ఫైనల్ పోరులో భారత్ ముందు 5 పెను సవాళ్లు

Publish Date:Mar 8, 2026

Advertisement

 

మరికొద్ది గంటల్లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో టీ-20 ప్రపంచకప్-2026 ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. ఈ స్టేడియంలో ఇటీవలి కాలంలో భారత్‌కు మెరుగైన రికార్డు లేదు. ఈ స్టేడియంలోనే 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఓడిపోయింది. ఆ క్రమంలో న్యూజిలాండ్‌తో జరగనున్న తుదిపోరులో భారత్‌ ముందు 5 ప్రధాన సవాళ్లు కనిపిస్తున్నాయి. 

టీ 20 వరల్డ్ కప్ చరిత్రతో న్యూజిలాండ్‌పై భారత్‌కు గెలుపు రికార్డు లేదు. ఇప్పటి వరకు తలపడిన మూడు సార్లు కివీస్ జట్టే విజయం సాధించింది. ఈ సారి ఆ చరిత్ర తిరగరాయడం టీంఇండియాకు పెద్ద సవాలే. ఇక గత 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఇదే వేదికపై ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది. అలాగే ప్రస్తుతం జరుగుతున్న టోర్నీలో టీమిండియాకు ఎదురైన ఏకైక ఓటమి కూడా ఈ పిచ్‌లోనే. సూపర్-8 దశలో అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైంది . 

ఓపేనర్ అభిషేక్ శర్మ వరుసగా విఫలమవుతుండటం భారత్ అభిమానులను, జట్టు మేనేజ్‌మెంట్‌ను కలవరపరుస్తోంది. ఫైనల్ లాంటి కీలక మ్యాచుల్లో అతనితో పాటు సంజూశామ్సన్, సూర్యకుమార్ యాదవ్ సహా టాప్ ఆర్డర్ మొత్తం రాణించాల్సి ఉంది. బౌలర్ వరుణ్ చక్రవర్తి టోర్నీలో అత్యధిక వికెట్లు తీసినప్పటికీ, సెమీఫైనల్లో అతను భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అతను మునుపటి ఫాం అందిపుచ్చుకోవాల్సి ఉంది.   వరుణ్‌ను తప్పించి..కుల్దీప్‌ను తీసుకోవాలని సీనియర్లు సూచిస్తున్నారు. అలాగే సెమీఫైనల్లో కేవలం 33 బంతు్లో సెంచరీ బాదిన కివీస్ ఓపెనర్ ఫిల్ అలెన్ భీకర్ ఫామ్‌లో ఉన్నాడు. అతన్ని త్వరగా కట్టడి చేయడంపైనే భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.

భారత్ తుది జట్టు కూర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్‌పై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఒక స్పష్టమైన సూచన చేశాడు. ఫైనల్ మ్యాచ్ కోసం అభిషేక్ శర్మకు విశ్రాంతినివ్వాలని, అతడి స్థానంలో ఫామ్‌లో ఉన్న రింకూ సింగ్‌ను తీసుకోవాలని కైఫ్ అభిప్రాయపడ్డాడు.

కాగా, ప్రస్తుతం ఫైనల్ మ్యాచ్ కోసం తయారు చేసిన పిచ్, గతంలో టీమిండియా ఓడిపోయినప్పుడు ఉపయోగించిన పిచ్‌ల కంటే చాలా భిన్నంగా ఉందట. పిచ్‌ను పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా మార్చేశారట. పిచ్ మీద గడ్డిని పూర్తిగా తొలగించి ఫ్లాట్‌గా మార్చేశారట. ప్రస్తుత పిచ్ చక్కటి బౌన్స్‌తో బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందట. అలాగే దూకుడుగా ఆడే స్ట్రోక్‌ప్లేయర్లకు స్వర్గధామంగా ఉంటుందట. అయితే పిచ్ పూర్తి ఫ్లాట్‌గా ఉండడం వల్ల స్పిన్నర్ల విషయంలో కెప్టెన్లు ఇద్దరూ ఆలోచనలో పడ్డారట . 

పిచ్ నుంచి స్పిన్నర్లకు సహాయం లభించకపోవచ్చనే అంచనాల నేపథ్యంలో వరుణ్ చక్రవర్తిని పక్కన పెట్టి, మరో పేసర్‌ను ఆడించాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తోందట. అక్షర్ పటేల్ రూపంలో మరో స్పిన్నర్ అందుబాటులో ఉంటాడు కాబట్టి, వరుణ్‌ను పక్కన పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఏదేమైనా, సెమీ-ఫైనల్ తరహాలతోనే ఫైనల్ మ్యాచ్‌లో కూడా పరుగుల వరద ఖాయంగా కనిపిస్తోంది.

 

 

అహ్మదాబాద్‌లో ఆదివారం వాతావరణం చాలా వేడిగా, పొడిగా ఉండనుంది. అక్యూవెదర్ నివేదికల ప్రకారం, వర్షం పడే అవకాశం అస్సలు లేదు. పగటి ఉష్ణోగ్రతలు 34 నుండి 41 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే అవకాశం ఉంది. సాయంత్రం కూడా వాతావరణం 30 డిగ్రీల వరకు ఉంటూ కాస్త ఉక్కపోతగా అనిపించవచ్చు. వర్షం ముప్పు లేనందున అభిమానులు పూర్తి మ్యాచ్‌ను ఆస్వాదించవచ్చు.

By
en-us Political News

  
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సాధారణంగా తనదైన దూకుడు రాజకీయ శైలితో, వాడీవేడి వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ షాక్ ఇచ్చింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ రూట్ ఎందుకు ఆలస్యం కానుంది? రియల్ ఎస్టేట్‌పై చూపే ప్రభావం, రాజకీయ దుమారం పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
తనిఖీల్లో అర్హత లేని వ్యక్తులు వైద్య సేవలు అందిస్తున్నట్లు, సరైన అనుమతులు లేకుండానే చికిత్సలు నిర్వహిస్తున్నట్లు గుర్తించినట్లు సమాచారం. ఈ దాడుల్లో అధికారులు పలు క్లినిల్ లను పరిశీలించి, రికార్డులు, వైద్య సిబ్బంది అర్హతలు, చికిత్సల విధానాలపై సుదీర్ఘంగా విచారణ చేశారు.
ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలతో హార్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. వాణిజ్య నౌకలు కనిపిస్తే పేల్చేస్తామన్న హెచ్చరికలతో గ్లోబల్ ఆయిల్ మార్కెట్లు సంక్షోభంలో పడ్డాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
వేదాంత 5 విడి విడి కంపెనీలుగా మారిన తర్వాత షేర్ హోల్డర్లకు వచ్చే డివిడెండ్ల పరిస్థితి ఏంటి? అల్యూమినియం, జింక్ వ్యాపారాల విభజనతో ఇన్వెస్టర్లకు లాభమా నష్టమా? మార్కెట్ నిపుణుల విశ్లేషణ పూర్తి వివరంగా ఇక్కడ చూడండి.
రాజ్యసభ అభ్యర్థిగా తాను దాఖలు చేసిన నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ.. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌ ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది.
రూపాయి విలువ పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్‌బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్‌ఆర్‌ఐ ఎఫ్‌సీఎన్‌ఆర్ (FCNR-B) డిపాజిట్లపై హెడ్జింగ్ ఖర్చులను ఆర్‌బీఐ భరించనుండటంతో, బ్యాంకులు ఇప్పుడు 6% పైగా భారీ వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. ఈ సరికొత్త ఆర్థిక వ్యూహం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
దేశంలో రికార్డు స్థాయికి చేరిన విద్యుత్ డిమాండ్ నేపథ్యంలో ఎన్‌టీపీసీ, అదానీ పవర్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ వంటి ప్రముఖ పవర్ స్టాక్స్‌పై అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ మెక్వారీ సంచలన నివేదికను విడుదల చేసింది. రేటింగ్స్, టార్గెట్ ధరల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
గత ఏడాది కాలంలో 280% పైగా పెరిగిన ఎంటీఏఆర్ టెక్నాలజీస్ (MTAR Tech) షేర్లు హఠాత్తుగా 9% కుప్పకూలాయి. అమెరికా క్లయింట్ బ్లూమ్ ఎనర్జీ మరియు OpenAI డేటా సెంటర్ ప్రాజెక్ట్ నిలిచిపోవడమే దీనికి కారణమా? పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
శ్రీలంకతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత అండర్-19 మహిళల జట్లను బీసీసీఐ ప్రకటించింది. డబ్ల్యూపీఎల్ స్టార్, 16 ఏళ్ల దీయా యాదవ్‌కు వన్డే జట్టులో చోటు దక్కగా, వరల్డ్ కప్ విన్నర్ భవిక అహిరేకు కెప్టెన్సీ పగ్గాలు లభించాయి. పూర్తి స్క్వాడ్, మ్యాచ్ షెడ్యూల్ ఇక్కడ చూడండి.
కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న అమరావతిని కవిత వరద ప్రాంతమంటూ ఎద్దేవా చేయడాన్ని తప్పుపడుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈడీ ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాలలో మొత్తం 10 ప్రాంతాల్లో ఈడీ బృందాలు గురువారం ఉదయం నుంచే విస్తృతంగా సోదాలు చేపట్టాయి. రాజ్‌ కేసిరెడ్డికి చెందిన నివాసాలు, కార్యాలయాలే లక్ష్యంగా జరిగిన ఈ సోదాలలో కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ఫిఫా వరల్డ్ కప్ 2026 మ్యాచ్‌లను భారతదేశంలో సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఉచితంగా ఎలా చూడాలో తెలుసుకోండి. డీడీ స్పోర్ట్స్ ఉచిత లైవ్ స్ట్రీమింగ్ షెడ్యూల్ మరియు పూర్తి వివరాలు మీకోసం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.