తానా 2025 మహాసభల వేదిక డెట్రాయిట్‌...!

Publish Date:Aug 27, 2024

Advertisement

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 24వ మహాసభ డెట్రాయిట్లో నిర్వహించాలని నిర్ణయించారు. 2025 జులై మొదటి వారంలో ఈ వేడుకలు జరగనున్నాయి. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఈ మహాసభలకు కో-ఆర్డినేటర్‌గా ఉదయ్ కుమార్ చాపలమడుగు, చైర్మన్‌గా గంగాధర్ నాదెళ్ల నియమితులైనట్లు ‘తానా’ సెక్రటరీ రాజా కసుకుర్తి తెలిపారు. ఈ మేరకు బోర్డు, ఎగ్జిక్యూటివ్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

‘తానా’ 2025 మహాసభలు జరిగే నగరాన్ని ఎంపిక చేయడానికి ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల కమిటీ నివేదికను తానా ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఆమోదించారు. ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీకి శ్రీనివాస్ కోనేరు ఛైర్మన్‌గా వ్యవహరించారు. నరహరి కొడాలి, శ్రీనివాస్ దాసరి సభ్యులు. ప్రతిపదేళ్ళకు ఒకసారి తానా మహాసభలు డెట్రాయిట్లో జరగడం సంప్రదాయంగా వస్తోంది. 2005, 2015 సంవత్సరాల్లోనూ డెట్రాయిట్ నగరంలోనే ‘తానా’ మహాసభలు జరిగాయి. ఇప్పుడు కూడా ఆ సంప్రదాయానికి కొనసాగింపుగా 2025 సంవత్సరం ‘తానా’ మహాసభలను కూడా అక్కడే నిర్వహించాలని ముగ్గురు సభ్యుల కమిటీ నిర్ణయించడం విశేషం. డెట్రాయిట్ తెలుగు వారికి దగ్గరగా ఉంటుందని, హాజరయ్యే అతిథులకు వసతి సౌకర్యాలు కల్పించడానికి వీలుగా వుంటుందని ‘తానా’ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.

తానా ఛైర్మన్ గంగాధర్ నాదెళ్ల తానాలో పాత తరానికి, కొత్త తరానికి సుపరిచితులు. ఆయన పర్యవేక్షణలో తానా సభలు ఎలాంటి లోటు లేకుండా జరుగుతాయన్న అభిప్రాయాలు వున్నాయి. అలాగే సమన్వయకర్తగా నియమితులైన ఉదయ్ కుమార్ చాపలమడుగు కృష్ణా జిల్లాలోని చల్లపల్లి వాస్తవ్యులు. ‘తానా’లో అనేక కీలక పదవులు నిర్వహించారు. డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ (డీటీఏ) కార్యనిర్వాహక కమిటీలోనూ ఆయన అనేక కీలక పదవులు నిర్వహించారు. ముఖ్యంగా, డీటీఏ 25, 40వ వార్షికోత్సవాల సందర్భంగా ఉదయ్ కుమార్ చేసిన కృషి అందరి ప్రశంసలను అందుకుంది. 2005 డెట్రాయిట్ తానా ద్వైవార్షిక సదస్సుకు డిప్యూటీ కో-ఆర్డినేటర్‌గానూ ఆయన పనిచేశారు.  2007లో తానా చైతన్య స్రవంతి కో-ఆర్డినేటర్‌గానూ పనిచేశారు. ఈయన ఎవరో కాదు... ప్రముఖ నటుడు, బాబాయ్, దివంగత చలపతి రావు అల్లుడు. అద్భుతమైన ప్రసంగ నైపుణ్యం ఆయన సొంతం. ఆయన ప్రసంగాలు తెలుగు ప్రజల్లో మంచి గుర్తింపు పొందాయి. డెట్రాయిట్లో జరగనున్న తానా సదస్సుకు ప్రతిభావంతులను బాధ్యులుగా ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తమవుతోందని ‘తానా’ కార్యదర్శి రాజా కసుకుర్తి తెలిపారు.

By
en-us Political News

  
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.