కాంగ్రెస్‌, టీడీపీలఫై కిషన్‌రెడ్డి ఫైర్

Publish Date:Jan 22, 2012

Advertisement

మహబూబ్ నగర్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిజెపి వంటి జాతీయ పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి  అన్నారు. ఆయన మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో తెలంగాణ పోరు యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఎన్ని అవాంతరాలు ఎదురైనా తెలంగాణ సాధన కోసం తమ పార్టీ చిత్తశుద్ధితో పని చేస్తుందని స్పష్టం చేశారు.జేఏసీలన్నీ కలిసి సమిష్టగా తెలంగాణ కోసం పోరాడాలని కోరారు. ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం పోరాడాలని కోరారు. రెండో ఎస్సార్సీలో తెలంగాణ అంశం లేదంటున్న కేంద్ర ప్రభుత్వం వచ్చే బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ఎస్సార్సీతో పని లేదంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రషీద్అల్వీ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. సకల జనుల సమ్మె తరువాత ఉద్యమం బలహీనపడిందని వ్యాఖ్యలు చేస్తున్న వారు పోరుయాత్రకు వస్తున్న స్పందన చూసి ఆశ్చర్యపోతున్నారన్నారు. టిడిపి, కాంగ్రెస్‌లపైనా ఆయన విరుచుకుపడ్డారు. తెలంగాణ అంశంపై కాంగ్రెస్ నేతలు రెండు నాలుకల ధోరణిని, చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని అవలంబిస్తున్నారని ధ్వజమెత్తారు.ఈ రెండు పార్టీలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది కాంగ్రెస్ పార్టీయే అని ప్రగల్భాలు పలికిన నేతలు ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గారో సమాధానవివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ అంశంపై కాంగ్రెస్, టిడిపికి స్పష్టమైన విధానమే లేదని, ప్రాంతానికో మాట మాట్లాడుకుంటూ తెలంగాణపై ఉద్యమిస్తున్న వారిని మాత్రం విమర్శిస్తున్నాయని దుయ్యబట్టారు బిజెపిని విమర్శించే నైతిక హక్కు వారికి లేదని నిప్పులు చెరిగారు. వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై బిల్లు ప్రవేశపెట్టకపోతే, 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి తామే తెలంగాణ ఇస్తామన్నారు. తెలంగాణ కోసం 750 మంది బలిదానం చేసుకున్నా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ మనస్సు చలించలేదని విమర్శించారు. తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఆత్మబలిదానాలకు సోనియాగాంధీ, చంద్రబాబులే బాధ్యత వహించాలని అన్నారు.

By
en-us Political News

  
సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, అంతే స్థాయిలో నేరగాళ్ల అక్రమ మార్గాలు కూడా పెరిగిపోతున్నాయి.
విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉంటూ.. ఎండ, వాన, పగలు, రాత్రి తేడా లేకుండా ప్రజల రక్షణ కోసం శ్రమించే పోలీసుల ఆరోగ్యంపై తెలంగాణ పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.
రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపిన ఒక అనూహ్య ఘటనలో, నకిరేకల్ శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ వేముల వీరేశంకు పెను ప్రమాదం తృటిలో తప్పింది.
హైదరాబాద్ పాతబస్తీలో మైనర్ బాలుడిపై లైంగిక వేధింపుల ఘటన తీవ్ర కలకలం రేపింది.
బాధితుల కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారించిన  హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.వి. భాస్కర్ రెడ్డి  చట్టాన్ని రక్షించాల్సిన బాధ్యతలో ఉన్న ఒక పోలీసు అధికారి  కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడం గర్హనీయమని పేర్కొంటూ,  కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించిన సీఐకు శిక్ష  విధించింది.  
తెలంగాణ రాష్ట్రంలో యాదవ సోదరుల ఆత్మగౌరవ వేడుకగా భావించే చారిత్రక సదర్ సమ్మేళనం అత్యంత వైభవంగా జరిగింది.
కదులుతున్న బస్సులోంచి తోసేయడంతో విషాదం.. ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం.!
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన తాజా సంచలన చిత్రం ఇరుముడి చట్టపరమైన చిక్కుల్లో పడింది.
60 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు అపహరణ.!
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
అవసరానికి ఆదుకుంటుందనే నమ్మకంతో ఓ వ్యక్తి ర్యాపిడో పార్సిల్ సేవలను ఆశ్రయించాడు.
బిగ్ బ్రదర్ ఆఫీసులో రియల్టర్‌కు ప్రత్యేక ఛాంబర్.. ఒక్క బిల్డర్ కోసం వేలాది కుటుంబాలను రోడ్డున పడేస్తారా?
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అమాయక యువతులను లక్ష్యంగా చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా నడుపుతున్న మరో అక్రమ ఫెర్టిలిటీ రాకెట్‌ను పోలీసులు రట్టు చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.