కేటీఆర్ నోట జగన్ పాట.. రాబోయే పరాజయానికి ఇప్పటి నుంచే సాకుల వెతుకులాట?!

Publish Date:Aug 6, 2025

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ ఈ రెండు పార్టీలూ దాదాపు ఒకే పడవ మీద నడుస్తున్నాయా అనిపించక మానదు. ఈ పార్టీలు తమ తమ రాష్ట్రాలలో అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు.. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత మాట్లాడుతున్న మాటలూ దాదాపు ఒకేలా ఉన్నాయి. తాము గెలిచినప్పుడు ఈవీమ్ లు భేష్.. అదే ఒటమి రాగానే ఈవీఎంల ట్యాంపరింగే పరాజయానికి కారణమంటూ గగ్గోలు పెట్టే విషయంలో ఈ రెండు పార్టీలూ ఒకే పాట పాడుతున్నాయి. 
2024 ఎన్నికలలో వైసీపీ అత్యంత ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలతో మిగిలింది. పరిశీలకులైతే.. ఈ 11 స్థానాలైనా.. రాష్ట్రంలో పొత్తు కారణంగా కొన్ని స్థానాలలో బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టక తప్పని పరిస్థితి కూటమి కూటమి పార్టీలకు రావడం వల్లనే వచ్చాయంటారు. పొత్తు ధర్మంలో భాగంగా కూటమిలో  సీట్ల సర్దుబాటు కారణంగానే  వైసీపీకి ఆ 11 స్థానాలైనా దక్కాయనీ, లేకుంటే కనీసం సింగిల్ డిజిట్ కూడా దాటే అవకాశం ఉండేది కాదనీ చెబుతున్నారు. 

అయితే ఈ వాస్తవాలనన్నిటిని విస్మరించి జగన్ ఈవీఎంల ట్యాంపరింగే తమ పార్టీ ఓటమికి కారణం అంటుంటే.. బీఆర్ఎస్ ఓటమి తరువాత దాదాపు రెండేళ్లకు అదే పాట ఎత్తుకుంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ కానీ, తెలంగాణలో బీఆర్ఎస్ కానీ ఓడిపోవడానికి ఆయా పార్టీలు అధికారంలో ఉండగా అనుసరించిన విధానాలు, అవినీతి, అరాచకాలు, పాలనా లోపాలే కారణమన్నది నిర్వివాదాంశం. ఈవీఎంల వల్లే ఓడిపోయామంటే.. ఆ పార్టీలు గతంలో తమ విజయాలు కూడా ఈవీఎంల వల్లే వచ్చాయని కూడా అంగీకరించాల్సి ఉంటుంది. అయితే రెండు పార్టీలూ కూడా విజయాలు తమ ఘనత, పరాజయం ఈవీఎంల వల్ల అంటూ చెప్పుకుంటున్నాయి. తమ పాలనా వైఫల్యాలను అంగీకరించడానికి వాటికి అహం అడ్డొస్తోందని పరిశీలకులు అంటున్నారు.   ఇప్పుడు తాజాగా కేటీఆర్ కూడా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరిగితే విజయం తమదే అంటూ జగన్ పాట అందుకున్నారు.  

బీఆర్ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు కేంద్ర ఎన్నికల కమిషనర్ ను బుధవారం (ఆగస్టు 5)  బ్యాలెట్ పద్ధతిలోనే  ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఇక ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేయడంలో బీఆర్ఎస్, వైసీపీలు ఒకే పాట పాడుతున్నాయి.  అయినా 2014, 2019 ఎన్నికలలో ఈవీఎంలతో దక్కించుకున్న విజయాన్ని ఓన్ చేసుకున్న బీజేపీకి, అలాగే 2019 ఎన్నికలలో గెలుపొందిన వైసీపీకి.. అప్పుడు ఈవీఎంలపై లేని అభ్యంతరం పరాజయం తరువాత ఎందుకు వచ్చింది?  అంటే.. రాబోయే ఎన్నికలలో పరాజయాన్ని ఇప్పుడే అంగీకరించి.. ఆ రాబోయే ఓటమికి ఇప్పటి నుంచే సాకులు వెతుక్కుంటున్నాయా అనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
తెలుగువన్ వాస్తవ వేదిక సంచికలో ప్రస్తుత ఏపీ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
ఈ నేపథ్యంలో జరగనున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై ఎలాంటి వైఖరి తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
2026 తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఈసారి ఎవరికీ అంత సులువుగా కనిపించడం లేదు.
అమరావతిని రాజధానిగా గుర్తించాలనే అంశంపై ఇప్పటివరకు చట్టపరమైన స్పష్టత లేదనీ, ఈ లోటును భర్తీ చేసేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విజయవాడ-అమరావతి ప్రాంతమే రాష్ట్ర రాజధానిగా ఉండాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించి దానిని కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు స్పీకర్ వివరించారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
భార్య పేరుతో సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. చిత్తూరు జిల్లాలో తమ పీఎల్ఆర్ కంపెనీ చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన బకాయిలు చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆ పిటిషన్ లో కోరారు. అయితే న్యాయమూర్తి జస్టిస్ దిపాంకర్ దత్తా నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసం ఈ విషయంలో తాము నేరుగా జోక్యం చేసుకోబోమని విస్పష్టంగా పేర్కొంది.
ఈ నెల 28 రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సమావేశం ఎజెండా అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ తీర్మానం ఆమెదించడమే. ఇది ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక ముందడుగుగా భావించవచ్చు.
భారతంలో ద్రౌపదిని వివస్త్రను చేయడానికి కౌరవులు ప్రయత్నిస్తే.. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను మిగల్చడానికి ఆ పార్టీ ప్రయత్నించింది. అందుకే కురుక్షేత్రంలో కౌరవులు ఓడిపోయినట్టుగా.. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమిని చూసింది.
కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అధికారికంగా రాజీనామా చేస్తున్నట్లు జీవన్ రెడ్డి ప్రకటించారు
1978 నుంచి అంటే గత 48 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉన్న నంబర్ 24, అక్బర్ రోడ్ భవనాన్ని ఈ నెల 28 లోగా అంటే శనివారం లోగా ఖాళీ చేయాలంటూ కేంద్రం నోటీసులు జారీ చేసింది.
జ‌గ‌న్ లెవ‌న్ పై మీమ్స్ గురించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. పంజాబ్ కింగ్స్ లెవ‌న్ లాగా.. జ‌గ‌న్స్ లెవ‌న్ అనే పేరు మీద మీమ్స్ వెల్లువెత్తాయి. ఇక తాజాగా కొత్త పార్లమెంట్ భవనంలో వైసీపీ ఎంపీలకు లోక్ సభ స్పీకర్ కేటాయించినది కూడా 11వ నెంబర్ రూమే.
ఇక 2026 త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకే ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు ప‌లుర‌కాల ఉచితాల వ‌ల ప‌న్నాయంటే ప‌రిస్థితి ఏమిటో ఊహించుకోవ‌చ్చు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.