అసంతృప్తి వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతలు
Publish Date:Jan 22, 2012
Advertisement
హైదరాబాద్: పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత లేకుండా పోయిందని రాయపాటి సాంబశివ రావు ఆవేదన వ్యక్తం చేశారు.గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు గాంధీ భవన్లో కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్‌ను కలిసి ఆ పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీనియర్ల ప్రాధాన్యత తగ్గడం సరికాదని, వారికిచ్చే ప్రియారిటీ వారికివ్వాలన్నారు. మాచర్ల, పత్తిపాడు నియోజకవర్గాల్లో సరైన అభ్యర్థులకు టిక్కెట్లు కేటాయిస్తేనే గెలిపించి తీరుతామన్నారు. తాను ఆజాద్‌ను ఏమీ అడగలేదన్నారు. మరో నేత వి హనుమంత రావు మాట్లాడుతూ పార్టీలో అగ్ర వర్ణాలకే పెద్ద పీట వేయడం బాధాకరమన్నారు.ఎనభై శాతం ఓట్లు వెనుక బడిన వర్గాల వారివేనన్నారు. పదవుల విషయంలో దళితులకు అన్యాయం జరిగిందన్నారు. పదవులన్నీ ఆగ్ర కులాలకేనా అని ప్రశ్నించారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీయే బలహీనవర్గాల బలం తెలుసుకున్నాడన్నారు.
http://www.teluguone.com/news/content/rayapati-sambasivarao-24-11131.html





