Publish Date:Aug 27, 2024
పాపం పండటం అంటే ఏమిటో, పాపం పండితే ఎలా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ మైనింగ్ శాఖ మాజీ ఎండీ వీజీ వెంకటరెడ్డికి ఇప్పుడు తెలిసి వస్తోంది. జగన్ హయాంలో నిబంధనలను తుంగలోకి తొక్కి ఇసుక మైనింగ్ అనుమతులు, అమ్మకాలు, టెండర్లు, కాంట్రాక్టుల వ్యవహారంలో ఇష్టారీతిగా వ్యవహరించిన వీజీ వెంకటరెడ్డి, ఇప్పుడు గతంలో చేసిన పాపాలకు మూల్యం చెల్లించక తప్పని పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. జగన్ హయాంలో వీఈ వెంకటరెడ్డి అక్రమాలపై ఏసీబీ అవినీతి నిరోధక శాఖ నజర్ పెట్టింది. వెంకటరెడ్డి అక్రమాలపై దర్యాప్తునకు అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17 కింద అనుమతులను సంపాదించింది.
జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ మైనింగ్ శాఖ ఎండీగా వెంకట రెడ్డి బహువిధాలుగా అక్రమాలకు, అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఇసుక మైనింగ్, విక్రయాలు, టెండర్లు, కాంట్రాక్టుల విషయంలో నిబంధనలకు తూట్లు పొడిచి ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లేలా వ్యవహరించారన్న విమర్శలు ఉన్నాయి. ఆ ఆరోపణల మేరకు వెంకటరెడ్డి పూర్తిగా వైసీపీ నేతల ఆదేశాల మేరకు పని చేశారు. అలా పని చేసి ప్రైవేటు కంపెనీలకు అప్పనంగా పెద్ద ఎత్తున లబ్ధి చేకూరేలా చేశారు. ఆ ఆరోపణల ఆధారంగా ఆయనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల ఒకటో తేదీన సస్పెండ్ చేసింది. ఇప్పటికే వెంకటరెడ్డి మైనింగ్ లీజుల కేటాయింపులో పలు ఉల్లంఘనలకు, అవకతవకలకు పాల్పడ్డారని ఏపీబీ నిర్ధారించింది. అలాగే ఇసుక టెండర్ల ఖరారులోనూ వెంకటరెడ్డి అక్రమాలకు పాల్పడినట్లు ఏపీబీ దర్యాప్తులో తేలింది.
ఇప్పుడు అందుకు సంబంధించి ఫైళ్లు, డాక్యుమెంట్ల పరిశీలనలో దిగ్భ్రాంతికర విషయాన్ని ఏపీబీ బయటపెట్టింది. జైపీ పవర్ వెంచర్స్ అనే కంపెనీ అప్పటికే ప్రభుత్వానికి 800 కోట్ల రూపాయలు బకాయి పడి ఉండగా వెంకటరెడ్డి ఆ కంపెనీకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చేశారు. అంతే కాకుండా సుప్రీం కోర్టుకు, హైకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్ ఎన్జీటీలకు తప్పుడు అఫిడవిట్లను సమర్పించారు. ఈ విషయంపైనే ఏసీబీ లోతుగా దర్యాప్తు చేస్తున్నది. ఈ నెల 31న వెంకటరెడ్డి పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే సస్పెన్షన్ లో ఉండటం వల్ల ఆయన రిటైర్ కాలేరు. అదలా ఉంచితే గత రెండు నెలలుగా వెంకటరెడ్డి పరారీలో ఉన్నారు. సస్పెన్షన్ నోటీసులు అందుకోవడానికి కూడా ఆయన దొరక లేదు. మొత్తం మీద వెంకటరెడ్డి కదలికలను ఏసీపీ నిశితంగా పరిశీలిస్తున్నది. ఇప్పటికే మైనింగ్ ఎండీగా ఆయన పాల్పడిన అవకతవకలు, అక్రమాలపై స్ఫష్టమైన ఆధారాలు లభించడంతో ఆయ నపై చర్యలు తప్పవు. కలుగులో దాక్కొన్నా బయటకు తీసుకువచ్చి చట్ట ప్రకారం శిక్ష అనుభవించేలా చేస్తారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/acb-confirms-mining-former-md-venkatareddy-irregularities-39-183720.html
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని.
అయితే ఆయన తాజాగా నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు, వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో కలకలం రేపింది.
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు. ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం.