హైదరాబాద్‌లో బిర్యానీ ప్రియులకు షాక్..భారీగా పెరిగిన ధరలు.!

Publish Date:Nov 16, 2026

Advertisement

హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది. నగరంలో ఎంతో ఇష్టంగా తినే బిర్యానీ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. నగరంలోని పలు ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లు ప్లేట్ బిర్యానీపై రూ.50 వరకు ధరలు పెంచేశాయి. దీంతో వీకెండ్‌లో కుటుంబంతో కలిసి హోటల్‌కు వెళ్లాలన్నా, చిన్నపాటి సెలబ్రేషన్ చేసుకోవాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్న సామాన్యుడికి ఈ పెంపు అదనపు భారంగా మారింది.

హైదరాబాద్‌లో సుమారు 25 వేల హోటళ్లు, రెస్టారెంట్లు ఉన్నట్లు వ్యాపార వర్గాల అంచనా. ఉద్యోగాలు, చదువుల కోసం నగరానికి వచ్చిన బ్యాచిలర్లు, విద్యార్థులు, ఐటీ ఉద్యోగుల్లో చాలామంది బయటి ఆహారంపైనే ఆధారపడుతుంటారు. తాజా ధరల పెంపుతో వీరి నెలవారీ ఆహార బడ్జెట్‌పై రూ.500 నుంచి రూ.1,000 వరకు అదనపు భారం పడే అవకాశం ఉందని అంచనా.

ఇక నగరవ్యాప్తంగా రోజుకు సుమారు 6 లక్షల బిర్యానీ ప్లేట్లు అమ్ముడవుతున్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. సగటున ఒక్కో ప్లేట్‌పై రూ.30 పెరిగినా.. నగరవాసులపై రోజుకు రూ.1.8 కోట్ల అదనపు భారం పడుతుంది. అంటే నెలకు సుమారు రూ.54 కోట్ల మేర అదనపు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌ల ద్వారా ఆర్డర్ చేసేవారికి ప్యాకింగ్, డెలివరీ ఛార్జీలు అదనంగా తోడవడంతో బిల్లు మరింత పెరుగుతోంది.

అయితే, ఈ ధరల పెంపునకు ముడిసరుకుల ధరల పెరుగుదలే ప్రధాన కారణమని హోటల్ యజమానులు చెబుతున్నారు. గత ఆరు నుంచి ఎనిమిది నెలలుగా ముడిసరుకుల ధరలు 15 నుంచి 20 శాతం వరకు పెరిగాయని వివరిస్తున్నారు. బిర్యానీ తయారీలో ఉపయోగించే నాణ్యమైన నెయ్యి ధర హోల్‌సేల్ మార్కెట్‌లో కిలో రూ.580 నుంచి రూ.800 దాటిందని పేర్కొంటున్నారు. పెరుగు, చీజ్ వంటి పాల ఉత్పత్తుల ధరలు కూడా 20 శాతం వరకు పెరిగాయని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల..పూర్తి షెడ్యూల్ ఇదే.!

వీటికి తోడు నిర్వహణ ఖర్చులు కూడా హోటల్ యాజమాన్యాలకు భారంగా మారాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర గతంలో రూ.1,750 ఉండగా, ప్రస్తుతం రూ.3,080కి చేరిందని నిర్వాహకులు చెబుతున్నారు. వంట నూనె లీటరు ధర రూ.150కి చేరగా, నాణ్యమైన బియ్యం కిలో రూ.100కు చేరువైందని పేర్కొంటున్నారు. 

చికెన్, కూరగాయల ధరలు కూడా అధికంగానే ఉండటంతో హోటళ్ల నిర్వహణ వ్యయం గణనీయంగా పెరిగిందని వివరిస్తున్నారు. ముడిసరుకుల నుంచి వంట గ్యాస్ వరకు అన్నింటి ధరలు పెరగడంతో నాణ్యతలో రాజీ పడకుండా హోటళ్లు నిర్వహించడం కష్టంగా మారిందని యజమానులు అంటున్నారు. ఈ కారణంగానే తప్పనిసరి పరిస్థితుల్లో ధరలు పెంచాల్సి వచ్చిందని స్పష్టం చేస్తున్నారు.

లాభాలు పోయి.. నష్టాలు వస్తున్నాయి: కంచర్ల అశోక్ రెడ్డి.!

నగరంలో హోటల్ వ్యాపారం ప్రస్తుతం తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోందని తెలంగాణ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కంచర్ల అశోక్ రెడ్డి తెలిపారు. గతంలో వచ్చిన లాభాలు పోయి.. ఇప్పుడు నష్టాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముడిసరుకుల ధరలు విపరీతంగా పెరగడంతో కొన్ని హోటళ్లు ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని వివరించారు.

ధరలు పెంచితే కస్టమర్లు దూరమవుతారనే ఆందోళన ఉన్నప్పటికీ, ధరలు పెంచకుండా హోటళ్లు నిర్వహించడం సాధ్యం కాని పరిస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు.మొత్తంగా ఒకప్పుడు సామాన్యుడికి సైతం అందుబాటులో ఉన్న బిర్యానీ ఇప్పుడు క్రమంగా ఖరీదైన వంటకంగా మారుతోంది. ముడిసరుకుల ధరలు తగ్గకపోతే భవిష్యత్తులో హోటల్ భోజనం మరింత భారంగా మారే అవకాశముందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మీకు నచ్చవచ్చు: ప్రేమించింది..చంపేయాలనుకుంది..ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి మాస్టర్ ప్లాన్.!

మీకు నచ్చవచ్చు: స్నేహితులతో సరదాగా బయటకు వెళ్లిన ఇండిగో మహిళా ఉద్యోగిని దారుణ హత్య.!

 

 

[ Hyderabad Biryani Prices hike , Biryani Price Hike, Hyderabad Restaurants, Telangana Food Prices, Hotel Association ]
 

By
en-us Political News

  
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
బంగారం ప్రియులకు ఇది నిజంగానే ఊరటనిచ్చే శుభవార్త అని చెప్పవచ్చు
తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
హానీట్రాప్ ఉచ్చులో పడిన వాయుసేన అధికారి.. షాకింగ్ నిజాలు వెల్లడించిన ఛార్జ్‌షీట్.!
మినీ బస్‌ను ఢీకొన్న ట్రక్కు.. 23 మంది మృతి.!
రాష్ట్రంలో 25 పారిశ్రామిక ఎకోసిస్టమ్ లను అభివృద్ధి చేస్తాం: లోకేష్
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.