మోడీ గారికి ఏపీ ప్రజల లేఖ

Publish Date:May 10, 2015

Advertisement

 

భారత ప్రధాని నరేంద్రమోడీకి బాగా విసిగిపోయి వున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాసుకుంటున్న లేఖ. ఏపీ ప్రజలు రాసిన లేఖ అనగానే ఏ ప్రత్యేక హోదా కోసమో రాసిన లేఖ అనో, కష్టాల్లో వున్నాం ఆర్థికంగా ఆదుకోండి మహాప్రభో అని మొరపెట్టుకునే లేఖో అనుకున్ని  ఎప్పట్లాగే చెత్తబుట్టలో విసిరేయకండి. ఇది అలాంటి లేఖ కాదు.. మీకు అలాంటి లేఖలు ఎన్ని రాసినా ఉపయోగం వుండదని మాకు అర్థమైపోయింది. కాబట్టి మీకు అలాంటి లేఖలు రాయబోం. ఇది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అర్జెంటుగా మీ పార్టీలో విలీనం చేసుకోండని విజ్ఞప్తి చేసే లేఖ.

పీకల్లోతు కేసుల్లో కూరుకుపోయి వున్న వైసీపీ నాయకుడు జగన్ మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ పంచన వున్నారు. ఇప్పుడు మీ పంచన చేరాలని తహతహలాడుతున్నాడు. ఆయన పార్టీని మీ పార్టీలో విలీనం చేసేసి తన కేసుల నుంచి పూర్తిగా తప్పించుకునే ప్లాన్‌లో వున్నాడు.  బీజేపీ నాయకుడిగా మారిపోయి ఏపీలో హడావిడి చేసి, టీడీపీకి, బీజేపీకి మధ్య చిచ్చు పెట్టి తాను లాభం పొందాలని అనుకుంటున్నాడు. ఆయన మొన్నటి వరకు టీడీపీ - బీజేపీ ఫ్రెండ్ షిప్ ఎప్పుడు కట్టయిపోతుందా, నా పార్టీ టీడీపీ ప్లేసులోకి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూశారు. అందుకు తెరవెనుక  ప్రయత్నాలు కూడా చేశారు. అయితే అది వర్కవుట్ కాలేదు. అందుకే ఇప్పుడు పార్టీని విలీనం చేస్తే ఓ పనైపోతుందని భావిస్తున్నారు. సొంత పార్టీ ద్వారా ఎలాగూ సీఎం కాలేకపోయాను... బీజేపీలో చేరితే అయినా సీఎం అయిపోతానని కలలు కంటున్నారు. మీ పార్టీ కూడా ఏపీలో పాతుకుపోవాలని, వచ్చే ఎన్నికలలో అధికారం సంపాదించాలని కలలుకంటోంది. మీ రెండు పార్టీల మనసులలో కలసిపోవాలని కలలున్నప్పటికీ, ఆ కలలకు టీడీపీకి - బీజేపీకి మధ్య వున్న దోస్తీ అడ్డం వస్తోంది. అయితే టీడీపీ - బీజేపీ దోస్తీ వల్ల ఏపీకి ఎలాంటి లాభం లేదని అందరికీ అర్థమైపోయింది. అంచేత ఈ ముసుగులో గుద్దులాటలు మానేసి వైసీపీని మీ పార్టీలో కలిపేసుకోండి. అప్పుడు ఆటోమేటిగ్గా టీడీపీతో మీ దోస్తీ కట్ అయిపోతుంది. ఇప్పటి వరకూ మీతో మిత్రధర్మం పాటిస్తూ వస్తున్న టీడీపీ అప్పటి నుంచయినా యాక్టివ్ అయిపోయి ఏపీ హక్కుల సాధనలో కేంద్రంతో నిర్దాక్షిణ్యంగా వ్యవహరించగలుగుతుంది. అంచేత అందరికీ ఆనందాన్నిచ్చే బీజేపీలో వైసీపీ విలీనం సాధ్యమైనంత త్వరగా జరిగిపోవాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు. తమరు ఈ విషయాన్ని పరిశీలించల్సిందిగా విజ్ఞప్తి.

By
en-us Political News

  
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.