వెబ్‌సిరీస్ చూసి స్కెచ్: బొల్లారం ఆయుధాల చోరీలో షాకింగ్ ట్విస్ట్.!

Publish Date:Oct 2, 2026

Advertisement

 వెబ్‌సిరీస్‌ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని  సికింద్రాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు. ముందుగా రెక్కీ నిర్వహించాడు.. భద్రతా ఏర్పాట్లను పరిశీలించాడు.. సహచరుల సహకారం తీసుకున్నాడు.. చివరకు ఆయుధాలను చోరీ చేసి వాటిని కలకత్తాలో విక్రయించేందుకు ప్రయత్నించి చివరకు పోలీసుల చేతికి చిక్కాడు..మాజీ ఆర్మీ ఉద్యోగి హవల్దార్‌ మల్లేష్‌ను పోలీసులు 10 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. చోరీ చేసిన ఆయుధాలను ముందుగానే పరిచయం ఉన్న అక్రమ ఆయుధాల వ్యాపారి అవల్‌ దెయ్‌ అలియాస్‌ ఓబీకి విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ కేసు కేవలం ఆయుధాల చోరీకే పరిమితం కాలేదని.. దీని వెనుక పెద్ద నెట్‌వర్క్‌ ఉందా? అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. 2009లో ఆర్మీలో చేరిన మల్లేష్‌కు ఆయుధాలు, మందుగుండు సామాగ్రిపై ప్రత్యేక శిక్షణ లభించింది. 

వివిధ కంటోన్మెంట్లలో పనిచేసిన సమయంలో ఆయుధాగారం బాధ్యతలు కూడా నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆయుధాల వినియోగం, వాటి నిర్వహణ, ఆయుధాగారంలోని వ్యవస్థపై అతడికి అవగాహన ఏర్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది.అయితే విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహ రించడంతో పలుమార్లు ఉన్నతాధికారుల క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొన్నట్లు పోలీసులు చెబుతున్నారు. 16 ఏళ్ల సర్వీస్‌ పూర్తయిన తర్వాత మరో మూడేళ్లు కొనసాగేందుకు అవకాశం ఉన్నప్పటికీ.. ఆ అవకాశాన్ని తీసుకోకపోవడంతో తనలో అసంతృప్తి, కక్ష పెరిగినట్లు మల్లేష్‌ చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. మల్లేష్‌కు గతంలో నేరచరిత్ర కూడా ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. 2007లోనే ఆమ్రాబాద్‌, అచ్చంపేట ప్రాంతాల్లో ఇళ్ల దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఆర్మీలో చేరడం.. ఆయుధాలపై శిక్షణ పొందడం.. ఆయుధాగారాల బాధ్యతలు నిర్వహించడం.. ఇవన్నీ అతడికి ఆయుధాలపై ప్రత్యేక పరిజ్ఞానాన్ని అందించినట్లు పోలీసులు భావిస్తున్నారు.

అక్రమ ఆయుధాలతో మల్లేష్‌కు పరిచయం కూడా పాతదేనని విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. 2022లో కలకత్తా బ్యారక్‌పూర్‌లో ఉన్న సమయంలో అక్రమ ఆయుధాల వ్యాపారి అవల్‌ దెయ్‌ అలియాస్‌ ఓబీతో మల్లేష్ కు పరిచయం ఏర్పడింది.. బీర్బల్‌ షా ద్వారా అవల్‌ దెయ్‌తో పరిచయం పెంచుకున్న మల్లేష్‌.. అతడి నుంచి రూ.10 వేలకు తుపాకీ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తుపాకీతో దారి దోపిడీకి ప్రయత్నించినప్పటికీ విఫలమయ్యాడని, అనంతరం తుపాకీని స్వగ్రామంలో దాచినట్లు మల్లేష్‌ కన్ఫెషన్‌లో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. అయితే మల్లేష్ ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్న సమయంలో 2025లోనే ఆర్మీ ఆయుధాల చోరీ ఆలోచన మల్లేష్‌కు వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. వెబ్‌సిరీస్‌లు, బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలను చూస్తూ చోరీకి సంబంధించిన పద్ధతులను పరిశీలించినట్లు విచారణలో వెల్లడైంది. తనకు ఉన్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకుని ఆయుధాలను చోరీ చేసి వాటిని విక్రయించడం ద్వారా డబ్బు సంపాదించాలనే ఆలోచనకు వచ్చినట్లు పోలీసులు అనుమాని స్తున్నారు.ఆలోచనకు కార్యరూపం ఇచ్చేందుకు మల్లేష్‌ మద్రాస్‌ రెజిమెంట్‌ను టార్గెట్‌గా ఎంచుకున్నట్లు పోలీసులు చెబుతు న్నారు. జూలై 2026లో పలుమార్లు రెక్కీ నిర్వహించి ఆయుధాగారం చుట్టూ ఉన్న భద్రతా ఏర్పాట్లను పరిశీలిం చినట్లు తెలిపారు.

సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయి? విద్యుత్‌ దీపాలు ఎక్కడ ఉన్నాయి? జవాన్ల కదలికలు ఎలా ఉంటాయి? వంటి అంశాలను పరిశీలిం చినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. ఈ వ్యవహారంలో శేషులు, ప్రవీణ్‌, వినోద్‌ సహకారం తీసు కున్నట్లు పోలీసులు చెబుతున్నారు.చోరీ తర్వాత ఆయుధాలను మద్రాస్‌ రెజిమెంట్‌ నుంచి బయటకు తరలించేం దుకు మల్లేష్‌ యాక్టివాను ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం బ్రీజా కారులో వాటిని నాగర్‌కర్నూల్‌లోని తన ఇంటికి తరలించి దాచినట్లు కన్ఫెషన్‌ స్టేట్‌మెంట్‌లో వెల్లడైనట్లు తెలిపారు. అక్కడితో ఆగకుండా.. చోరీ చేసిన ఆయుధాలను ఎలా, ఎవరికి విక్రయించాలన్న దానిపై ముందుగానే ప్రణాళిక వేసుకున్నట్లు దర్యాప్తులో బయటపడింది. చోరీ చేసిన ఆయుధాలను కలకత్తాకు తరలించి విక్రయించేందుకు మల్లేష్‌ ముందుగానే ప్రయత్నించినట్లు పోలీసులు చెబుతున్నారు. బీర్బల్‌ షా ద్వారా అవల్‌ దెయ్‌ అలియాస్‌ ఓబీతో సంప్రదింపులు జరిపి ఆయుధాల విక్రయానికి ఒప్పందం చేసుకున్నట్లు గుర్తించారు.

ఇక్కడే కేసు మరో మలుపు తిరిగింది. బీర్బల్‌ షాకు బంగ్లాదేశ్‌ నుంచి కలకత్తాకు వచ్చే వ్యక్తులతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులకు అనుమానం ఉంది. ఈ పరిచయాల వెనుక అక్రమ ఆయుధాల రవాణా, కొనుగోలు, విక్రయాల వ్యవహారం ఉందా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మల్లేష్‌ కస్టడీ విచారణలో బయటపడిన వివరాల ఆధారంగా బీర్బల్‌ షా, అవల్‌ దెయ్‌ అలియాస్‌ ఓబీకి దేశవ్యాప్తంగా అక్రమ ఆయుధాల నెట్‌వర్క్‌ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారు? ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడికి తరలిస్తున్నారు? గతంలో ఎలాంటి లావాదేవీలు జరిగాయి? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం బీర్బల్‌ షా, అవల్‌ దెయ్‌ అలియాస్‌ ఓబీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరిద్దరిని అదుపులోకి తీసుకుంటే మద్రాస్‌ రెజిమెంట్‌ ఆయుధాల చోరీతో పాటు అక్రమ ఆయుధాల క్రయవిక్రయాల వెనుక ఉన్న నెట్‌వర్క్‌పై మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.

 

 

 

[ Bolarum weapons theft case, Mallesh, Madras Regiment Hyderabad, Hyderabad Police investigation, Army weapon robbery case,Vinod and Seshu arrest, Madras Regiment, Hyderabad police, CP Sajjanar, DGP C.V.Anand ]


 

By
en-us Political News

  
హైదరాబాద్‌‌ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.
హైదరాబాద్‌ నగరంలో శాంతిభద్రతల నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టేందుకు పోలీస్‌ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.