నీది కాపు.. నాది కాపు! బీజేపీలో ఎమ్మెల్సీ చిచ్చు

Publish Date:Mar 20, 2021

Advertisement

పట్టభద్రుల ఎమ్మెల్సీ  ఎన్నికలు తెలంగాణ భారతీయ జనతా పార్టీలో చిచ్చు రేపుతున్నాయి. ఎన్నికలు జరిగిన రెండు స్థానాల్లోనూ బీజేపీ ఓడిపోయింది. తమ సిట్టింగ్ స్థానమైన హైదరాబాద్-రంగారెడ్జి- మహబూబ్ నగర్ స్థానంలో రెండో స్థానంలో నిలవగా.. నల్గొండ-వరంగల్- ఖమ్మం సీటులో ఏకంగా నాలుగో స్థానానికి పడిపోయింది. నల్గొండ స్థానంలో  బీజేపీ కంటే స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న, టీజేఎస్ అధినేత కోదండరామ్ ముందు నిలిచారు. నల్గొండ స్థానానికి తొలి ప్రాధాన్యతలో 2 లక్షల 86 వేల ఓట్లు పోలయితే..  బీజేపీ అభ్యర్థికి ప్రేమేందర్ రెడ్డికి కేవలం 40 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే బీజేపీకి తొలి ప్రాధాన్యతలో కేవలం 13 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లంతా ఉద్యోగులు, విద్యావంతులే. ఈ వర్గం ఓటర్లు మొదటి నుంచి బీజేపీకి మద్దతుగా ఉంటారు. ప్రస్తుతం కేసీఆర్  సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులు టీఆర్ఎస్ పేరు వింటేనే మండిపోతున్నారు. ప్రభుత్వం వ్యతిరేకత ఉన్నందు వల్లే దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గులాబీ పార్టీకి షాకిచ్చింది బీజేపీ.ఈ నేపథ్యంలో శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా టీఆర్ఎస్ నేతలుఎవరూ ముందుకు రాలేదు. యువత ప్రభుత్వంపై కోపంగా ఉండటంతో ఓడిపోతామనే భయంతోనే పోటీకి గులాబీ నేతలు భయపడ్డారనే ప్రచారం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమనే అంతా అనుకున్నారు. కాని ఇప్పుడు ఫలితాల్లో మాత్రం సీన్ రివర్సైంది. అనూహ్యంగా  హైదరాబాద్ సిట్టింగు సీటును కోల్పోయిన బీజేపీ.. నల్గొండలో అయితే దారుణమైన ఓట్లు సాధించింది. ఇదే ఇప్పుడు బీజేపీలో కలకలం రేపుతోంది.

పార్టీ నేతల ఆధిపత్య పోరు, స్వ ప్రయోజనాల కోసం వేసిన ఎత్తుల వల్లే ఈ ఫలితాలు వచ్చాయనే చర్చ కమలం నేతల్లో జరుగుతోంది. నల్గొండ బీజేపి ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారని తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్ తనకు సహకరించకుండా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థితో కుమ్మక్కు కావడం వల్లే ఫలితాల్లో బీజేపీ వెనుకబడింది అని ప్రేమేందర్ రెడ్డి తన సన్నిహితుల వద్ద వాపోయారని చెబుతున్నారు.ఉద్యోగస్తులు, టీచర్లు, లాయర్లు బీజేపీకి అండగా ఉన్నారని, అయినా ఓటింగ్ లో మాత్రం ఆ ఓట్లలో అధిక శాతం ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి ట్రాన్స్ఫర్ అయ్యాయి.. దీని వెనుక ఒక సామాజిక కుట్ర దాగి ఉందని ప్రేమేందర్ రెడ్డి కొందరితో అన్నారని తెలుస్తోంది. కేవలం తన స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని కొందరు నేతలు బలిపెట్టాడని, తన సామాజిక వర్గాన్ని పెంచి, ఇతర సామాజిక వర్గాలను తొక్కాలని బండి సంజయ్ చూస్తున్నారని గుజ్జుల ఆరోపించారట.

హైదరాబాద్ స్థానంలోనూ పార్టీ ఓటమికి నేతల మధ్య వర్గపోరే కారణమనే ఆరోపణలు కమలం నేతల నుంచే వినిపిస్తున్నాయి. రామచంద్రరావుకు సంజయ్ వర్గం సరిగా సహకరించలేదనే విమర్శలు వస్తున్నాయి. రామచంద్రరావు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సపోర్టుగా ఉంటారని.. అందువల్లే సంజయ్ వర్గం ఆయనను పట్టించుకోలేదని కొందరు చెబుతున్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ మధ్య విభేదాలు ఉన్నాయని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో  అది కనిపించిందని అంటున్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సంజయ్.. తూతూమంత్రంగానే ప్రచారం నిర్వహించారని, పార్టీ నేతలు పూర్తి స్థాయిలో పని చేసేలా చర్యలు తీసుకోలేదని రామచంద్రరావు అనుచరులు చెబుతున్నారు. 

మొత్తంగా వరుస విజయాలతో దూకుడుగా వెళుతున్న బీజేపీకి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు బ్రేక్ వేశాయనే చర్చ జరుగుతోంది. వరుస విజయాలు, పార్టీలోకి వలసలు పెరగడంతో... బీజేపీ కూడా అతి విశ్వాసానికి పోయిందని, అందుకే ఫలితాలు ఇలా వచ్చాయనే  వాదన కూడా రాజకీయ వర్గాల నుంచి వస్తోంది.  

By
en-us Political News

  
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో సంచలన నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు.
దక్షిణాది సినీ రంగంలో తిరుగులేని చక్రవర్తిగా వెలిగి
తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
పేటీఎం బ్యాచ్, రూ.5 బ్యాచ్.. ఇవి గత కొన్నేళ్లుగా ఉన్నా, ఇప్పటికీ ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్న పదాల్లో కొన్ని. ఒక పార్టీకి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి, ట్రోల్స్ చేయడానికి డబ్బులు తీసుకునే వారిని, మరీ ముఖ్యంగా వైసిపి సోషల్ మీడియా వింగ్‌ను, టిడిపి, జనసేన శ్రేణులు పేటీఎం బ్యాచ్ అని పిలుస్తుంటారు. ప్రతి పోస్టుకు ఐదు రూపాయలు ఇస్తారనే ప్రచారంతో ఐదు రూపాయల బ్యాచ్ అని కూడా అంటారు.
సీఎం, మంత్రుల హెలికాప్టర్ పెద్దగుట్టపై ల్యాండ్ అయినప్పటికీ.. అక్కడ వారిని రిసీవ్ చేసుకోవడానికి కనీసం ఒక్క జిల్లా ఉన్నతాధికారి కూడా అందుబాటులో లేకపోవడం తీవ్ర కలకలం రేపింది. వేద పాఠశాల శంకుస్థాపన ప్రాంగణమైన పెద్ద గుట్టపై సీఎం హెలికాప్టర్ ల్యాండ్ అయినా, అధికారుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్, సమన్వయ రాహిత్యం కారణంగా ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు కలెక్టర్ గానీ, ఎస్పీ గానీ, ఇతర ప్రోటోకాల్ అధికారులు గానీ సమయానికి అక్కడకు చేరుకోలేకపోయారు.
రాయలసీమ అభివృద్ధిపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తీవ్రస్థాయిలో ఎండగట్టారు మంత్రి నారా లోకేష్. గత ఐదేళ్లలో సీమ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తూ జగన్ ఈ ప్రాంతానికి క్యాన్సర్ గడ్డలా మారారని విమర్శించారు.
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌పై ఆంధ్రప్రదేశ్‌లో కేసు నమోదైంది. టీవీ డిబేట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన ఫిర్యాదుతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
నెల్లూరు జిల్లాలో నిర్వహించనున్న 2026 మహానాడును స్త్రీ శక్తి థీమ్‌తో నిర్వహించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి వ్యతిరేకంగా సొంత పార్టీ సీనియర్ నేతలే కూటమి కట్టడం హాట్ టాపిక్‌గా మారింది.
గత కొంత కాలంగా ప్రదాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కసరత్తు చేస్తున్నారు. కేబినెట్ లో పనితీరు సరిగా లేని వారికి ఉద్వాసన పలికి, కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ప్రధాని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలే అంటున్నాయి. ఆ మేరకు ఇప్పటికే కసరత్తు పూర్తయ్యిందని కూడా చెబుతున్నారు.
కూటమిలో వైరుధ్యాలు లేవని, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లి విలువైన సమయం గడపడమే ఇందుకు నిదర్శనమని అప్పసాని రాజేష్ అన్నారు. ఒకరి కాళ్ళ దగ్గర మాటలను తాకట్టు పెట్టి, వారు విసిరే ఎంగిలి మెతుకుల కోసం కొందరు కిరాయి రాజకీయ విశ్లేషకులుగా మారారని నాగేశ్వర్ ఉద్దేశించి అప్పసాని రాజేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.