సిరాజ్ టాలెంట్.. రేవంత్ ముందే గుర్తించారు!

Publish Date:Aug 6, 2025

Advertisement

మహ్మాద్ సిరాజ్.. డీఎస్పీ సాబ్.. లండన్ లో  ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇండియా చివరిదైన ఓవెల్ టెస్ట్ లో చారిత్రాత్మక విజయం తరువాత దేశ వ్యాప్తంగా ఈ పేరు మారుమోగిపోతోంది. అద్భుత ప్రతిభ ఉన్నప్పటికీ.. అందుకు తగిన విధంగా సిరాజ్ కు టీమ్ ఇండియాలో గుర్తింపు రాలేదు. ఇందుకు కారణం.. అద్భుత ఫిట్ నెస్, ఫామ్ ఉన్నప్పటికీ.. ప్రధాన బౌలర్ బుమ్రా నీడలో సిరాజ్ కు రావలసినంత గుర్తింపు రాలేదు. ఇండియన్ బౌలింగ్ అటాక్ గురించి ఎప్పుడు, ఎవరు మాట్లాడినా పేసర్ బుమ్రా, స్పీన్నర్లు అశ్విన్ ల పేర్లే ప్రస్తావిస్తూ వచ్చారు.

ఈ నేపథ్యంలోనే.. 2004లో సిరాజ్ లో ఉన్న టాలెంట్ ను గుర్తించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పోర్ట్స్ కోటాలో సీరాజ్ ను డీఎస్పీని చేశారు. తెలంగాణలో ఆయనకు డీఎస్పీ పోస్టు ఇచ్చి ప్రోత్సహించడం అప్పట్లో పలు విమర్శలు దారి తీసింది. 
అయితే  ఇంగ్లాండ్ తో సిరీస్ లో భాగంగా సిరాజ్ అద్భుత ప్రదర్శన టీమ్ ఇండియాను విజయతీరాలకు చేర్చిన తరువాత అందరూ డీఎస్పీ అన్న పదాన్ని సిరాజ్ ఇంటిపేరుగా మార్చి సంబోధించడం మొదలు పెట్టారు. సరైన సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఈ హైదరాబాదీ యువ క్రికెటర్ లోని టాలెంట్ ను, ఫైర్ ను గుర్తించి గౌరవించిందని ఇప్పడు అంతా అంటున్నారు. నేషనల్ హీరో సిరాజ్ ను తొట్ట తొలత గుర్తించి సముచిత రీతిలో గౌరవించిందని తెలంగాణ సర్కార్ పై ప్రశంసలు గుప్పిస్తున్నారు.

స్టార్ బౌలర్ బుమ్రా ఆబ్సెన్స్ లో జట్టు బౌలింగ్ భారాన్ని సిరాజ్ పూర్తిగా భుజానికెత్తుకుని టీమ్ ఇండియాకు చారిత్రక విజయాన్ని అందించాడని వేనేళ్ల పొగడుతున్నారు. అన్నిటికీ మించి ఒక పేస్ బౌలర్ గా ఆయన తన ఫిట్ నెస్ ను, అంకిత భావాన్ని అనితర సాధ్యమన్న రీతిలో ప్రదర్శించారు. ఇంగ్లాండ్, ఇండియా ఐదు టెస్టుల సిరీస్ మొత్తంలో  ఐదు టెస్టులూ ఆడిన ఏకైక పేస్ బౌలర్ గా నిలిచాడు. సిరీస్ లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గానే కాకుండా అందరి కంటే ఎక్కువ ఓవర్లు వేసిన బౌలర్ గా కూడా నిలిచాడు. 

By
en-us Political News

  
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.