శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు కనిపించే లక్షణాలు ఇవే..!

Publish Date:Sep 30, 2024

Advertisement

కొలెస్ట్రాల్ శరీరానికి చాలా అవసరమైన పదార్థం.  కొలెస్ట్రాల్ లో బ్యాడ్ కొలెస్ట్రాల్,  గుడ్ కొలెస్ట్రాల్ అని రెండు రకాలు ఉంటాయి.  శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన కొవ్వులు అవసరం.  అలా కాకుండా చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ అయితే ఫ్యాటీ లివర్,  గుండె సంబంధ సమస్యలు, ఊబకాయం వంటి సమస్యలు వస్తాయి. శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడానికి అనేక కారణాలు ఉంటాయి. అయితే శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.  ఈ లక్షణాలను బట్టి కొలెస్ట్రాల్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవచ్చు..

కొలెస్ట్రాల్ అంటే..

కొలెస్ట్రాల్ అనేది శరీరం అనేక ముఖ్యమైన విధులు నిర్వర్తించడానికి సహాయపడే ఒక లిపిడ్.  ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ శరీరానికి ఎంత అవసరమో.. చెడు కొలెస్ట్రాల్ శరీరానికి చేసే చేటు అంతకంటే దారుణంగా  ఉంటుంది.

కొలెస్ట్రాల్ ఎక్కువైతే కనిపించే లక్షణాలు..

కొలెస్ట్రాల్ ఎక్కువ అయితే ఛాతీ నొప్పి వస్తుంది. లేకపోతే ఛాతీ భాగంలో  ఒత్తిడి కూడా ఉంటుంది.  ఇలాంటి లక్షణాలు ఎవరికైనా కనిపిస్తే వైద్యులను కలవడం, కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకోవడం మంచిది.

ఎప్పుడూ అలసటగా అనిపించడం,  శరీరంలో శక్తి లేనట్టు ఉండటం  కూడా కొలెస్ట్రాల్ లెవల్స్ పెరిగాయనడానికి సంకేతం.

శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే పాదాలు, చీల మండలలో వాపు ఉంటుంది. కొలెస్ట్రాల్ రక్త ప్రవాహంలో అడ్డంకులు ఏర్పరచడం వల్ల  ఇలా పాదాలలో వాపులు వస్తాయి.

కంటి చూపు మందగించడం కూడా కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువ ఉండటాన్ని సూచిస్తుంది. కంటి చూపు మసకగా ఉండటం, దృష్టి విషయంలో తేడాలు ఉండటం మొదలైనవి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం వల్ల జరుగుతుంది.

శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే చర్మం పై మచ్చలు వస్తాయి.  చర్మం పై మచ్చలు ఏర్పడుతుంటే వైద్యులను సంప్రదించాలి.


                                                  *రూపశ్రీ.

By
en-us Political News

  
ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మలబద్ధకం. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే పైల్స్, గ్యాస్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఎలాంటి మందులు వాడకుండా, ఇంట్లోనే సహజంగా మలబద్ధకాన్ని ఎలా తగ్గించుకోవచ్చో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు..
మానవ శరీరంలో ప్రేగుల పాత్ర చాలా ఉంది.,  తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో,  శరీరానికి అవసరమైన పోషకాలను గ్రహించడంలో, వ్యర్థాలను బయటకు పంపడంలో ప్రేగులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. తిన్న ఆహారం..
మన శరీరంలో పొటాషియం స్థాయిలు హెచ్చుతగ్గులు కావడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, వాటి కారణాలు మరియు నివారణ మార్గాల గురించి ప్రముఖ వైద్యులు డాక్టర్ పాపారావు గారు ఈ వీడియోలో క్లుప్తంగా వివరించారు...
మూత్రపిండాలు శరీరం నుండి విషపదార్థాలను తొలగించడం, రక్తపోటును నియంత్రించడం,  శరీరంలో నీరు, ఖనిజాలను బాలెన్స్డ్ గా ఉంచడం వంటి   ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తాయి. అయితే, కొన్ని అనారోగ్యకరమైన..
చాలా మందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘తల తిరగడం’ (Vertigo/Dizziness) ఒకటి. హఠాత్తుగా కళ్ళు తిరగడం వల్ల భయం, అసౌకర్యం కలగడమే కాకుండా రోజువారీ పనులు చేసుకోవడం కష్టమవుతుంది.
చాలా మందికి రాత్రిపూట వేడివేడి అన్నం తింటే గాని నిద్ర పట్టదు. కానీ, బరువు తగ్గాలని లేదా ఫిట్‌గా ఉండాలని ప్రయత్నించే వారికి..
మనలో చాలా మందికి అద్దంలో చూసుకున్నప్పుడు కొన్ని శరీర భాగాలు నచ్చవు. ముఖ్యంగా ఎంత వ్యాయామం చేసినా, ఎంత కఠినమైన డైట్ పాటించినా తగ్గని మొండి కొవ్వు మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది...
ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మహిళలను వేధిస్తున్న అతిపెద్ద సమస్య పి.సి.ఓ.డి (PCOD). అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది..
ఈనాటి వేగవంతమైన జీవనశైలిలో మనకు తెలియకుండానే మనం అనేక ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నాము. ముఖ్యంగా, నేటి యువతలో సెక్స్ పట్ల ఆసక్తి తగ్గడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారుతోంది. ..
మధుమేహం (Diabetes) ఉన్నవారు చేసే మొదటి పని అన్నం మానేసి చపాతీలు తినడం. మరి నిజంగా చపాతీ తింటే షుగర్ తగ్గుతుందా? అన్నం తింటే పెరిగిపోతుందా? ఈ విషయంలో చాలా మందిలో..
నేటి వేగవంతమైన ఒత్తిడితో కూడిన జీవితంలో ఆందోళన ఒక సాధారణ సమస్యగా మారింది. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు కూడా మనసును అశాంతపరిచి, నిద్ర, ఆహరం, రోజువారీ జీవనశైలిపై  ప్రభావం చూపుతాయి...
కాలం మారినా మనిషి జీవన పోరాటం మాత్రం మారదు.  కొందరు కాలంతో పోటీ పడి ఎండ, వాన, చలి వంటి వాటిని లెక్క చేయకుండా సాగుతూ ఉండాలి. లేకపోతే వారితో పాటు వారిని నమ్ముకున్న కుటుంబాలు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.....
వేసవి అంటే మండే ఎండలు, వేడి గాలులు,  చెమటలు పట్టించే వాతావరణం.. ఇవన్నీ ఉంటాయి.  ఇలాంటి రోజుల్లో  రోడ్డు పక్కన అమ్మే చెరకు రసం తాగితే ఎంతో హాయిగా ఉంటుంది. నిమ్మరసం, నల్ల ఉప్పు, పుదీనా కలపడం వల్ల చెరకు రసం  రుచి మరింత ఇనుమడిస్తుంది...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.