జగన్ సభకు కేసీఆర్ కాపలా కుక్క:పెద్ది రెడ్డి
Publish Date:Jan 11, 2012
Advertisement
హైదరాబాద్ : "తెలంగాణకు కాపలా కుక్క మాదిరిగా ఉంటానన్న కేసీఆర్ ఇప్పుడు జగన్ ఆర్మూర్ సభకు కాపలా కుక్క మాదిరిగా మారిపోయారని తెలుగుదేశం నాయకుడు పెద్దిరెడ్డి విమర్శించారు. ఢిల్లీలో కాంగ్రెస్ తో దోస్తీ హైదరాబాదులో వైఎస్సార్ కాంగ్రెస్ తో చెలిమి అన్నట్లుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు వరంగల్ పర్యటనకు మూడు రోజుల ముందు నానా విన్యాసాలు చేసిన హరీష్ ఇప్పుడు గృహ నిర్భంధం పేరు తో డ్రామా ఆడుతున్నారు. వారిది రెండు తలల సి ద్ధాంతం'' అని టీడీపీ ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి ఎద్దే వా చేశారు. ఆయన ఎన్టీఆర్ భవన్లో పార్టీ నేత శోభారాణితో కలిసి మీడియాతో మాట్లాడారు."రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ జగన్ పార్లమెంటులో ప్లకార్డు పట్టుకొని తిరిగారు. అప్పటికి ఇప్పటికి ఆయనలో వచ్చిన మార్పేమిటి? తెలంగాణ విషయంలో ఆయనలో కేసీఆర్‌కు, కోదండరామ్‌కు ఏం స్పష్టత కనిపించింది? జగన్‌పై నిజామాబాద్‌లో కొందరు మహిళలు కోడిగుడ్లు పట్టుకొని న వ్వుతూ బంతిపూల మాదిరిగా వేశారు.
మీ చీకటి ఒప్పందాలు బయట పడకుండా ఈ చిన్న ప్రయత్నాలు చేయించారు'' అని ఆయన విమర్శించారు.ఉవ్వెత్తున ఎగసిపడ్డ తెలంగాణ సకలజనుల సమ్మె తర్వాత కేసీఆర్ ఢిల్లీ వెళ్లి తెలంగాణా వాదాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. ప్రజలు ఇకనైనా ఆలోచించి తెరాసకు బుద్ధి చెప్పాలన్నారు.తెలంగాణ వాదం బందీ అయిపోయిందనీ, సంఘటితంగా ముందుకు కదలాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. తెలంగాణ వాదాన్ని ఓడగొడుతున్నవారిని తరిమికొట్టి రాష్ట్రాన్ని సాధించుకోవాలన్నారు. మరో చెన్నారెడ్డి మాదిరిగా తయారైన కేసీఆర్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. "చంద్రబాబుకు రాళ్ళతో జగన్‌కు బంతిపూలతో స్వాగతం పలుకుతారా? కేసీఆర్ మాయలో నుంచి ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు బయట పడాలి'' అని శోభారాణి వ్యాఖ్యానించారు.
http://www.teluguone.com/news/content/telangana-24-10888.html





