లంకతో తొలి టి20.. టీమ్ ఇండియా థ్రిల్లింగ్ విక్టరీ

Publish Date:Jan 3, 2023

Advertisement

చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. శ్రీలంకతో ముంబై వాంఖడే స్టేడియంలో బుధవారం (జనవరి 3)జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్  2 పరుగుల తేడాతో లంకపై విజయం సాధించింది.తొలుత టాస్ కోల్పోయి బ్యాటింగ్ కు దిగిన  నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో శ్రీలంక జట్టు 160 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది.

శ్రీలంక ఇన్నింగ్స్ లో కెప్టెన్ దసున్ శనక 45 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అతడికి హసరంగ (10 బంతుల్లో 21) నుంచి సహకారం అందింది. ఓ దశలో శ్రీలంక 68 పరుగులకే 5 వికెట్లు కోల్పోగా ఈ జోడీ ఆదుకుంది. అయితే హసరంగను శివమ్ మావి ఔట్ చేయగా, శనకను ఉమ్రాన్ మాలిక్ పెవిలియన్ చేర్చాడు.

చివరి ఓవర్లో లంక విజయానికి 13 పరుగులు అవసరం కాగా, కరుణరత్నే (23 నాటౌట్), కసున్ రజిత (5) పోరాడారు. విజయం సాధించాలంటే ఆఖరి బంతికి 4 పరుగులు చేయాల్సి ఉండగా, అక్షర్ పటేల్ వేసిన బంతిని కరుణరత్నే బౌండరీ కొట్టేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఆఖరి ఓవర్లో ఇద్దరు రనౌట్ అయ్యారు. 

టీమిండియా బౌలర్లలో డెబ్యూ బౌలర్ శివమ్ మావి అదరగొట్టాడు. కేవలం 22 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్ తలో 2 వికెట్లతో సత్తా చాటారు. ఈ గెలుపుతో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో టీమిండియా 1-0తో లీడ్ లో ఉంది. రెండో టీ20 మ్యాచ్ ఈ నెల 5న పుణేలో జరగనుంది.  అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు చేసిందంటే అందుకు చివర్లో దీపక్ హుడా, అక్షర్ పటేల్ రెచ్చిపోవడం వల్లే సాధ్యమైంది.

హుడా 23 బంతుల్లోనే 1 ఫోర్, 4 సిక్సులతో 41 పరుగులు చేయగా.. అక్షర్ పటేల్ 20 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సుతో 31 పరుగులు చేశాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్య 29, ఓపెనర్ ఇషాన్ కిషన్ 37 పరుగులు చేశారు. ఇషాన్ కిషన్ దూకుడు చూస్తే భారత భారీ స్కోరుపై కన్నేసినట్టు కనిపించింది. అయితే లంక స్పిన్నర్లు భారత్ దూకుడును అడ్డుకున్నారు. దాంతో 46 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా కష్టాల్లో పడింది. శుభ్ మాన్ గిల్ 7, సూర్యకుమార్ యాదవ్ 7, సంజు శాంసన్ 5 నిరాశపరిచారు. ఈ దశలో ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ ఔటయ్యాక, ఆ బాధ్యతను హుడా, అక్షర్ పటేల్ తీసుకున్నారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ ఆఖర్లో బ్యాట్లు ఝుళిపించి భారత్ స్కోరును 162 పరుగులకు చేర్చారు. ఈ విజయంతో లంకతో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో టీమిండియా 1-0తో లీడ్ లో ఉంది. రెండో మ్యాచ్ ఈ నెల 5న పుణేలో జరగనుంది.

By
en-us Political News

  
తెలంగాణ పోలీసు వ్యవస్థలోకి మరో కొత్త తరం అడుగుపెట్టింది.
ప్రధాని కావాలనుకోవడం తప్పా.. ప్రణబ్ కుమార్తె కౌంటర్.! 
ఉద్యోగం.. మంచి జీతం.. ఉచిత వసతి.. ఇవన్నీ ఆశ చూపించి యువతులను హైదరాబాద్‌కు రప్పించడం
వీసీ జానయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. గవర్నర్‌కు మహిళా ప్రొఫెసర్ ఫిర్యాదు.!
టెక్నాలజీ రంగంలో యువత తమ సృజనాత్మకతతో అద్భుతాలు సృష్టిస్తున్నారు.
యువకులపై హోటల్ సిబ్బంది, యాజమాన్యం అనుచరుల దాడి.!
రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుత కాలంలో చర్చనీయాంశంగా మారిన పరిణామాలపై ప్రధాన రాజకీయ పార్టీలు బాధ్యతాయుతమైన వైఖరిని ప్రదర్శిస్తున్నాయి.
రాజకీయాలలో ఆధిపత్యం కోసం కుమ్ములాటలూ, తగాదాలు, విభేదాలు. అటువంటి కారణాలతోనే కేసీఆర్ కుటుంబం నుంచి కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి సొంత రాజకీయ పార్టీ తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) ఏర్పాటు చేశారు.  సరిగ్గా అటువంటి తాగాదాలతోనే వైఎస్ రాజశఖరరెడ్డి కుమార్తె, ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ కు స్వయానా చెల్లెలు అయిన వైఎస్ షర్మిల అన్నతో వేరుపడి సొంత బాటలో నడుస్తున్నారు.
ప్రజల ప్రాణాలకు ముప్పు కలగకూడదని హెచ్చరించడమే ఆయన చేసిన నేరమైంది.
భారతీయ ఆర్థిక వ్యవస్థలో నల్లధనం అరికట్టేందుకు, అవినీతిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో పెద్ద నోట్ల రద్దు అంశం ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఒక షాకింగ్ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
దీపావళి పండుగ వేళ ఛత్తీస్‌గఢ్‌లో అత్యంత హృదయ విదారకరమైన ఘటన చోటుచేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.