చాంపియన్స్ ట్రోఫీఫైనల్స్‌కి టీమ్ ఇండియాకు షాక్?.. గాయంతో హార్థిక్ పాండ్యా ఔట్?!
Publish Date:Mar 6, 2025
Advertisement
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్‌కు షాక్ తగిలే పరిస్థితి కనిపిస్తుంది. సెమీస్‌లో భారత్ విజయంలో తన వంతు పాత్ర పోషించిన హార్దిక్‌పాండ్యా ఫైనల్‌కు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తున్నది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి సెమీ ఫైనల్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. నాలుగు వికెట్ల తేడాతో భారత జట్టు విజయాన్ని అందుకుంది. ఆస్ట్రేలియా విధించిన 265 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు సునాయాసంగా ఛేదించింది. ఛేజింగ్ మాస్టర్ కింగ్ కోహ్లీ మరోసారి రాణించడంతో ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం సాధించింది. మరో వైపు రెండో ఫైనల్‌లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు తలపడగా, కివీస్ జట్టు విజయాన్ని అందుకుని ఫైనల్‌కు చేరుకుంది. దీంతో ఆదివారం టీమిండియాతో న్యూజిలాండ్ ఫైనల్‌లో తలపడనుంది. అదలా ఉంటే ఫైనల్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తోంది. స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు గాయం అయినట్టు తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాకు గాయం అయింది. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో కాలుకు గాయం అయింది. హార్దిక్ పరుగు తీయడానికి ప్రయత్నిస్తూ గాయపడ్డాడు. హార్దిక్ వెంటనే తన క్రీజులోకి తిరిగి వచ్చినప్పుడు కాలు ఇబ్బందిపెట్టినట్లు కనిపించింది. ఆ తర్వాత హార్దిక్ పరుగులు సాధించడంలో కొంత ఇబ్బంది పడినట్టు కనిపించాడు. అయితే ఆ తర్వాత అద్భుతమైన సిక్స్‌లతో మ్యాచ్‌ను ఇండియా వైపు తిప్పడంలో కీలక పాత్ర పోషించాడు.గతంలో హార్దిక్ చీలమండ గాయంతో బాధపడ్డాడు. ఇప్పుడు అది మళ్లీ తిరగబెట్టిందన్న ఆందోళన అభిమానుల్లో వ్యక్తం అవుతోంది. ఒకవేళ గాయం తీవ్రతరమైనది అయితే కనుక ఫైనల్ మ్యాచ్‌కు అతను దూరం కావాల్సి ఉంటుంది. ఇది ఫైనల్‌కు ముందు భారత జట్టు ఆందోళనలను పెంచుతుందనడంలో సందేహం లేదు.అయితే హార్దిక్ గాయంపై బీసీసీఐ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
http://www.teluguone.com/news/content/team-india-star-allrounder-doubt-in-finals-25-193956.html





