ఇంగ్లాండ్ తో ఐదు టి20ల సిరీస్ లో భాగంగా ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా మంగళవారం (జూన్ 7) జరిగిన మూడో టి20 మ్యాచ్ లో టీమ్ ఇండియా ఘోరాతి ఘోరంగా పరాజయం పాలైంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా.. ఆ తరువాత వరుసగా రెండు మ్యాచ్ లలోనూ టీమ్ ఇండియా పరాజయాలను మూటగట్టుకుంది. దంతో ఈ సిరీస్ లో ఇంగ్లాండ్ 2-0తో ఆధిక్యంలో ఉంది.
కాగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు సాధించింది. ఆ జట్టు ఓపెనర్ ఫిల్ సాల్ట్ భారత బౌలర్లపై విరుచుకుపడుతూ 44 బంతుల్లో 70 పరుగులుచేశాడు. జోస్ బట్లర్ 36 రాణించాడు. చివర్లో శామ్ కర్రన్ 24 బంతుల్లో 41 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో ఇంగ్లాండ్ జట్టు సులువుగా 200 పరుగుల మార్కును దాటింది. భారత బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 30 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.
202 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన టీమ్ ఇండియా బ్యాటింగ్ లైనప్ ఇంగ్లాండ్ పేస్ ధాటికి పేకమేడలా కూలిపోయింది. భారత బ్యాటర్లు ఎవరూ కూడా క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. ఇంగ్లాండ్ బౌలర్ల స్వింగ్, వేగానికి సమాధానం చెప్పలేక వరసగా వికెట్లు పారేసుకున్నారు. దీనితో 11.4 ఓవర్లలోనే 76 పరుగులకే టీమ్ ఇండియా ఆలౌట్ అయ్యి 125 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ టంగ్ 4 వికెట్లతో చెలరేగగా, జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు, ఆదిల్ రషీద్ 2 వికెట్లు తీశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/team-india-suffers-a-crushing-defeat-in--third-t20-36-225346.html
లోకేష్ షూఆల్స్, సోలమ్, అపాక్ట్, బూ యంగ్, హ్వాసుంగ్ వంటి దిగ్గజ కంపెనీలతో పాటు, శాంసంగ్ , ఎల్‌జీ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాల ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణం, ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, మౌలిక వసతులను వారికి సమగ్రంగా వివరించి వారు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఉత్సుకత, ఆసక్తి చూపేలా చేయడంలో సఫలీకృతులయ్యారు.
ఇరాన్‌పై అమెరికా జరుపుతున్న సైనిక దాడులకు తాము ఎంతమాత్రం సహకరించబోమని.. ఇటలీలో ఉన్న తమ సైనిక స్థావరాలను అమెరికా ఇరాన్ పై దాడుల కోసం ఉపయోగించుకోవడానికి అనుమతించే ప్రసక్తే లేదని జార్జియా మెలోనీ విస్ఫష్టంగా తేల్చి చెప్పారు.
వైసీపీ సర్కార్ సకల పర్యావరణ నిబంధనలనూ తుంగలోకి తొక్కి మరీ నిర్మించిన ఈ ప్యాలెస్ ను రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా వినియోగంలోకి తీసుకురావాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
పణ్వేల్ తాలూకా పరిధిలోని హెచ్‌పీసీఎల్ పాతాళగంగా ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్ వరద నీటిలో మునిగిపోవడంతో అక్కడ ఉన్న సుమారు మూడు వేల గ్యాస్ సిలిండర్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి.
జపాన్‌లోని తీరప్రాంత నగరం ఫుకుయోకాలోని మామిజుపియా డీశాలినేషన్ కేంద్రంలో దేశంలోనే మొట్టమొదటి ఒస్మోటిక్ పవర్ ప్లాంట్‌ను ప్రారంభించి జపాన్ ఇంధన రంగంలో వినూత్న విప్లవానికి నాంది పలికింది.
ఉగ్రవాదానికి మద్దతునిచ్చే దేశాల బ్లాక్‌లిస్ట్ జాబితా నుండి సిరియాను అధికారికంగా తొలగించాలని ట్రంప్ నిర్ణయించారు. దశాబ్దాలుగా అంతర్జాతీయ సమాజంలో ఒంటరైపోయిన డమాస్కస్‌తో దౌత్య సంబంధాలను మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావడానికి.. యుద్ధంతో కుదేలైన ఆ దేశ ఆర్థిక రంగాన్ని పునరుద్ధరించడానికి ట్రాంప్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
డిలీట్ చేసిన డేటా కోసం పోలీసులు ఫోన్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఆ ల్యాబ్ నుంచి వచ్చిన నివేదికలో షాకింగ్ అంశాలు వెలుగులోకి వచ్చాయి. రావణ్ అమాయక యువతులను టార్గెట్ గా చేసుకుని వారితో అసభ్యకరంగా ప్రవర్తించడం.. ఏకాంతంగా ఉన్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసినట్లు ఫోరెన్సీక్ ల్యాబ్ నివేదికలో వెల్లడైనట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.
రాష్ట్రంలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చర్చనీయాంశంగా మారింది. ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు ప్రముఖ నాయకులపై నిస్సిగ్గుగా విమర్శలు చేసినందుకు పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ప్రస్తుత చట్టాల ప్రకారం ఏడేళ్ల లోపు శిక్ష పడే సెక్షన్ల కింద కేసులు నమోదు కావడంతో కోర్టులో అతనికి తక్షణమే బెయిల్ లభించింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న 9 ప్రముఖ AI టూల్స్ యొక్క బలహీనతను వాడుకుని హాకర్లు భారీ బాట్‌నెట్ నెట్‌వర్క్‌లను సృష్టిస్తున్నారు. హాలూస్క్వాటింగ్ (HalluSquatting) అనే ఈ సరికొత్త సైబర్ ముప్పు గురించిన పూర్తి వివరాలు మీకోసం.
2026 సంవత్సరంలో ఉక్కపోత మరియు వేసవి ఎండలను తరిమికొట్టే సరికొత్త షార్క్, డైసన్ మరియు డ్రియో కంపెనీల టాప్ 5 కూలింగ్ ఫ్యాన్స్ వివరాలు, ధరలు మరియు వాటిలోని AI మోషన్ ట్రాకింగ్, వాటర్ మిస్ట్ టెక్నాలజీ ప్రత్యేకతలు మీకోసం.
శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఫలితాల తర్వాత గ్లోబల్ చిప్ మార్కెట్లో భారీ పతనం. అమెరికా వాల్ స్ట్రీట్‌లో ఇంటెల్, ఏఎండీ, శాన్‌డిస్క్ షేర్లు కుప్పకూలాయి. నాస్‌డాక్ 500 పాయింట్లు పడిపోవడానికి గల పూర్తి కారణాలు, చమురు ధరల పెరుగుదల వివరాలు ఇక్కడ చూడండి.
అమరావతి ల్యాండ్ పూలింగ్ రైతులకు ఏపీసీఆర్‌డీఏ భారీ ఊరటనిచ్చింది. ఎకరాకు రూ. 40,000 కౌలు పెంపు, మరో 15 ఏళ్ల పొడిగింపుతో పాటు రూ. 1.5 లక్షల రుణమాఫీ ప్రకటనతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ తాగే వాటర్ బాటిల్ ధర రూ.49 లక్షలు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న షాకింగ్ నిజాలు, ఆ బాటిల్ ప్రత్యేకతలు ఇక్కడ చూడండి.