆదేశాలను విస్మరించడానికి వీల్లేదని తీర్పు వెలువరించింది. ఈ పరిణామంపై కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందిస్తూ, తమ రాష్ట్రంలోని నీటి లభ్యతను,  స్థానిక రైతుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని తదుపరి అడుగులు వేస్తామని ప్రకటించారు. సుప్రీంకోర్టు స్పష్టమైన సూచనల నేపథ్యంలో తదుపరి చట్టపరమైన వాదనలు వినిపించేందుకు కర్ణాటక ప్రభుత్వం తమ న్యాయ నిపుణుల బృందంతో అత్యవసర సమావేశాలు నిర్వహిస్తోంది. 

Kaveri Water Dispute, Supreme Court Verdict, Karnataka vs Tamil Nadu, CWMA Orders,  Cauvery River Dispute

By
en-us Political News

  
ఏపీలో పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను పూజలు చేసినట్లు ముఖ్యమంత్రి వద్ద ఆధారాలు ఉంటే వెంటనే బయటపెట్టాలని సవాల్‌ చేశారు.
92 లక్షల మంది ఓటర్లకు నోటీసులు..!
ఏపీ అసెంబ్లీలో సత్యకుమార్, లోకేష్ సరదా సంభాషణ..!
తీవ్ర ఆర్థిక సంక్షోభం, రాజకీయ అశాంతి ఆ దేశం స్వాతంత్ర్య వేడుకల్లో ప్రస్ఫుటంగా కనిపించింది.  పాకిస్థాన్ దేశ వ్యాప్తంగా జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో  నిర్లిప్తత కొట్టొచ్చినట్లు కనిపించింది. ముఖ్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో దేశ వ్యతిరేకత వ్యక్తమైంది.
నా బిడ్డకు బతుకునిచ్చారు సార్.. మీరే పేరు పెట్టండి..!
బీజేపీ నూతన జాతీయ కార్యవర్గం ప్రకటన..!
అసలు జగన్ హయాం అంతా అక్రమాలు, అవినీతి మయం అని విమర్శించిన ఆయన ముఖ్యంగా గ్రూప్ వన్ నియామకాలలో చోటు చేసుకున్నటువంటి కుంభకోణాన్ని తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు
జీవితమంతా ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు, ఉద్యోగ విరమణ తర్వాత దక్కాల్సిన ఫలాలు ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపాయి.
పిఠాపురం ఏఈ నూకరాజు సహా ముగ్గురు గల్లంతు..!
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన క్షణం నుంచీ విద్యా వ్యవస్థను బలోపేతంపై  దృష్టి సారించిందన్నారు. గడిచిన కొద్ది నెలలలోనే ఉపాధ్యాయ నియామకాలు, ట్రాన్స్‌ఫర్‌ల ప్రక్రియను పారదర్శకంగా,  నిష్పాక్షికంగా నిర్వహించామని వివరించారు.
ఇటీవల ఒక సందర్భంలో  అనసూయ.. సనాతన ధర్మంతో పాటు జై శ్రీరామ్ నినాదాన్ని అడ్డుపెట్టుకుని కొందరు వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలకు, దాడులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.  అనసూయ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
1972 లో అపోలో 17 మిషన్ ద్వారా  మానవుడు తొలి సారిగా చందమామపై అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన ఐదు దశాబ్దాల తరువాత.. నాసా  ఇప్పుడు కేవలం చందమామపై కాలుపెట్టి వచ్చేయడమే కాకుండా.. నెల నుంచి రెండె నెలల పాటు మనిషి అక్కడే నివసించడానికి వీలుగా ఒక పర్మనెంట్ బేస్ క్యాంప్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.