ఉద్యోగాలు ఇవ్వం.. మాంసం అమ్మండి! జగనన్న కొత్త స్కీమ్ ఇదేనా..

Publish Date:Sep 12, 2021

Advertisement

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాంసం దుకాణాల ఏర్పాటు ప్రతిపాదన వివాదాస్పమవుతోంది. జగన్ రెడ్డి సర్కార్ నిర్ణయంపై విపక్షాలు మండిపడుతున్నాయి. పిచ్చి తుగ్లక్ లా నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మాంసం దుకాణాల కాన్సెప్ట్ పై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. జగనన్న మటన్ షాపులంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు.  ఉపాధ్యాయులతో మద్యం అమ్మించిన సీఎం జగన్మోహన్ రెడ్డి, తాజాగా నిరుద్యోగులతో మాంసం అమ్మించబోతున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బుద్దా వెంకన్న విమర్శించారు. డిగ్రీలు, పీజీలు చదివిన వారికి, తగిన ఉద్యోగాలు ఇవ్వలేని అసమర్థ ముఖ్యమంత్రి.. చివరకు వారికి మాంసం కొట్లలో కొలువులివ్వడానికి సిద్ధమయ్యారని ఆరోపించారు. మాంసం, చేపలు, రొయ్యలు అమ్మే బడుగు, బలహీనవర్గాల కడుపు కొట్టడానికే ముఖ్యమంత్రి ఈ కొత్త పథకానికి శ్రీకారం చుట్టారని విమర్శించారు. గతంలో ఇసుక అమ్మకాల పేరుతో 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేశారని, ఇప్పుడు మాంసం విక్రయాల పేరుతో లక్షల మందికి తిండిలేకుండా చేయబోతున్నారన్నారు.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాంసం అమ్మడం మొదలెడితే, చెప్పిన ధరకే వినియోగదారుడు కొనాలని, లేకపోతే బెదిరించైనా మాంసాన్ని ప్రజలకు అంటగడతారని బుద్దా వెంకన్న అన్నారు. విజయసాయిరెడ్డి సలహాతోనే ముఖ్యమంత్రి మటన్ మార్టుల ఏర్పాటుకు సిద్ధమయ్యారనిపిస్తోందన్నారు. సీఎం, విజయసాయిరెడ్డిల ఆలోచనలన్నీ అంతిమంగా వారి ఖజానా నిండటానికే పనికొస్తాయి తప్ప, ప్రజలకు మేలుచేయవన్నారు. మాంసం అమ్మకాలు చేపట్టాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే బడుగు, బలహీనవర్గాల వారితో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతామని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు.

ఏపీ ప్రభుత్వం మొబైల్ మాంసం దుకాణాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఎక్కడైనా మటన్ అమ్ముకునే విధంగా వ్యాన్లను సిద్దం చేస్తుంది. ఇందులోనే మేకలను గొర్రెలను విక్రయిస్తారు. ఆరోగ్యకరమైన మేక, గొర్రె మాంసం, తలకాయ, కాళ్ళు, బోటీవి అందుబాటు ధరల్లో అందించేందుకు ప్రభుత్వం  ఏర్పాట్లు చేస్తుంది. ఏపీ మీట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో యూనిట్‌ రూ.10 లక్షల అంచనా వ్యయంతో తొలిదశలో మహానగరాలు, నగరాలు, పట్టణ ప్రాంతాల్లో 112 యూనిట్లు ఏర్పాటు కానున్నాయి. అయితే ప్రభుత్వ నిర్ణయంలో వేలాది మంది మటన్ విక్రేతలు రోడ్డున పడే అవకాశం ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఉపాధి ఎలాగూ కల్పించలేకపోతున్నాం.. ఏదో ఉపాధి చూసుకుంటూ జివిస్తున్న కుటుంబాల పొట్ట కొట్టడం ఎందుకనే వాదన వస్తోంది. 

By
en-us Political News

  
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.