జగన్ కేసులపై ప్రతి రోజూ విచారణ సరిపోదు: రోజంతా జరపాలి: ఈడీ పిటిషన్‌కు సోమిరెడ్డి మద్దతు.!

Publish Date:Oct 12, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్  అక్రమాస్తుల కేసులు మరోసారి చర్చనీయంశంగా మారాయి.  ఈ కేసులను రోజు వారీ విచారణ చేపట్టాలని కోరుతూ ఈడీ పిటిషన్ దాఖలు చేయడాన్ని తెలుగుదేశం స్వాగతించింది. జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  

తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో ఆదివారం (అక్టోబర్ 11) మీడియాతో మాట్లాడిన సోమిరెడ్డి జగన్‌పై నమోదైన కేసుల విచారణలో జరుగుతున్న జాప్యంపై ప్రశ్నలు సంధించారు. 2011లో సీబీఐ కేసులు నమోదు చేసినప్పటికీ, ఇంతకాలం గడిచినా విచారణ ప్రక్రియ ముందుకు సాగకపోవడం ఆందోళనకరమన్నారు. ఈ కేసుల్లో న్యాయప్రక్రియ వేగంగా కొనసాగాల్సిన అవసరం ఉందన్న ఆయన.. జగన్‌పై ఉన్న అక్రమాస్తుల కేసు  దేశంలోనే అతిపెద్ద అవినీతి కేసుగా  అభివర్ణించారు.  

తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ రూ.43 వేల కోట్లకు పైగా అక్రమాస్తులు కూడగట్టారని ఆరోపించిన ఆయన.. డిశ్చార్జి పిటిషన్ల పేరుతో విచారణను ఆలస్యం చేస్తున్నారని విమర్శించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు సంబంధించిన కేసుల విచారణతో పోల్చుతూ, జగన్ కేసుల్లోనూ న్యాయప్రక్రియ త్వరగా పూర్తికావాలన్నారు. 

అదలా ఉంటే.. జగన్ కేసుల విచారణను వేగవంతం చేయాలంటూ ఈడీ హైకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం తీసుకునే నిర్ణయం, విచారణను వేగవంతం చేసేందుకు ఎలాంటి ఆదేశాలు వెలువడతాయన్న అంశాలపై ఆసక్తి నెలకొంది. మరోవైపు, ఈ కేసులు రాజకీయ విమర్శలకు కేంద్రంగా కొనసాగుతున్నాయి. ఆరోపణలు, ప్రతివాదనలు పక్కనపెడితే, కేసులపై న్యాయస్థానాల్లో సకాలంలో విచారణ జరగడం, ఆధారాల ఆధారంగా నిర్ణయాలు వెలువడటం ప్రజలకు కీలకం.  ఇప్పటికైనా జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ రోజు వారీ జరిగి, ఇకెంత మాత్రం జాప్యం లేకుండా తుది తీర్పు వెల్లడి కావాలని పలువురు కోరుతున్నారు. 

 

[TDP MLA Somireddy On Jagan Cases, Somireddy Chandramohan Reddy, Jagans Disproportionate Assets Case, ED Petition, AP Politics, Telugu One]

By
en-us Political News

  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
ఏకంగా 21 పెళ్లిళ్లు చేసుకున్న బెగ్గర్.!
భారతీయ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల సంఘం (సీఈసీ) జ్నేಶ್ కుమార్ రాజీనామా డిమాండ్ కలకలం రేపుతోంది.
ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో పవర్ బ్యాంక్‌లో మంటలు చెలరేగడం కలకలం రేపింది.
గోవా కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్‌ దందా హైదరాబాద్‌ వరకు విస్తరించినట్లు పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
చంద్రబాబు అరెస్ట్ సమయంలో రోడ్డెక్కింది మేమే.. డిప్యూటీ సీఎం.!
పాత కరెన్సీ నోట్లకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తామంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చి అమాయకులను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల
దేశ రాజధానిలో నిరసనల నేపథ్యంలో విధించిన కఠిన నిబంధనలపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది.
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయసులోనే ఐదేళ్ల చిన్నారి అరేలియా జీవితం విషాదాంతమైంది.
భర్త మంచానికే పరిమితమయ్యాడు.. కుటుంబ బాధ్యతలు ఓవైపు.. జీవితంలో ఎదురైన కష్టాలు మరోవైపు
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.