ఏపీ సీఎంకు తెలంగాణ ముఖ్యమంత్రి కృతజ్ణతలు.. ఎందుకో తెలుసా?

Publish Date:Dec 31, 2024

Advertisement

తిరుమల దేవుని దర్శనం కోసం తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను ఇక నుంచి టీటీడీ అనుమతించనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు.   తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ అనుమతించేలా చూడాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఆ లేఖపై స్పందించిన చంద్రబాబు, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడితో చర్చించి, తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించాలని నిర్ణయించారు.

అదే విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ ద్వారా తెలిపారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడితో కలిసి చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తమ నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వానికి తెలియ జేశారు.తెలంగాణకు చెందిన   ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ నుంచి ప్రతివారం ఏదైనా రెండు రోజుల్లో అంటే సోమవారం నుంచి గురువారం వరకు వీఐపీ బ్రేక్ దర్శనం  రూ.500/- టికెట్  కొరకు రెండు లేఖలు, స్పెషల్ ఎంట్రీ దర్శన్ రూ. 300/- టికెట్ కొరకు రెండు లేఖలు స్వీకరించనున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. ఒక్కో లేఖపై గరిష్టంగా ఆరుగురు భక్తులను  దర్శనానికి సిఫార్సు చేయొచ్చని తెలిపారు.  

తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనాలకు టీటీడీ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుకు, టీటీడీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ సీఎంవో ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల విజ్ఞాపన లేఖలను అనుమతించడానికి ఆదేశాలిచ్చిన చంద్రబాబు గారికి కృతజ్ఞతలు అని పేర్కొంది.

By
en-us Political News

  
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో బీజేపీకి నూత‌న అధ్య‌క్షుడు రాబోతున్నారా? పార్టీ అధిష్టానం ఆ మేర‌కు ఇప్ప‌టికే క‌స‌ర‌త్తు మొద‌లు పెట్టిందా? ప్ర‌స్తుతం అధ్య‌క్షురాలిగా ఉన్న పురందేశ్వ‌రికి కేంద్రంలో ప్రాధాన్య‌త క‌ల్పించి.. రాష్ట్రంలో కొత్త‌వారికి పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించేందుకు రంగం సిద్ధ‌మైందా? అంటే అవున‌నే స‌మాధానమే పార్టీ ముఖ్య‌నేత‌ల నుంచి వినిపిస్తోంది.
గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత బీఆర్ఎస్ సంక్షోభం నుంచి సంక్షోభంలోకి కూరుకుపోతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలై అధికారాన్ని కోల్పోయిన తరువాత బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనూహ్యంగా రాజకీయాలకు దూరంగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు పరిమితమైపోయారు.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనంలోకి వస్తానంటే ఆయన పార్టీ క్యాడర్, నేతలు వణికి పోతున్నారు. ఇప్పుడప్పుడే వద్దు మహప్రభో అంటూ వేడుకుంటున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. శుక్రవారం (జనవరి 3) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో ఆరు కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి.
తీహార్ జైలు నుంచి కండిషన్ బెయిల్ మీద విడుదలైన బిఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత మరో మారు తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు
న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, హాంకాంగ్, తైవాన్ దేశాలకు చెందిన బౌద్ధ పరిశోధకులు గురువారం నాడు నాగార్జున కొండను సందర్శించారని పురావస్తు పరిశోధకుడు బుద్ధవనం కన్సల్టెంట్, ప్లీచ్ ఇండియా సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు.
భార్యా భర్తల మధ్య గొడవలు సహజం. కలహాలు లేని కాపురాలు ఉండనే ఉండవు. భర్త నేరం చేస్తే భార్య కేసులు నమోదు చేయడం సహజం. కానీ బాపట్ల జిల్లాలో ఓ భార్య భర్తపై కేసు పెట్టలేదు . కోర్టుల మీద నమ్మకం సన్నగిల్లిందేమో భర్తకు ఏకంగా  మరణ శిక్ష విధించింది.
వైసీపీ ప్ర‌భుత్వం ఐదేళ్ల పాల‌న‌ అవినీతికి హ‌ద్దే లేదన్నట్లుగా సాగింది. ఆ పార్టీ నేత‌లు అందినకాడికి ప్ర‌భుత్వ భూముల‌తోపాటు అట‌వీ భూములు, ప్రైవేట్ భూముల‌ను క‌బ్జాలు చేసేశారు. మ‌రికొన్ని భూముల‌ను త‌క్కువ ధ‌ర‌కే జ‌గ‌న్ ప్ర‌భుత్వం తన అనుకూల ట్ర‌స్టుల‌కు, కంపెనీల‌కు క‌ట్ట‌బెట్టేసింది. ఫ‌లితంగా ప్ర‌జ‌ల‌కు మేలు చేస్తార‌ని అధికారాన్ని అప్ప‌గిస్తే.. జ‌గ‌న్ మాత్రం త‌న హ‌యాంలో ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ భూముల‌ను దోచుకోవ‌ట‌మే ప‌నిగాపెట్టుకొని పాల‌న‌ను గాలి కొదిలేశారు.
కొత్త సంవత్సరం సందర్భంగా పిఠాపురంలోని జనసేనాని నివాసం వద్ద ఫ్లెక్సీలు సందడి చేశాయి. జనసేన మద్దతుదారులు, కార్యకర్తలకు 2024 గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఆ పార్టీ ఎన్నికలలో అద్భుత విజయాన్ని సాధించడమే కాకుండా, పార్టీ అధినేత జనసేనాని పిఠాపురం నుంచి మంచి మెజారిటీతో విజయం సాధించారు.
తెలంగాణతో బాటు ఎపిలో సంచలనమైన  కామారెడ్డి  ట్రయాంగిల్ సుసైడ్   ట్వి స్ట్ ల మీద ట్విస్ట్ లు చోటు  చేసుసుకుంటున్నాయి
జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ రుణచక్రబంధంలో ఇరుక్కుపోయింది. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇలా నిబంధనలకు విరుద్ధంగా పరిమితులకు మించి అప్పులు ఎలా పొందగలుగుతోందన్న అనుమానాలు అప్పట్లో సర్వత్రా వ్యక్తంమయ్యాయి. పొరుగునే ఉన్న సంపన్న రాష్ట్రం తెలంగాణకు అడుగడుగునా ఆంక్షలు, అడ్డంకులతో రూపాయి అప్పు పట్టని పరిస్థితి ఉంటే అందుకు భిన్నంగా ఏపీకి మాత్రం ఎలాంటి పరిమితులూ, ఆంక్షలూ, అడ్డంకులూ లేకుండా అప్పులు ఎలా దక్కాయన్న ప్రశ్నకు అప్పట్లో సమాధానం చెప్పే నాథుడే లేకుండా పోయాడు.
నారా లోకేష్. ఏపీ రాజకీయాలలో ఆయన ఇప్పుడు సెంటరాఫ్ అట్రాక్షన్. ప్రజలలో తిరుగులేని నాయకుడు. అయినా ఆయన పార్టీ విషయానికి వచ్చే సరికి ఒక కార్యకర్త మాత్రమే. ఒక కార్యకర్తలాగే పార్టీ కోసం శ్రమిస్తారు. అదే విధంగా తోటి కార్యకర్తల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడతారు. లోకేష్ లోని ఈ లక్షణాలను ఆయన రాజకీయాలలో అడుగుపెట్టక ముందే.. వైసీపీ పసిగట్టేసింది. అందుకే లోకేష్ కు రాజకీయాలంటేనే విరక్తి కలిగేలా చేయాలన్న ఉద్దేశంతో ఆయనపై విమర్శల దాడి చేసింది. బాడీ షేమింగ్ కు పాల్పడింది.
రేష‌న్ బియ్యం మాయం కేసులో వైసీపీ నేత‌, మాజీ మంత్రి పేర్నినాని మెడ‌కు ఉచ్చు బిగుస్తోంది. భారీ మొత్తంలో బియ్యం మాయం వెనుక పేర్ని నాని హ‌స్తం ఉన్న‌ట్లు పోలీసులు నిర్దార‌ణ‌కు వ‌చ్చారు. తెర‌వెనుక ఉండి ఆయ‌నే రేష‌న్ బియ్యాన్ని మ‌ధ్య‌వ‌ర్తుల ద్వారా కాకినాడ పోర్టుకు త‌ర‌లించిన‌ట్లు ఆధారాల‌తోస‌హా పోలీసులు గుర్తించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.