nritdp.com ..ఎన్నారైల కోసం టీడీపీ ప్రత్యేక వెబ్‌సైట్..
Publish Date:Apr 15, 2022
Advertisement
టీడీపీ. తెలుగువాళ్లందరి పార్టీ. ప్రపంచ వ్యాప్తంగా టీడీపీకి అభిమానులు, కార్యకర్తలు ఉన్నారు. పార్టీకి సంబంధించిన ప్రతీ ఈవెంట్.. విదేశాల్లోనూ ఘనంగా జరుగుతుంటుంది. ఎప్పటికప్పుడు సమావేశాలు, పార్టీ కార్యక్రమాలు, ర్యాలీలతో పసుపు జెండా ఖండాంతరాల్లోనూ రెపరెపలాడుతుంటుంది. దటీజ్ తెలుగుదేశం. దటీజ్ చంద్రబాబు. లేటెస్ట్‌గా.. వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగుదేశం పార్టీ అభిమానులను, వారు ఏర్పాటు చేసుకున్న సంస్థలను ఒకే వేదిక మీదకు తీసుకు వచ్చేందుకు ఎన్.ఆర్.ఐ టీడీపీ విభాగాన్ని ఏర్పాటు చేసింది టీడీపీ. ఇందుకోసం ప్రత్యేక వెబ్ సైట్ www.nritdp.com ను టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు లాంచనంగా ప్రారంభించారు. ఈ వెబ్ సైట్ ద్వారా ఎన్.ఆర్.ఐ నుంచి పార్టీ సభ్యత్వ నమోదును చేపట్టనున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1200 మంది కౌన్సిల్ మెంబర్స్ ని ఏర్పాటు చేయటంతో పాటు టీడీపీ కేంద్ర కార్యాలయంలో 24 గంటలు అందుబాటులో ఉండేలా హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. ల్యాండ్ లైన్ +918645350888, వాట్సాప్ +918950674837 నెంబర్లను అందుబాటులో ఉంచారు. టీడీపీ కార్యకర్తల పిల్లలు విదేశాల్లో చదువుకునేందుకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వటంతో పాటు.. ఏపీలో ఐటి, టెక్నికల్ వంటి పలు ఉద్యోగ, ఉపాధి శిక్షణా కార్యక్రమాలు ఈ విభాగం నిర్వహించనుంది. విదేశాల్లో ఉన్న తెలుగు వారికి ప్రోసిజరల్ గైడ్ లైన్స్ ఇవ్వటం, ఆపద సమయంలో సాయం అందించేందుకు ఈ ఎన్.ఆర్.ఐ టిడిపి సెల్ పని చేస్తుంది. ఈ సందర్బంగా పార్టీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ.. యుద్ద సమయంలో ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను స్వదేశానికి తరలించటంలో NRI టిడిపి సెల్ చేసిన సేవలను ప్రశంసించారు. వివిధ దేశాల్లో టీడీపీ 40 వసంతాల వేడుకలు ఘనంగా నిర్వహించారని కొనియాడారు. విదేశాల్లో స్థిరపడిన టీడీపీ అభిమానులంతా ఈ వైబ్ సైట్ లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డా. వేమూరి రవి, రాజశేఖర్ చప్పిడి తో పాటు.. పార్టీ అమెరికా కోఆర్డినేటర్ కోమటి జయరాం పాల్గొన్నారు.
http://www.teluguone.com/news/content/tdp-launched-special-web-site-for-nri-39-134445.html





