పింఛన్ల పంపిణీకి వాలంటీర్లు దూరం.. ఎన్నికల సంఘం అదేశాలతో వైసీపీ ఆటకట్టేనా?

Publish Date:Mar 31, 2024

Advertisement

జగన్ చేత జగన్ కొరను జగనే ఏర్పాటు చేసుకున్న వాలంటీర్ల వ్యవస్థ సేవలు ఇప్పుడు జగన్ కు అందకుండా పోతున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన ఇన్ని రోజులకు  ఎన్నికల సంఘం వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచాలన్న ఆదేశాలివ్వడమే కాకుండా వారి ఫోన్లలో ఉన్న సిమ్ కార్డులను కూడా స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది.  పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలపై   వైసీపీ నేతలు తెలుగుదేశంపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. వాలంటీర్లపై ఫిర్యాదు చేసి సామాజిక పింఛన్ల పంపిణీని తెలుగుదేశం అడ్డుకుంటోందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.  వాలంటీర్లకు పింఛన్ల పంపిణీ బాధ్యతలు వద్దని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిందే కానీ పింఛన్ల పంపిణీని ఆపమని కాదు. కానీ అ నెపం పెట్టుకుని పింఛన్లను ఆపేయడానికి జగన్ సర్కార్ కుట్రపన్నుతున్నట్లుగా వారి మాటలను బట్టి అవగతమౌతోంది.  

ప్రభుత్వం ఇస్తున్న సామాజిక పించన్లు ఇకపై వాలంటీర్ల ద్వారా కాకుండా, ఉద్యోగులే పంపిణీ చేయాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలతో వైసీపీకి కాళ్ల కింద భూమి కదిలిపోయినట్లైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే  వారు నానా యాగీ చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటివరకూ వాలంటీర్లే పించనర్లకు డబ్బులు నేరుగా ఇచ్చేవారు.  ఎన్నికల కోడ్ లేదు కాబట్టి  అది సాగింది. కానీ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తరువాత  నిబంధనల ప్రకారమే జరగాలి. అలా జరిగేలా చూసే బాధ్యత  ఎన్నికల సంఘానిది.  రాష్ట్రంలో కోడ్ ఉల్లంఘనలపై ఫిర్యాదులు వెల్లువెత్తున్న నేపథ్యంలో కేందా్ర ఎన్నికల సంఘం  ఢిల్లీ నుంచి ముగ్గురు పరిశీలకులను కూడా రాష్ట్రానికి పంపింది. సరే అదలా ఉంచితే.. వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు.  ఈ విషయాన్ని  హైకోర్టు స్పష్టంగా చెప్పింది. దీనికి తోడు  వాలంటీర్లంతా వైసీపీ వాళ్లేనని పలు సందర్బాలలో మంత్రులే చెప్పారి. వారి సేవలను ఎన్నికలలో వాడుకుంటామని ప్రకటనలు కూడా చేశారు. అంతెందుకు స్వయంగా ముఖ్యమంత్రి జగన్ కూడా ఇదే విషయాన్ని పలు సందర్భాలలో చెప్పారు.  వీటన్నిటినీ పరిగణనలోనికి తీసుకున్న ఎన్నికల సంఘం వలంటీర్లనూ ఎన్నికల సమయంలో పింఛన్ల పంపిణీకి దూరంగా ఉంచాలని ఆదేశించింది. అంతే కాకుండా వారి ఫోన్ల నుంచి సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకోమని చెప్పింది. వాలంటీర్ల స్థానంలో ప్రభుత్వ ఉద్యోగుల ద్వారానే పించన్లు పంపిణీ చేయాలని విస్పష్టంగా ఆదేశించింది.  ఇప్పుడు ఆ పని ప్రభుత్వోద్యోగులకు అప్పగించమని నిర్దేశించింది.  దీనిపై వైసీపీ ఇంతగా గగ్గోలు పెట్టడం ఎందుకో అర్ధం కావడం లేదు. సామాజిక పింఛన్లు అందకుండా తెలుగుదేశం కుట్రలు చేస్తోందన్న వైసీపీ విమర్శలు చూస్తుంటే.. పించన్లు పంపిణీ చేయకుండా, అందుకు కారణం తెలుగుదేశం అని ప్రచారం చేయడానికి వైసీపీ రెడీ అయిపోయిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయినా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సోమవారం నుంచి ప్రభుత్వోద్యోగుల ద్వారా పించన్ల పంపిణీ సక్రమంగా సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత సీఎస్ జవహర్ రెడ్డిదే. ఇప్పుడు ఆయన ఆపద్ధమర్మ ముఖ్యమంత్రి జగన్  ఆదేశాలకు తలొగ్గాల్సిన అవసరం లేదు.  

ఎలాగూ పెన్షన్లకు ఇవ్వాల్సిన డబ్బు ఖజానాలో  రెడీగా ఉంటే పంపిణీకి అడ్డేముంటుంది. అయితే వైసీపీ యాగీ వెనుక, గగ్గోలు వెనుక పింఛన్ల సొమ్ము ఖజానాలో లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విపక్షాలు ఆరోపిస్తున్నట్లు  ఆ సొమ్ములను వైసీపీ అనుకూల కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లుల పంపిణీకి వాడేశారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, మాజీ ఐఏఎస్ నిమ్మగడ్డ రమేష్ ఫిర్యాదు వల్లే వాలంటీర్ల సేవలు నిలిచిపోయాయని.. అధికార పార్టీ  చేస్తున్న విమర్శలు ఆ అనుమానాలను బలపరుస్తున్నాయి.   సీఈసీ పెన్షనర్లకు డబ్బులు ప్రభుత్వ సిబ్బంది ద్వారా ఇవ్వాలని ఆదేశించిందే తప్ప, అసలు పెన్షన్లు ఇవ్వవద్దని అనలేదు. ఎన్నికల కోడ్ కాబట్టి వాలంటీర్ల బదులు, ప్రభుత్వ సిబ్బందితో పెన్షన్ డబ్బులు అందచేయాలని చెప్పిందే తప్ప, సంక్షేమపథకాలు ఆపమనలేదు. కానీ వైసీపీ మాత్రం ఎన్నికల సంఘం  పింఛన్లు నిలిపివేయాలనీ, సంక్షేమ పథకాలు ఆపేయాలని ఆదేశించిందన్నట్లుగా మాట్లాడటం విస్తుగొలుపుతోంది. వైసీపీ బాధంతా   ప్రభుత్వ ఉద్యోగులు నేరుగా పెన్షన్లు ఇస్తున్నందుకా? లేక వాలంటీర్ల ద్వారా ఇవ్వనందుకా?  ఎవరిస్తే ఏమిటి?  సొమ్ము లబ్థిదారులకు అందడమేగా కావాల్సింది?   ఇప్పుడు వైసీపీ ఆరోపణలు, విమర్శలు చూస్తుంటే..  వాలంటీర్లద్వారా పింఛన్ల పంపిణీ జరిగితే.. ఆ డబ్బులు ఇస్తున్నది జగనే అని వారు ప్రచారం చేయడానికి అవకాశం ఉంటుంది. అదే ప్రభుత్వోద్యోగులైతే.. ఆ సొమ్ము పంపిణీకి జగన్ కు ఎటువంటి సంబంధం లేదని అందరికీ అర్ధమైపోతుంది. ఇదీ వైసీపీ బాధ.  

తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ  అనేక సంక్షేమ పథకాలు అమలు చేసింది. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలూ సంక్షేమ పథకాలను అమలు చేశాయి.  అయితే జగన్ సర్కార్ వచ్చే వరకూ సంక్షేమ పథకాల అమలు  ప్రభుత్వ సిబ్బంది ద్వారానే అమలయ్యాయి.  వైసీపీ సర్కార్ వచ్చిన తరువాత మాత్రమే వాలంటీర్ల చేతికి సొమ్ములిచ్చి పంపిణీ చేసింది. ఇప్పుడు అది కూడదనే సరికి.. పెన్షనర్లకు సొమ్ములెలా అందుతాయంటూ గగ్గోలు పెట్టేస్తోంది.  ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న పార్టీ కోడ్ ఉల్లంఘనలపై వచ్చిన ఫిర్యాదులపై ఎన్నికల సంఘం స్పందించడం సహజం. గత ఎన్నికల సమయంలో విపక్షంలో ఉన్న వైసీపీ ఫిర్యాదులపైనే పై అప్పటి  డీజీపీ, సీఎస్, ఏడీజీని ఈసీ ఎన్నికల విధులకు దూరంగా ఉంచింది. ఎల్వీని ఈసీనే నేరుగా సీఎస్‌గా నియమించింది. అప్పుడు ఒప్పైన ఎన్నికల సంఘం నిర్ణయం ఇప్పుడు వైసీపీకి ఎందుకు తప్పు అవుతోందన్నది ఆ పార్టీయే చెప్పాలి.  

By
en-us Political News

  
సిదిరి అప్పలరాజు కుమారుడు బైక్ నిర్లక్ష్యంగా నడిపి ఒకరి మృతికి కారణమయ్యారన్న కేసు దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల మేరకు ఇందులో ఎలాంటి రాజకీయ కుట్రలు లేవు. సీదిరి అప్పలరాజు చేసిన అతే.. ఆయనను చట్టపరంగా ఇబ్బందుల్లోకి నెట్టింది.
ఎప్పుడో ఓ సారి జైల్లో ఉన్న నేతకు పరామర్శ పేరుతో బయటకు వచ్చే సందర్భాలలో కూడా సదరు నేతను పరామర్శించడం కంటే.. బల ప్రదర్శనకు, తనకు జనం మద్దతు ఉందని నిరూపించుకునే ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన అలా బయటకు వచ్చిన ప్రతి సారీ అభాసుపాలౌతూనే ఉన్నారు.
ఢిల్లీ వీధుల్లో రగిలిన ఆగ్రహ జ్వాలలు, పోలీసుల లాఠీఛార్జీలు, కన్నీటి ధారలు, నిర్బంధాలను సైతం లెక్కచేయక హక్కుల కోసం వీధిపోరాటానికి దిగిన యువత ఆక్రందనలు
రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అమూల్యమైన భూములను ఇవ్వద్దు, భోగాపురం విమానాశ్రయాన్ని అందరం కలిసి అడ్డుకుందాం" అంటూ జగన్ ఇచ్చిన పిలుపుల ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతూ భోగాపురం విషయంలో జగన్ ద్వంద్వ వైఖరిని ఎండగడుతున్నాయి.
తెలుగుదేశం కూమిటికి ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. చంద్రబాబు నాయకత్వంలో కూటమి సర్కార్ సంక్షేమ, అభివృద్ధిని సమాంతరంగా పరుగులు పెట్టిస్తున్నప్పటికీ ఆ స్థాయిలో ప్రజాదరణ పెరగడం అటుంచి.. క్షేత్రస్థాయిలో కూటమి పాలన పట్ల ఒకింత అసంతృప్తి పె రిగిందని సర్వే స్పష్టం చేయడమే.
మొత్తంగా విద్యార్థులు, యువతఉద్యమం.. ఒక స్పష్టమైన సందేశాన్ని అయితేనిస్సందేహంగా ఇచ్చింది. అన్యాయాన్ని ప్రశ్నించడంలో, హక్కుల కోసం పోరాడటంలో , న్యాయం కోసం నినదించడంలో వెనకడుగు వేసే ప్రశ్నేలేదని చాటింది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కర్నూలు జిల్లా ఆదోని పట్టణ, మండల టీడీపీ నేతలు పని చేయాలని
నీట్ పేపర్ లీక్ ఆందోళనలతో దిల్లీ వీధులను ఊపేసిన బొద్దింకలు ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద రైతు నాయకుడు రాకేష్ తికాయత్‌ను కలిసి సంఘీభావం ప్రకటించాయి.
మాజీ మంత్రి జోగి రమేష్ తనపై చేస్తున్న ఆరోపణలనుఖండించిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్.. జోగి రమేష్ కు ఎటువంటి క్రెడిబులిటీ లేదనీ, అతను ఏదోదో మాట్లాడతారనీ, అవన్నీ పట్టించుకోవలసిన అవసరం లేదని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పరిపాలన వ్యవహారాల్లో తీరిక లేకుండా ఉండటంతో, ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పం సమగ్ర అభివృద్ధి బాధ్యతలను భువనేశ్వరి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గత రెండేళ్లుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నప్పటికీ, ఇప్పటి వరకూ భువనేశ్వరి రాజకీయాలు మాట్లాడిన సందర్భం లేదు.
ఉమా తీరు ప్రభుత్వాన్నీ, తెలుగుదేశం పార్టీనీ గతంలో కూడా ఒకటి రెండు సార్లు ఇబ్బందుల్లోకి నెట్టిందని వక్రమ్ పోలా అన్నారు. పార్టీ వేదికలలో మాట్లాడాల్సిన విషయాలను బాహాటంగా మాట్లాడటం బోండా ఉమాకు రివాజుగా మారినట్లు కనిపిస్తోందన్నారు. మంత్రి పదవి ఆశించి భంగపడటం వల్లే ఉమా ఇలా వ్యవహరిస్తున్నారనుకున్నా.. ఆయన తన అసంతృప్తిని పార్టీ వేదికపై లేవనెత్తాలి కానీ.. బహిరంగ వేదికలపై కాదని విక్రమ్ పోలా అన్నారు.
తాజాగా కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే యశ్‌పాల్ సువర్ణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని   యశ్‌పాల్ సువర్ణ చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.
బిజీ విద్యార్థులు మరియు ఉద్యోగినుల కోసం ఫ్రెష్ లుక్ బ్యూటీ క్లాసెస్ అందిస్తున్న వీకెండ్ బ్యూటీ కోర్సుల వివరాలు. శని, ఆదివారాల్లో మేకప్, స్కిన్‌కేర్ మరియు హెయిర్‌స్టైలింగ్ నేర్చుకుని ప్రొఫెషనల్ బ్యూటీషియన్‌గా మారే సువర్ణ అవకాశం!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.