అసెంబ్లీ ఫైట్ కు అంతా సిద్ధం..

Publish Date:Sep 23, 2021

Advertisement

రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కి కిక్కిస్తున్న సమయంలో  తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసన మండలి సమావేశాలు శుక్రవారం (సెప్టెంబర్ 24) నుంచి ప్రారంభ మవుతున్నాయి. కనీసం వారం పదిరోజులు అయినా జరిగే వర్షాకాల సమావేశాల్లో ఉరుములు, మెరుపులకు కొదవ ఉండదని వేర్ చెప్పనక్కర లేదు. హుజూరాబాద్ ఉప ఎన్నిక, దళిత బంధు పథకం, కొవిడ్ సంబంధిత సమస్యలు, ఆర్టీసీ  ఆస్తుల అమ్మకానికి సంబంధించి వస్తున్న వార్తలు, డ్రగ్స్ మాఫియా చుట్టూ అల్లుకున్న సవాళ్ళు, వైట్ ఛాలెంజ్ ఇష్యూ, విద్యుత్ చార్జీల పేపు ప్రతిపాదనలు ఇలా ఒకటని కాదు, అనేక సమస్యలు హాట్ హాట్ గా చర్చకు వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అలాగే దళిత బంధుకు చట్టబద్దత కల్పించే బిల్లుతో పాటు మరో ఏడు బిల్లులు సభ ముందుకు వస్తాయని తెలుస్తోంది.

ఇదలా ఉంటే ఈరోజు (గురువారం) సమావేశాల ఏర్పాటు, భద్రత ఇతర సంబంధిత విషయాలపై స్పీకర్ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌ సహా పోలీస్ శాఖ ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. సభ సజావుగా సాగేందుకు అధికారులు సహకారం అందించాలన్నారు.అసెంబ్లీ సమావేశాలు అక్టోబర్‌ 1 వరకు కొనసాగే అవకాశముంది. తేదీలు, ఎజెండా వంటి విషయాలపై సమావేశాల తొలి రోజున జరిగే బీఏసీ భేటీలో నిర్ణయించనున్నారు. ప్రొటెం చైర్మన్‌ హోదాలో భూపాల్‌ రెడ్డి తొలిసారి మండలి సమావేశాలను నిర్వహించనున్నారు.

ప్రభుత్వం అయితే తూతూ మంత్రంగా సమావేశాలు జరిపించి, చేతులు తులుపుకోవాలనే అనుకుంటోంది. నిజానికి, రాజ్యంగ అవసరంగా మాత్రమే ప్రభుత్వం సమావేశాలు నిర్వహిస్తోందే కానీ, ప్రజాస్వామ్య స్పూర్తితో ప్రజాసమస్యలు చర్చించేందుకు  సమావేశాలు నిర్వహించడం లేదు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి తంతు ఇదే తీరుగ నడుస్తోంది. అయితే ఈ రోజు ఏర్పాట్లను సమీక్షించిన స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అసెంబ్లీ సమావేశాలు పారదర్శకంగా జరగడానికి గత సమావేశాలలో మాదిరిగానే ప్రభుత్వం, అధికారులు సహకారం అందించాలని కోరారు. అంటే కాదు, సభ లోపలే కాదు బయట కూడా ఎలాంటి ప్రజాందోళనకు ఆస్కారం లేకుండా పోలీసులు పూర్తి సహకారం అందించాలని కోరారు. అయితే, సభలోపలే కాకుండా సభ వెలుపల కూడా ప్రజలు తమ సమస్యలు చెప్పుకునే అవకాసం లేకుండా చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదమని విపక్షాలు ఆరోపిస్తున్నారు.

By
en-us Political News

  
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.