కేసీఆర్ తెలంగాణ ప్రజలను గంగిరెద్దుల్లా ఆడిస్తున్నారు:మంత్రి టీజీ వెంకటేష్
Publish Date:Jan 15, 2012
Advertisement
కర్నూలు:ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం పేరుతో తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజలను తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు గంగిరెద్దుల్లా ఆడిస్తున్నారని మంత్రి టీజీ వెంకటేష్ ఆరోపించారు.ఆయన కర్నూల్లో మాట్లాడుతూ సంక్రాంతి పండగ తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నట్టు కేసీఆర్ ప్రకటించారని ఉద్యమానికి మద్దతు తెలిపే విద్యార్థులు ముందుగా కేసీఆర్ పరిస్థితి, వైఖరి ఏంటో తెలుసుకోవాలని హితవు పలికారు.తెలంగాణ కోసమే తమ పోరాటం చేస్తున్నామంటున్న కేసీఆర్ తను మంత్రిగా అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణకు, ఆ ప్రాంత ప్రజలకు ఏం చేశారో చెప్పాలని టీజీ వెంకటేష్ డిమాండ్ చేశారు. ప్రత్యేక ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని ఆ ప్రాంత ప్రజలను ఆయన గంగిరెద్దుల్లా ఆడిస్తున్నారని మండిపడ్డారు.
http://www.teluguone.com/news/content/tgvenkatesh-24-10950.html





