ప్రయాణికులకు షాక్: తెలంగాణలో ఆటో ఛార్జీలు బాదుడు.!

Publish Date:Oct 2, 2026

Advertisement

 కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!

తెలంగాణ రాష్ట్రంలో ఆటోరిక్షా ఛార్జీలకు సంబంధించి ప్రభుత్వం కొత్త విధానాన్ని ఖరారు చేసింది. పెరుగుతున్న నిర్వహణ వ్యయాలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు ప్రయాణికులపై భారం నియంత్రించే విధంగా టారిఫ్‌ను సవరించింది. కొత్త విధానంలో కనీస ఛార్జీ, అదనపు దూరానికి వసూలు చేసే మొత్తం, వెయిటింగ్ ఛార్జీలు, రాత్రి సమయపు రేట్లు, లగేజీ రుసుములకు సంబంధించిన నిబంధనలను స్పష్టం చేశారు. కొత్త టారిఫ్ ప్రకారం ఆటోలో తొలి 1.6 కిలోమీటర్ల వరకు ప్రయాణానికి రూ.30 చెల్లించాల్సి ఉంటుంది. ఆ దూరం దాటిన తర్వాత ప్రతి అదనపు కిలోమీటర్‌కు రూ.14 చొప్పున ఛార్జీ పెరుగుతుంది. ప్రయాణ సమయంలో ట్రాఫిక్ రద్దీ, ఇతర పరిస్థితుల కారణంగా ఆటో కొంతసేపు కదలకుండా నిలిచిపోయినా వెయిటింగ్ ఛార్జీ వర్తిస్తుంది. ఈ ఛార్జీని నిమిషానికి 75 పైసలుగా నిర్ణయించారు.రాత్రి సమయంలో ఆటో సేవలను వినియోగించే వారికి సాధారణ టారిఫ్ వర్తించదు. 

రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ప్రయాణిస్తే సాధారణ ఛార్జీకి 1.5 రెట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సమయాన్ని ప్రత్యేక ఛార్జీ కాలంగా నిబంధనల్లో పేర్కొన్నారు. ప్రయాణికులు తమ వెంట తీసుకెళ్లే సామానుకు సంబంధించి కూడా కొత్త విధానంలో స్పష్టత ఇచ్చారు. సాధారణ పరిమాణంలో ఉండే బ్రీఫ్‌కేస్, హ్యాండ్‌బ్యాగ్‌తో పాటు 60×40 సెంటీమీటర్ల కంటే తక్కువ పరిమాణం కలిగిన అటాచ్డ్ కేస్ లేదా బ్యాగ్‌కు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.అయితే నిర్దేశిత పరిమాణం కంటే పెద్దగా ఉండే ప్రతి ప్యాకేజీకి రూ.0.50 లగేజీ ఛార్జీగా వసూలు చేస్తారు. 

ఒక ఆటోలో మొత్తం 100 కిలోగ్రాముల వరకు లగేజీని మాత్రమే అనుమతిస్తారు.కొత్త ఛార్జీలకు అనుగుణంగా ఆటోల్లోని డిజిటల్ మీటర్లను కూడా తప్పనిసరిగా సవరించాల్సి ఉంటుంది. ప్రయాణం ప్రారంభించి మీటర్‌ను ఆన్ చేసిన వెంటనే రూ.30 కనీస ఛార్జీగా నమోదు కావాలి.తొలి 1.60 కిలోమీటర్ల దూరం పూర్తయ్యే వరకు ఇదే కనీస ఛార్జీ కొనసాగుతుంది. ఆ తర్వాత ప్రతి 100 మీటర్ల దూరానికి రూ.1.40 చొప్పున ఛార్జీ పెరిగేలా మీటర్‌ను రీసెట్ చేయాలి.ప్రయాణికుల నుంచి సరైన ఛార్జీలు వసూలు చేయడంతో పాటు మీటర్లలోనూ కొత్త టారిఫ్ సక్రమంగా ప్రతిబింబించేలా చూడాలని రవాణా శాఖ స్పష్టం చేసింది. కొత్త విధానం అమలులో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు సూచించారు.

 

 

[ Telangana auto fare hike, auto minimum charge Rs 30, Telangana transport department, auto charges per km, Hyderabad auto news, CM Revanth reddy, Minister ponnam prabhakar, Telugu One, Telugu News ]

By
en-us Political News

  
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
బంగారం ప్రియులకు ఇది నిజంగానే ఊరటనిచ్చే శుభవార్త అని చెప్పవచ్చు
తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
హానీట్రాప్ ఉచ్చులో పడిన వాయుసేన అధికారి.. షాకింగ్ నిజాలు వెల్లడించిన ఛార్జ్‌షీట్.!
మినీ బస్‌ను ఢీకొన్న ట్రక్కు.. 23 మంది మృతి.!
రాష్ట్రంలో 25 పారిశ్రామిక ఎకోసిస్టమ్ లను అభివృద్ధి చేస్తాం: లోకేష్
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
1999లో ఎయిర్‌పోర్టుల గురించి ఎవరూ పెద్దగా ఆలోచించని సమయంలోనే.. సీఎం చంద్రబాబు నాయుడు శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంపై దృష్టి పెట్టారు.
ఇంట్లో ఆడపిల్ల జన్మిస్తే ఆ ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్టేనని పెద్దలు అంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.