ఆదివారమా... విధ్వంస వారమా?
Publish Date:Jun 19, 2022
Advertisement
ఏపీలో ప్రభుత్వ అరాచకం పరాకాష్టకు చేరుకుంది. రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యల విషయంలో హద్దులు చెరిపేసి చెలరేగిపోతోంది. ప్రభుత్వ విధానాలను విమర్శించినా, ప్రజా సమస్యలపై గళమెత్తినా ఖబడ్డార్ అంటూ ఇళ్లపైకి బుల్ డోజర్ పంపించే విధానానికి తెరతీసింది. కేసులకు భయపడటం లేదని భావించిందో ఏమో ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా విపక్ష నేతల నివాసాల కూల్చివేతలకు తెగబడుతోంది. రాజకీయ ప్రత్యర్థుల నివాసాలను బుల్ డోజర్లతో కూల్చివేయడానికి సిద్ధ పడుతోంది. తెలుగుదేశం సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడి నివాసంపైకి అధికారులు తెల్లవారు జామున బుల్ డోజర్ తో వచ్చి ఆయన ఇంటి కాంపౌండ్ వాల్ ను కూల్చేశారు. రెండు సెంట్ల ప్రభుత్వ భూమిని ఆక్రమించి నివాసాన్ని నిర్మించుకున్నారన్న ఆరోపణలతో అధికారులు ఈ చర్యకు పాల్పడ్డారు. నోటీసులు ఎప్పుడో ఇచ్చిమని చెబుతున్నారు. అయితే అయ్యన్న పాత్రుడి కుమారులు మాత్రం నోటీసులు అందలేదనీ, కూల్చివేత అనంతరం తాము నోటీసులేవి అని అడిగితే పాత తేదీతో నోటీసును తీసుకువచ్చి గోడకు అంటించారనీ చెబుతున్నారు. అలాగే ఆక్రమణ విషయంలో కూడా అధికారులు చెబుతున్న మాటలలో తడబాటు కనిపిస్తోంది. 0.2 సెంట్లని ఒకసారి, రెండు సెంట్లు అని ఒకసారి చెబుతున్నారు. అసలు ఆక్రమణ ఎంత, ఎప్పుడు ఆక్రమించారు. ఆక్రమణకు సంబంధించి సర్వే ఎప్పుడు చేశారు వంటి వివరాలు అడిగినా కూడా అధికారులు చెప్పడం లేదు. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు దాగున్న ఇంటిని భద్రతా దళాలు చుట్టుముట్టిన రీతిలో నర్సీపట్నంలోని అయ్యన్ప పాత్రుడి ఇంటిని అధికారులు, పోలీసులు అలా చుట్టుముట్టారు. ఇంటి కూల్చివేత సంగతి తెలియగానే పెద్ద ఎత్తున తెలుగుదేశం శ్రేణులు అయ్యన్ప పాత్రుడి నివాసానికి చేరుకున్నాయి. అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగాయి. అక్కడే టెంట్ వేసి ఆందోళన చేపట్టారు. తెలుగుదేశం అధినేత సహా పలువురు తెలుగుదేశం నాయకులు ప్రభుత్వ చర్యన ఖండించారు. రాష్ట్రం కోసం, రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం కోసం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ను పోలవారంగా మార్చి ప్రతి వారం సందర్శించి పనులను పరుగులు పెట్టిస్తే.. జగన్ అందుకు భిన్నంగా ఆదివారం విధ్వంస వారంగా మార్చి విపక్ష నాయకుల ఇళ్ల ధ్వంసానికి పాల్పడుతున్నారని తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ, ప్రజా సమస్యలపై పోరాడుతున్న అయ్యన్ప పాత్రుడిపై జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. గూండా రాజుగా ఏపీ సీఎం జగన్ చరిత్రలో నిలిచిపోతారని, జగన్ పాలనలో ఆగడాలు, అకృత్యాలు కోకొల్లలుగా జరుగుతూ పోలీసుల అతిప్రవర్తనకు అదుపు లేకుండా పోయింది. నేరస్థుడు రాజ్యం ఏలితే ఎన్ని అనర్ధాలు చోటు చేసుకొంటాయో, అరాచక శక్తుల అరాచకాలు ఏ స్థాయిలో ఉంటాయో ఆర్ధిక వ్యవస్థ ఏ విధంగా నాశనమవుతుందో తెలియడానికి జగన్ మూడేళ్ల పాలనే ఉదాహరణ అని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. జగన్ యూపీలోని యోగి ని ఆదర్శంగా తీసుకుని బల్ డోజింగ్ విధానాన్ని ఏపీకి తీసుకు వచ్చారని తెలుగుదేశం శ్రేణులు విమర్శిస్తున్నాయి. ఆదివారం తెల్లవారు జామున ఏదో శత్రుదేశం మీదకు యుద్ధానికి వెళుతున్న రీతిలో పోలీసు బలగాలను మోహరించి.. నివాసం కూల్చివేతకు ఉపక్రమించారని తెలుగుదేశం శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఇక రాజకీయ పరిశీలకులు కూడా ఈ కూల్చివేతను ఖండిస్తున్నారు. నిజంగా ఆక్రమణ ఉంటే అనుసరించాల్సిన పద్ధతి ఇది కాదని అంటున్నారు. ఇవ్వని నోటీసులను పాత తేదీలతో సృష్టించి మరీ కూల్చివేతలకు పాల్పడటం అంటే ప్రభుత్వ అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో జరిగిందో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు. చట్ట విరుద్ధంగా, ఇష్టారీతిన కూల్చివేతలకు పాల్పడడానికి వీల్లేదని సుప్రీం కోర్టు విస్పష్ట ఆదేశాలు ఉన్నా, జగన్ ప్రభుత్వం ఖాతరు చేయకుండా రాజకీయ ప్రత్యర్థులకు చెందిన నివాసాలు, భవనాల కూల్చివేతకు పాల్పడుతోందని అంటున్నారు. నర్సీ పట్నంలోని అయ్యన్న పాత్రుడి నివాసంపైకి బుల్ డోజర్ తో వచ్చిన అధికారులు ఇంటి వెనుక వైపు ప్రహారీ గోడను కూల్చివేశారు. అయ్యన్న పాత్రుడి కుటుంబ సభ్యులు అడ్డుకోవడం, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం శ్రేణులు అక్కడికి చేరుకున్నారు. ఇదంతా చూసి బుల్ డోజర్ డ్రైవర్ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. మరో డ్రైవర్ కోసం ప్రయత్నించినా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో అధికారులు చేసేదేమీ లేక మిన్నకున్నారు. అయితే తెలుగుదేశం శ్రేణులు అక్కడ నుంచి కదల లేదు. కూల్చివేతకు నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అదికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అధికారులు దిగి వచ్చి ఇంటి సర్వేకు అంగీకరించారు. దీన్ని బట్టే అర్థమౌతోంది సరైన సర్వే జరపకుండానే అధికారులు ఆక్రమణ జరిగిందంటూ కూల్చివేతకు తయారైపోయారనీ, ఇందుకు ప్రభుత్వంలో పై స్థాయి నుంచి వచ్చిన ఆదేశాలే కారణమని.
http://www.teluguone.com/news/content/tdp-leader-ayyanna-patrudu--house-wall-demolished-by-government-officers-25-137991.html