తమిళనాట రాజుకున్న కావేరీ జలాల చిచ్చు.!

Publish Date:Aug 2, 2026

Advertisement

తమిళ రాజకీయాల్లో  కావేరి జలాల చిచ్చు రేగింది.   దశాబ్దాలుగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారిన కావేరి జలాల పంపకం సమస్య..  మేకెదాటు ప్రాజెక్ట్ నిర్మాణం వివాదం తాజాగా పీక్స్ కు చేరుకున్నాయి.  కావేరి నదీ జలాల హక్కుల పరిరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. 

తాజాగా ఈ వివాదం పెచ్చరిల్లడానికి  ప్రతిపక్షాల అఖిలపక్షం డిమాండ్ ను ముఖ్యమంత్రి విజయ్ తిరస్కరించడమే కారణమని పరిశీలకులు చెబుతున్నారు.   ప్రతిపక్ష డీఎంకే, ఇతర పార్టీలు కావేరీ జల వివాదంపై  అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయగా, సీఎం విజయ్..   ఇప్పటికే శాసనసభలో కావేరి నీటి హక్కులపై ఏకగ్రీవ తీర్మానం చేశామని, అందుకే మళ్లీ ప్రత్యేకంగా అఖిలపక్ష భేటీ అవసరం లేదని అకుండబద్దలు కొట్టారు.  

దీంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్  ముఖ్యమంత్రి విజయ్ కావేరి వివాదంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు.  కావేరి జలాలు తమిళనాడుకు అత్యంత కీలకమనీ, ఇతర రాష్ట్రాల వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఏకాభిప్రాయ సాధన అవసరమని అన్నారు.   ప్రతిపక్షాల విజ్ఞప్తులను పక్కనబెట్టి సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్లడం వల్ల తమిళనాడు రైతులకు న్యాయం జరగదన్నారు. సీఎం తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చారు. 

అదలా ఉండగా,  కర్ణాటక ప్రభుత్వం కావేరి పరివాహక ప్రాంతంలో మేకెదాటు డ్యామ్‌ను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో, ఈ సమస్యను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా కర్ణాటక పర్యటనకు సిద్ధమయ్యారన్న వార్తలు విపక్షాలలో మరింత ఆందోళనకు కారణమయ్యాయి.  చర్చల ద్వారా  సమస్య తీరదనీ, న్యాయపోరాటం ద్వారానే తమిళనాడు హక్కులను కాపాడుకోవాలని విపక్షలు అంటున్నాయి. కర్ణాటక ప్రభుత్వం అక్కడ ప్రత్యేక అఖిలపక్ష భేటీ నిర్వహించి తమ రాష్ట్రంలో ఐక్యతను ప్రదర్శిస్తుంటే..  తమిళనాడులో మాత్రం అధికార, ప్రతిపక్షాల మధ్య విభేదాలు పెచ్చరిల్లుతున్నాయి.   రాష్ట్రాల మధ్య నదుల అనుసంధానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి చర్చించేందుకు అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లానని డీఎంకే డిమాండ్ చేస్తున్నది.   ఒకవైపు ఆందోళన బాట పట్టిన డీఎంకే, మరోవైపు క్షేత్రస్థాయిలో నీటి కొరతతో అల్లాడుతున్న రైతులు, ఇంకోవైపు న్యాయపోరాటం చేయాలనే డిమాండ్లు... ఈ పరిణామాలు  సీఎం విజయ్ కు సవాల్ గా మారాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత విజయ్ కు ఎదురైన అతి పెద్ద సవాల్ ఇదేనని రాజకీయపరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

CM Vijay, Cauvery Water Dispute, Tamil Nadu Politics, TVK vs DMK, Mekedatu Dam Row

By
en-us Political News

  
గత తప్పిదాల కారణంగా వైసీపీ నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా కేసుల ఉచ్చుల్లో చిక్కుతున్నారు. ఇక  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో  అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుండటంతో వైసీపీ నేతలలో నిరాశ నిస్ఫృహలు అలుముకుంటున్నాయి.
భోగాపురం విషయంలో వైసీపీ అధినేత జగన్.. ఒకే సమయంలో క్రెడిట్ చోరీకీ, విమానాశ్రయం సాకారం కావడం పట్ల విమర్శలకు పాల్పడటం అపహాస్యం పాలౌతోంది.
జగన్‌లో మార్పు వుంటుందా, వుండదా అన్న అయోమయంలో వైసీపీ నేతలు.. ఆయనలో మార్పు వుండదన్న నిశ్చయానికి వచ్చేస్తున్నారు.
రాజకీయాల్లో విజయం అనేది కేవలం నాయకుల ఉపన్యాసాల వల్ల మాత్రమే సాధ్యం కాదు. అధికారం, రాజకీయ వేధింపులు, ఆంక్షలు ఎన్ని ఎదురైనా వెరవక
అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పరిధిలో దాదాపు రూ. 7.5 కోట్ల విరాళాల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలపై పార్లమెంట్‌ ద్వారం వద్ద స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ కాషాయ వస్త్రాలు ధరించి, పూజారి వేషంలో ఒక పెద్ద హుండీతో కూర్చుని సేకరించిన విరాళాలను జేబులో వేసుకుంటూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.
నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే విశాఖను గ్లోబల్ ఐటీ, ఇండస్ట్రియల్ హబ్‌గా మార్చాలనే ఆలోచనతో ఈ భోగాపురం ప్రాజెక్టుకు చంద్రబాబు బీజం వేశారనీ, అయితే.. కాలక్రమంలో ప్రభుత్వాలు మారాయి, ప్రాజెక్టు ప్రతిపాదనలు మడతపడ్డాయన్నారు.
సిదిరి అప్పలరాజు కుమారుడు బైక్ నిర్లక్ష్యంగా నడిపి ఒకరి మృతికి కారణమయ్యారన్న కేసు దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల మేరకు ఇందులో ఎలాంటి రాజకీయ కుట్రలు లేవు. సీదిరి అప్పలరాజు చేసిన అతే.. ఆయనను చట్టపరంగా ఇబ్బందుల్లోకి నెట్టింది.
ఎప్పుడో ఓ సారి జైల్లో ఉన్న నేతకు పరామర్శ పేరుతో బయటకు వచ్చే సందర్భాలలో కూడా సదరు నేతను పరామర్శించడం కంటే.. బల ప్రదర్శనకు, తనకు జనం మద్దతు ఉందని నిరూపించుకునే ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన అలా బయటకు వచ్చిన ప్రతి సారీ అభాసుపాలౌతూనే ఉన్నారు.
ఢిల్లీ వీధుల్లో రగిలిన ఆగ్రహ జ్వాలలు, పోలీసుల లాఠీఛార్జీలు, కన్నీటి ధారలు, నిర్బంధాలను సైతం లెక్కచేయక హక్కుల కోసం వీధిపోరాటానికి దిగిన యువత ఆక్రందనలు
రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అమూల్యమైన భూములను ఇవ్వద్దు, భోగాపురం విమానాశ్రయాన్ని అందరం కలిసి అడ్డుకుందాం" అంటూ జగన్ ఇచ్చిన పిలుపుల ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతూ భోగాపురం విషయంలో జగన్ ద్వంద్వ వైఖరిని ఎండగడుతున్నాయి.
తెలుగుదేశం కూమిటికి ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. చంద్రబాబు నాయకత్వంలో కూటమి సర్కార్ సంక్షేమ, అభివృద్ధిని సమాంతరంగా పరుగులు పెట్టిస్తున్నప్పటికీ ఆ స్థాయిలో ప్రజాదరణ పెరగడం అటుంచి.. క్షేత్రస్థాయిలో కూటమి పాలన పట్ల ఒకింత అసంతృప్తి పె రిగిందని సర్వే స్పష్టం చేయడమే.
మొత్తంగా విద్యార్థులు, యువతఉద్యమం.. ఒక స్పష్టమైన సందేశాన్ని అయితేనిస్సందేహంగా ఇచ్చింది. అన్యాయాన్ని ప్రశ్నించడంలో, హక్కుల కోసం పోరాడటంలో , న్యాయం కోసం నినదించడంలో వెనకడుగు వేసే ప్రశ్నేలేదని చాటింది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కర్నూలు జిల్లా ఆదోని పట్టణ, మండల టీడీపీ నేతలు పని చేయాలని
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.