అజాంఖాన్ మేకలను దొంగిలించారా?
Publish Date:Jun 19, 2022
Advertisement
పాలన ఎప్పుడూ జనరంజకంగా వుండాలి. ప్రభుత్వ పథకాలు, లక్ష్యాలూ ప్రజాసంక్షేమాన్ని ఆశించాలి గాని ప్రజల నుంచే తీవ్ర వ్యతిరేకత వస్తున్నపుడు మంచి పాలనను అందిస్తున్నామని ప్రభుత్వాలు ప్రచారం చేయించుకోవడం నవ్వులపాలే అవుతుంది. కేంద్రంలో బిజెపి ప్రభుత్వ గ్రాఫ్ ఇప్పటికే ప్రజల దృష్టిలో పడిపోతోంది. అయినా అగ్నిపథ్ వంటి దుర్మార్గపు ఆలోచనలతో యువ తను దెబ్బతీయడం కేవలం మూర్ఖపు పాలనే అవుతుంది. అసలు బిజెపీ పాలిత రాష్ట్రాల్లో ఇలానే ప్రజావ్యతిరేకత వెల్లువెత్తే పరిస్థి తులే వున్నాయి. తనను ప్రశ్నించినవారిని ఏదోరకంగా జైల్లో పడేయాలన్న ఆలోచనతోనే ఎస్‌పి నాయకుడు అజామ్‌ను అర్ధంలేని మేకల దొంగ తనం కేసులో కటకటాల్లోకి నెట్టించారు. ఇలాంటివి విన్నపుడు ముందు నవ్వే వస్తుంది. ఇలాటి నిర్ణయాలు తీసుకునే వారికి అసలు ప్రభుత్వం నడిపే హక్కు ఎలా వుంటుంది. మేకలు దొంగతనం చేశారని ఆరోపించి శిక్షించాలనుకున్న నేతలకు మరి వారి పార్టీ కేంద్రంలో తీసుకున్న ఒక అనాలోచిత నిర్ణయానికి దేశం అట్టుడికిపోతున్నపుడు అధికార పీఠాన్ని ఎలా అంటి పెట్టుకుని వుండాలనుకుంటున్నారు? పైగా తమ నిర్ణయాన్ని సమర్ధించుకుంటూ అన్ని రాష్ట్రాల్లో బిజెపి నేతలు, అభిమానులు ప్రధాని మోదీ నిర్ణయం ఎంతో గొప్పదని అంగీకరించదగ్గదిగా ప్రచారం చేయడంలో సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నారు. అసలు ఇంతవరకూ ఏ పెద్ద నిర్ణయాన్ని సక్రమంగా తీసుకోలేదు, అమలు చేయలేక ప్రజల్ని ఇబ్బందులో్లకి నెట్టేయడం పాలన అనిపించుకుంటుందా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ మాత్రమే కాదు బిజెపీ పాలన లేని రాష్ట్రాల మీద కేంద్రం దృష్టి మరోలా వుంది. ఏదో ఒక మిషతో రాష్టంలో గందరగోళం సృష్టించి ఆనందించాలి. అందుకు ఆయా రాష్ట్రాల బిజెపీ నేతలు, వీరాభిమానులు వత్తాసు పలకడం మోదీ ధోరణికి అద్దం పడుతుంది. వారికి ఐక్యతలో అనైక్యతా రాగమే నచ్చతోంది. అలానే వుండాలని కోరుకుంటున్నారు. ప్రతిపక్షాలు ఏవీ సవ్యంగా కలవడానికి వీలులేకుండా చేస్తున్నారు. అందరూ కలిస్తే పీఠం కదులు తుందని భయం పట్టుకుంది. అందుకే వీలు చిక్కినపుడల్లా ఇలాంటి మేక, గొర్రె దొంగతనాలను కూడా రాజ్య వ్యతిరేక కార్య క్రమాలుగా పెద్ద బూతద్దంలో చూపించి హింసకు గురిచేయడం పరిపాటిగా మారింది. ప్రజలు నవ్వుకుంటున్నారు, విసిగెత్తారు అన్నది మోదీ ప్రభృతులకు ఎవరయినా గట్టిగా వినపడేట్టు చెప్పగలిగితే బావుణ్ణు!
ఉత్తరప్రదేశ్ లో ఎంతో నిరంకుశ పాలన నడుస్తోందని సీనియర్ సమాజ్‌వాది పార్టీ నాయకుడు అజామ్ ఖాన్ ఆరోపించేరు. ఎంత అన్యాయమంటే, అజామ్ ఆయన కుటుంబ సభ్యుల మీద దొంగతనం నేరం అంటగట్టడం! అజామ్ కుటుంబం మేకలు దొంగ తనం చేసిందని వారి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా అక్కడి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కారణమేమంటే, బిజెపి నాయకత్వంలోని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన అగ్నిపథ్ పథకం పట్ల దేశమంతటా నిరసన వెల్లువెత్తుతోంటే దాని వల్ల యువతకు ఎంతో ప్రయోజనం వుందని ప్రచారం ఘనంగా చేస్తున్నారు. అసలు దేశంలో ఇంతటి దారుణ పరిస్థితుల కంటే నియంతృత్వ పాలనే చాలా మెరుగు అన్నారు. మేకలు, కోళ్లు దొంగతనం, లిక్కర్ దుకాణాలను దోచుకోవడం వంటి ఆరోపణలు వేసి తనను జైలు పాలు చేసారు కానీ కేంద్ర ప్రభుత్వం యువత భవిష్యత్తును అగ్నిపథ్ పథకం ద్వారా దోచుకోవడం లేదా అని ఆయన అను చరులు ప్రశ్నిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/is-azam-khan-goats-thief-25-137987.html