Publish Date:Mar 29, 2024
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి మార్చి 29కి సరిగ్గా 42 ఏళ్లు. 1982లో ఇదే రోజున ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పేరును ప్రకటించారు. అప్పటి నుండి, టీడీపీ తెలుగు ప్రజలపై చెరగని ముద్ర వేసింది. అంతే కాదు జాతీయ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించింది. పార్టీ చరిత్రలో గత ఏడాది కాలం చాలా కీలకం. ఆంధ్రప్రదేశ్‌లో కక్ష పూరిత రాజకీయాలు పీక్స్ కు చేరడం చూశాం. జగన్ కక్ష పూరిత రాజకీయాల కారణంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా 50 రోజులకు పైగా జైలు జీవితం గడపాల్సి వచ్చింది. అందరూ ఇక తెలుగుదేశం పనై పోయిందన్న అనుకునే పరిస్థితులు ఆ ఐదేళ్ల కాలంలో ఏర్పడ్డాయి. అయితే తెలుగుదేశం మాత్రం అద్భుతంగా బౌన్స్ బ్యాక్ అయ్యింది. ప్రజల నమ్మకాన్ని గెలిచింది. వచ్చే ఎన్నికలలో అధికారం చేపట్టడమే తరువాయి అన్న స్థితికి చేరింది.
అయితే ఇలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొనడం, సంక్షోభాల నుంచి బయటపడటం ఆ పార్టీకి కొత్త కాదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అనేక సంక్షోభాలను ఎదుర్కొంది. అలా ఎదుర్కొన్న ప్రతి సారీ వాటిని అధిగమించి నిలబడింది. ప్రజామన్ననలు పొందింది. బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఓటమి తరువాత ఎంత దయనీయ పరిస్థితిలో ఉందో చూసిన తరువాత తెలుగుదేశం విశిష్ఠత, పటిష్ఠతపై తెలుగు రాష్ట్రాలలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
పదేళ్లు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 2023 అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత వంద రోజులలోనే ఆ పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందా అనిపించేలా దిగజారింది. పార్టీకి భవిష్యత్ లేదని ఆ పార్టీ సీనియర్ నేతలే బాహాటంగా చెబుతూ పక్క పార్టీలలోకి దూకేస్తున్న పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీని పటిష్టంగా ఉంచే విషయంలోనూ, పార్టీ నేతలలో, క్యాడర్ లో నమ్మకం కలిగించడంలోనూ ఆ పార్ట అధినేత కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారు. అధికారంలో ఉన్నంత కాలం పార్టీ నేతలకు కూడా అందుబాటులో లేకుండా, వారిపై తన ఏకపక్ష నిర్ణయాలను రుద్దిన కేసీఆర్కు ఓటమి తరువాత పార్టీ నేతలెవరూ అండగా నిలిచేందుకు ముందుకు రావడం లేదు. బీఆర్ఎస్ దయనీయ స్థితికి ఎంపీ టికెట్ పొందిన అభ్యర్థి కూడా పార్టీని వీడటాన్ని మించిన నిదర్శనం ఏముంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చంద్రబాబు నాయుడు పదిహేనేళ్లు ప్రతిపక్షంలో ఉన్నా పార్టీని విజయవంతంగా నడిపించగలిగారు. ఈ క్రమంలో వైఎస్ఆర్, కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డిల నిరంకుశ పాలనను ఎదుర్కొన్నారు. ఒక నాయకుడు ఎలా ఉండాలనడానికి ఉదాహరణగా చంద్రబాబు నిలిస్తే.. ఒక నాయకుడు ఎలా ఉండకూడదు అనడానికి ఉదాహరణగా కేసీఆర్ నిలుస్తారని పరిశీలకులు ఉదాహరణలతో సహా విశ్లేషిస్తున్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నిత్యం ప్రజలతో ఉండి వారి విశ్వసనీయతను పొందిన నేత చంద్రబాబు అయితే... అధికారంలో ఉండగా జనం నీడ కూడా తనమీద పడకుండా జాగ్రత్తలు తీసుకుని.. ఎన్నికల సమయంలో ప్రసంగాలకే పరిమితమైన నేత కేసీఆర్ అని చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tdp-42-years-journy-39-172918.html
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి. మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి. ఈ ఫలితాలు కేవలం ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి.
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
పీకే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి 1995 నుంచీ వరుసగా బీజేపీయే విజయం సాధిస్తూ వస్తోంది. నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా వరుసగా నాలుగు సార్లు విజయం సాధించగా, ఆ తరువాత ఇదే నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు.
పాలనాపరమైన కఠిన నిర్ణయాలే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక వృద్ధి కోసం విజయ్ ప్రభుత్వం వెట్రి తమిళగం విజన్ పేరుతో వియయ్ కార్యాచరణ ప్రకటించారు. ఈ విజన్ కింద 50 వేల కోట్ల రాష్ట్ర పెట్టుబడి నిధి ఏర్పాటుకు ప్రతిపాదించడమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ల రంగాలలో ప్రభుత్వం నేరుగా కో ఇన్వెస్టర్ గా భాగస్వామ్యం వహించేలా నిర్ణయించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ విషయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్నవన్నీ డ్రామాలేనని కేంద్ర మంత్రి పెమ్మసాని విమర్శించారు. 2015లోనే నాటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర మంత్రిఅశోక్ గజపతిరాజు చొరవతో భోగాపురం ఎయిర్‌పోర్టుకు రూపకల్పన చేసిందనీ, 2 వేల 200 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేసిందని స్పష్టం చేశారు.
గత తప్పిదాల కారణంగా వైసీపీ నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా కేసుల ఉచ్చుల్లో చిక్కుతున్నారు. ఇక తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుండటంతో వైసీపీ నేతలలో నిరాశ నిస్ఫృహలు అలుముకుంటున్నాయి.
భోగాపురం విషయంలో వైసీపీ అధినేత జగన్.. ఒకే సమయంలో క్రెడిట్ చోరీకీ, విమానాశ్రయం సాకారం కావడం పట్ల విమర్శలకు పాల్పడటం అపహాస్యం పాలౌతోంది.
దీంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ముఖ్యమంత్రి విజయ్ కావేరి వివాదంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కావేరి జలాలు తమిళనాడుకు అత్యంత కీలకమనీ, ఇతర రాష్ట్రాల వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఏకాభిప్రాయ సాధన అవసరమని అన్నారు.