సైబర్ నేరాల కట్టడిలో నంబర్ వన్ తెలంగాణ.!

Publish Date:Aug 7, 2026

Advertisement

ఆన్‌లైన్ మోసాలు, బ్యాంకింగ్ ఫ్రాడ్స్, డిజిటల్ అరెస్టుల పేరుతో కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతూ అమాయకుల జేబులు గుల్ల చేస్తున్నారు. ఇలాంటి   సైబర్ నేరగాళ్ల ఆట కట్టించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ఈ విషయం పీఎంవో నిర్వహించిన ప్రగతి సమీక్షలో  వెల్లడైంది.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు,  కేంద్రపాలిత ప్రాంతాల సైబర్ సెక్యూరిటీ విభాగాల పనితీరును సమీక్షించింది. ఈ సమీక్షలో    9  అంశాలను ప్రామాణికంగా తీసుకున్నారు. వాటిలో టెక్నాలజీ వినియోగం, బాధితులకు ఫిర్యాదుల పట్ల స్పందించే వేగం,  రికవరీ వ్యవస్థల సమర్థత  విభాగాల్లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో  అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కంటే ముందు ఉందని తేలింది. 

డిజిటల్ నేరాలను అరికట్టడానికి తెలంగాణ పోలీస్ శాఖ  దేశంలోనే తొలిసారిగా స్టేట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్‌ను ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనితో పాటు కేసుల నమోదులో జాప్యాన్ని నివారించడానికి ఇ జీరో ఎఫ్ఐఆర్ విధానాన్ని  విజయవంతంగా అమలు చేస్తోంది.  బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు సమీక్షించడానికి గ్రీవెన్స్ రిడ్రెస్సల్ మాడ్యూల్‌ను   సమర్థవంతంగా నిర్వహిస్తోంది.

సైబర్ మోసానికి గురైన వెంటనే బాధితులు నష్టపోయిన నగదును తిరిగి అందించడంలో తెలంగాణ ఉపయోగించే మనీ రిస్టోరేషన్ మాడ్యూల్ ప్రభావమంతంగా పని చేస్తోంది.  మోసగాళ్ల ఖాతాల్లో ఉన్న సొమ్మును తక్షణమే హోల్డ్‌లో పెట్టి   బాధితులకు తిరిగి ఇప్పించడంలో తెలంగాణ రాష్ట్రంలోనే నంబర్ వన్ గా  నిలిచింది. దీనికి తోడు సహ్యోగ్, సమన్వయ పోర్టళ్ల   వాడకం, ప్రధాన సైబర్ క్రైమ్ హాట్‌స్పాట్‌ల నిరంతర పర్యవేక్షణ, పోలీసు అధికారుల నైపుణ్యం పెంపుదల వంటి చర్యలు తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టాయి.

ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ పరిధిలోని కేంద్ర డిజిటల్ వేదికలను  సమర్థవంతంగా వినియోగించుకుంటున్నందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు కేంద్ర పీఎంవో సమీక్షలో ప్రత్యేక ప్రశంసలు లభించాయి.  

Telangana cyber crime control rank 1, PMO Pragati review cyber security, Telangana Cyber Security Bureau TGCSB, cyber crime helpline 1930, S4C cyber crime Telangana, Money Restoration Module TGCSB

By
en-us Political News

  
క్యూలైన్లలో కిక్కిరిసిపోయే భక్తుల రద్దీని తట్టుకుంటూనే, అందరికీ సమయానికి అన్నప్రసాదం అందించేందుకు కదిలే డైనింగ్ టేబుళ్ల ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌పై కీలక అప్‌డేట్! రూ.11,000 కోట్ల అంచనా వ్యయంతో 38.40 కిలోమీటర్ల మేర 2 కారిడార్లు, 34 స్టేషన్ల నిర్మాణం. గన్నవరం, కేసరపల్లిలో 91 ఎకరాల భూసేకరణ వివరాలు ఇవే!
భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద సెయింట్ లూయిస్ రాపిడ్ అండ్ బ్లిట్జ్ 2026 టైటిల్ గెలుచుకుని హిస్టారిక్ విక్టరీ సాధించాడు. 23/35 పాయింట్లతో అమెరికాలో గ్రాండ్ చెస్ టూర్ ట్రోఫీని కైవసం చేసుకున్న ప్రజ్ఞానంద సాధించిన ఈ చారిత్రాత్మక విజయం పూర్తి వివరాలు ఇవే!
సోనీ ఇన్‌జోన్ M10S 2 గేమింగ్ మానిటర్ పూర్తి రివ్యూ! 540Hz రిఫ్రెష్ రేట్, 720Hz డ్యూయల్ మోడ్, 1,500 నిట్స్ బ్రైట్‌నెస్ మరియు 0.02ms రెస్పాన్స్ టైమ్‌తో కూడిన ఈ బెస్ట్ ఇ స్పోర్ట్స్ OLED మానిటర్ ధర మరియు ఫీచర్ల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
నెట్‌ఫ్లిక్స్ బ్లాక్‌బస్టర్ టీన్ డ్రామా మై లైఫ్ విత్ ది వాల్టర్ బాయ్స్ సీజన్ 4కి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. సీజన్ 3 ముగింపు ట్విస్ట్‌లు, షూటింగ్ వివరాలు మరియు రిలీజ్ విండో గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
షియోమీ నుంచి కొత్త స్కైనోమాడ్ N70, N90 ఫుల్-సైజ్ హైబ్రిడ్ ఎస్‌యూవీలు వచ్చేశాయి. ఒక్క చుక్క పెట్రోల్ లేకుండా 314 మైళ్ల ఎలక్ట్రిక్ రేంజ్ మరియు మొత్తం 1,705 కిలోమీటర్ల కంబైన్డ్ మైలేజ్ ఇచ్చే ఈ కార్ల ఫీచర్లు, ఇంజన్ అండ్ ధర వివరాలు ఇక్కడ చూడండి!
యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ (MDR) ఛార్జీల భారాన్ని ఎవరు మోస్తారు? ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందన, కేంద్రం ప్రవేశపెట్టిన నూతన బిల్లు మరియు యూపీఐ ఛార్జీల సమగ్ర విశ్లేషణ.
మూడేళ్ల కాలపరిమితి గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వరకు అత్యధిక వడ్డీని అందిస్తున్న టాప్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల వివరాలు, DICGC రూ. 5 లక్షల ఇన్సూరెన్స్ సెక్యూరిటీ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
యూకేలో మీ NICOP కార్డ్ పోయిందా? కంగారు పడకుండా నాద్రా పాక్ ఐడెంటిటీ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో రీప్లేస్ చేసుకునే అప్లికేషన్ స్టెప్స్, పోలీస్ రిపోర్ట్, ఫీజుల వివరాలు £55.50 £165 మరియు డెలివరీ టైమ్‌లైన్స్ తెలుసుకోండి.
అమెరికాలోని యూజీన్ వేదికగా జరుగుతున్న వరల్డ్ అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్లు శుభారంభం చేశారు. జావెలిన్ త్రోలో ఆశీష్ యాదవ్ 69.87 మీటర్లతో టాప్ సాధించగా, డిస్కస్ త్రోలో అమానత్ కంబోజ్ ఫైనల్‌కు క్వాలిఫై అయ్యారు. పూర్తి వివరాలు చదవండి!
కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ తన్వీ శర్మ క్వార్టర్ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది. శ్రీయాన్షి వాలిశెట్టిపై 57 నిమిషాల థ్రిల్లింగ్ మ్యాచ్‌లో సాధించిన ఈ విజయం మరియు ఇతర భారత షట్లర్ల ప్రదర్శన వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
మోదీ షేర్ చేసిన ఈ తాజా రీల్ లో దేశ సంస్కృతి, సాంప్రదాయాల్లో చేనేత రంగానికి ఉన్న ప్రాముఖ్యతను వివరించారు. దేశీయ చేనేత ఉత్పత్తులు మన సాంస్కృతిక వైభవానికి ప్రతీకలుగా పేర్కొంటూ నేత రంగాన్ని బలోపేతం చేసేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా, యువత చేనేత ఉత్పత్తులపై తమ అభిప్రాయాలను, సూచనలను పంచుకోవాలని కోరారు.
ప్రభుత్వ పాఠశాలలో విషసర్పం కాటుకు ఎనిమిదేళ్ల విద్యార్థి బలి..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.