ఏపీలో కూటమి సునామీ ఖాయం.. తేల్చేసిన వైబ్రెంట్ సర్వే

Publish Date:Mar 31, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం,  జనసేన, బీజేపీ కూటమి సునామీ సృష్టించడం ఖాయమని ఇప్పటికే పలు  సర్వేలు స్పష్టం చేశాయి. ఇప్పటికే జాతీయ స్థాయిలో పేరుపొందిన పలు  సంస్థల  సర్వేల్లో ఏపీలో కూటమి విజయం ఖాయమని తేలింది.   వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం జగన్ మోహన్ రెడ్డి అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలు, కక్షపూరిత రాజకీయాలు వైసీపీ ఓటమిలో కీలక భూమిక పోషించబోతున్నాయని సర్వే సంస్థలు పేర్కొన్నాయి. దీంతో వైసీపీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో తాజాగా మరో ప్రముఖ సంస్థ  వైబ్రెంట్ ఇండియా సర్వేలో కూటమి అలాంటిలాంటి విజయం కాదు.. భారీ విజయం ఖాయమని పేర్కొంది. స్పష్టంగా చెప్పాలంటే ఏపీలో తెలుగుదేశం కూటమి సునామీ సృష్టించబోతున్నదని వైబ్రెంట్ ఇండియా పేర్కొంది.

 వైబ్రెంట్ ఇండియా గతంలో 14 సార్లు ఎన్నికల సమయంలో ఆయా రాష్ట్రాల్లో సర్వేలు నిర్వహించింది. ఈ సంస్థ ఇచ్చిన సర్వే ఫలితాలు 12 సార్లు నిజమయ్యాయి. దీంతో వైబ్రెంట్ ఇండియా సర్వే ఫలితాలంటే చాలా రాజకీయ పార్టీలు  ఆవే తుది ఫలితాలుగా  భావిస్తుంటాయి. వైబ్రెంట్ ఇండియా సర్వే  వెలుగులోకి రాగానే వైసీపీ నేతల్లో ఆందోళన మరింత పెరిగిందని  రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా సొంత నియోజకవర్గాలను వదిలి వైసీపీ అధిష్టానం సూచన మేరకు కొత్త నియోజకవర్గాల్లో పోటీచేసేందుకు వెళ్లిన వైసీపీ అభ్యర్థులు తమ ఓటమి ఖాయమన్న భావనకు వచ్చినట్లు చెబుతున్నారు, అనవసరంగా నియోజకవర్గం మారామని తమకు దగ్గర వ్యక్తుల వద్ద చెప్పుకొని బాధపడుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది.

వైబ్రెంట్ ఇండియా ఫిబ్రవరి 22 నుంచి మార్చి 23వ తేదీ వరకు సర్వే నిర్వహించింది. ఈ సర్వే కోసం 50,236 మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఫోన్ కాల్స్ ద్వారా  మరో 50వేల మంది అభిప్రాయాలు సేకరించింది. వైబ్రెంట్ ఇండియా సర్వే ఫలితాల ప్రకారం.. టీడీపీ, జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులు 79 నియోజకవర్గాల్లో కచ్చితంగా విజయం సాధిస్తారు. మరో 20 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఎడ్జ్ లో ఉన్నారు.  అంటే దాదాపు 99 సీట్లలో కూటమి అభ్యర్థులు విజయం పక్కా అని వైబ్రెంట్ సర్వే తేల్చేసింది. అధికార వైసీపీకి ఓటమి ఖాయమని, ఆ పార్టీ 29 సీట్లకే పరిమితమవుతుందని, ప్రజల్లో పోలింగ్ సమయం నాటికి ఏమైనా సానుభూతి, ఇతర అంశాలను ప్రభావితం చేస్తే మరో 18 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉందని వైబ్రెంట్ సర్వే పేర్కొంది.  మరో 29 నియోజకవర్గాల్లో కూటమి, వైసీపీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని,   వైబ్రెంట్ ఇండియా సర్వే  పేర్కొంది. పూర్తి ఫలితాలను పరిశీలిస్తే తెలుగుదేశం కూటమి 115 - 120 స్థానాలు,  వైసీపీ 55 - 60 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని పేర్కొంది. పార్టీల వారిగా ఓటింగ్ శాశం పరిశీలిస్తే.. తెలుగుదేశం కూటమికి 42.26శాతం, వైసీపీకి 38.11శాతం ఓటింగ్ నమోదవుతుంది. 13.47శాతం ఓటింగ్ మాత్రం కూటమి, వైసీపీ అభ్యర్థుల్లో ఎవరికైనా పడే అవకాశం ఉందని, ఇతరులకు 6.16శాతం ఓటింగ్ నమోదవుతుందని వైబ్రెంట్ ఇండియా సర్వే పేర్కొంది. 

వైబ్రెంట్ ఇండియా గతంలో నిర్వహించిన కొన్ని సర్వే ఫలితాలను పరిశీలిస్తే..

 తెలంగాణలో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైబ్రెంట్ ఇండియా సర్వే నిర్వహించింది. సర్వే ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీకి 72-78 స్థానాలు వస్తాయని తేలింది. ఎన్నికల ఫలితాల్లో 88 సీట్లలో  టీఆర్ఎస్ విజయం సాధించి రెండోసారి అధికారంలోకి వచ్చింది.
 2023  అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 67 - 75 స్థానాలు వస్తాయని వైబ్రెంట్ ఇండియా సర్వే పేర్కొంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 64 స్థానాలు వచ్చాయి. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

 కర్ణాటకలో 2023  అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 118-130  స్థానాలు వస్తాయని వైబ్రెంట్ ఇండియా సర్వే పేర్కొంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 135 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
 2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ వైబ్రెంట్ ఇండియా సర్వే నిర్వహించింది. సర్వే ఫలితాల్లో డీఎంకే 167 - 178 నియోజకవర్గాల్లో విజయం సాధిస్తుందని తెలిపింది. ఆ ఎన్నికల ఫలితాల్లో డీఎంకే 159 నియోజకవర్గాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.  2019లో ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ వైబ్రెంట్ ఇండియా  సర్వేలో వైసీపీకి 129 -139 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఫలితాల్లో వైసీపీకి 151 స్థానాలు వచ్చాయి.

వైబ్రెంట్ ఇండియా  తాజా సర్వే ప్రకారం.. రాయలసీమలోని చిత్తూరు, కడప, ఉమ్మడి విజయనగరం  జిల్లాల్లో వైసీపీకి మెజార్టీ స్థానాలు వస్తాయని, శ్రీకాకుళం, విశాఖపట్టణం, తుర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, కర్నూల్    జిల్లాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు అత్యధిక నియోజకవర్గాల్లో విజయం సాధిస్తారని పేర్కొంది.  వైబ్రెంట్ ఇండియా సర్వే ఫలితాలు గతంలో 90శాతం నిజం కావటం, ఆ సర్వే ఈసారి వైసీపీ ఓటమి ఖాయమని స్పష్టం చేయడంతో వైసీపీ అభ్యర్థులను ఓటమి భయం వెంటాడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

By
en-us Political News

  
అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పరిధిలో దాదాపు రూ. 7.5 కోట్ల విరాళాల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలపై పార్లమెంట్‌ ద్వారం వద్ద స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ కాషాయ వస్త్రాలు ధరించి, పూజారి వేషంలో ఒక పెద్ద హుండీతో కూర్చుని సేకరించిన విరాళాలను జేబులో వేసుకుంటూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.
నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే విశాఖను గ్లోబల్ ఐటీ, ఇండస్ట్రియల్ హబ్‌గా మార్చాలనే ఆలోచనతో ఈ భోగాపురం ప్రాజెక్టుకు చంద్రబాబు బీజం వేశారనీ, అయితే.. కాలక్రమంలో ప్రభుత్వాలు మారాయి, ప్రాజెక్టు ప్రతిపాదనలు మడతపడ్డాయన్నారు.
సిదిరి అప్పలరాజు కుమారుడు బైక్ నిర్లక్ష్యంగా నడిపి ఒకరి మృతికి కారణమయ్యారన్న కేసు దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల మేరకు ఇందులో ఎలాంటి రాజకీయ కుట్రలు లేవు. సీదిరి అప్పలరాజు చేసిన అతే.. ఆయనను చట్టపరంగా ఇబ్బందుల్లోకి నెట్టింది.
ఎప్పుడో ఓ సారి జైల్లో ఉన్న నేతకు పరామర్శ పేరుతో బయటకు వచ్చే సందర్భాలలో కూడా సదరు నేతను పరామర్శించడం కంటే.. బల ప్రదర్శనకు, తనకు జనం మద్దతు ఉందని నిరూపించుకునే ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన అలా బయటకు వచ్చిన ప్రతి సారీ అభాసుపాలౌతూనే ఉన్నారు.
ఢిల్లీ వీధుల్లో రగిలిన ఆగ్రహ జ్వాలలు, పోలీసుల లాఠీఛార్జీలు, కన్నీటి ధారలు, నిర్బంధాలను సైతం లెక్కచేయక హక్కుల కోసం వీధిపోరాటానికి దిగిన యువత ఆక్రందనలు
రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అమూల్యమైన భూములను ఇవ్వద్దు, భోగాపురం విమానాశ్రయాన్ని అందరం కలిసి అడ్డుకుందాం" అంటూ జగన్ ఇచ్చిన పిలుపుల ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతూ భోగాపురం విషయంలో జగన్ ద్వంద్వ వైఖరిని ఎండగడుతున్నాయి.
తెలుగుదేశం కూమిటికి ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. చంద్రబాబు నాయకత్వంలో కూటమి సర్కార్ సంక్షేమ, అభివృద్ధిని సమాంతరంగా పరుగులు పెట్టిస్తున్నప్పటికీ ఆ స్థాయిలో ప్రజాదరణ పెరగడం అటుంచి.. క్షేత్రస్థాయిలో కూటమి పాలన పట్ల ఒకింత అసంతృప్తి పె రిగిందని సర్వే స్పష్టం చేయడమే.
మొత్తంగా విద్యార్థులు, యువతఉద్యమం.. ఒక స్పష్టమైన సందేశాన్ని అయితేనిస్సందేహంగా ఇచ్చింది. అన్యాయాన్ని ప్రశ్నించడంలో, హక్కుల కోసం పోరాడటంలో , న్యాయం కోసం నినదించడంలో వెనకడుగు వేసే ప్రశ్నేలేదని చాటింది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కర్నూలు జిల్లా ఆదోని పట్టణ, మండల టీడీపీ నేతలు పని చేయాలని
నీట్ పేపర్ లీక్ ఆందోళనలతో దిల్లీ వీధులను ఊపేసిన బొద్దింకలు ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద రైతు నాయకుడు రాకేష్ తికాయత్‌ను కలిసి సంఘీభావం ప్రకటించాయి.
మాజీ మంత్రి జోగి రమేష్ తనపై చేస్తున్న ఆరోపణలనుఖండించిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్.. జోగి రమేష్ కు ఎటువంటి క్రెడిబులిటీ లేదనీ, అతను ఏదోదో మాట్లాడతారనీ, అవన్నీ పట్టించుకోవలసిన అవసరం లేదని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పరిపాలన వ్యవహారాల్లో తీరిక లేకుండా ఉండటంతో, ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పం సమగ్ర అభివృద్ధి బాధ్యతలను భువనేశ్వరి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గత రెండేళ్లుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నప్పటికీ, ఇప్పటి వరకూ భువనేశ్వరి రాజకీయాలు మాట్లాడిన సందర్భం లేదు.
ఉమా తీరు ప్రభుత్వాన్నీ, తెలుగుదేశం పార్టీనీ గతంలో కూడా ఒకటి రెండు సార్లు ఇబ్బందుల్లోకి నెట్టిందని వక్రమ్ పోలా అన్నారు. పార్టీ వేదికలలో మాట్లాడాల్సిన విషయాలను బాహాటంగా మాట్లాడటం బోండా ఉమాకు రివాజుగా మారినట్లు కనిపిస్తోందన్నారు. మంత్రి పదవి ఆశించి భంగపడటం వల్లే ఉమా ఇలా వ్యవహరిస్తున్నారనుకున్నా.. ఆయన తన అసంతృప్తిని పార్టీ వేదికపై లేవనెత్తాలి కానీ.. బహిరంగ వేదికలపై కాదని విక్రమ్ పోలా అన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.