ఈ లక్షణాలు ఉంటే మీ ప్రేగులు బలహీనంగా ఉన్నట్టే లెక్క!

Publish Date:May 19, 2026

Advertisement

మానవ శరీరంలో ప్రేగుల పాత్ర చాలా ఉంది.,  తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో,  శరీరానికి అవసరమైన పోషకాలను గ్రహించడంలో, వ్యర్థాలను బయటకు పంపడంలో ప్రేగులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. తిన్న ఆహారం నుండి లభించే పోషకాలు రక్తంలోకి శోషించబడేది కూడా ప్రేగుల ద్వారానే. శరీరంలో ఇంత ముఖ్యమైన విధులు నిర్వర్తించే ప్రేగుల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.  ప్రేగు ఆరోగ్యంగా బలహీనంగా ఉంటే పైన పేర్కొన్న విధులు మందగిస్తాయి. శరీరంలో కనిపించే కొన్ని లక్షణాల ద్వారా ప్రేగు ఆరోగ్యంగా బలహీనంగా ఉందా లేదా తెలుసుకోవచ్చు.  ఆ లక్షణాలు ఏంటో తెలుసుకుంటే..

ప్రేగు ఆరోగ్యం బలహీనంగా ఉందని సూచించే లక్షణాలు..

ఆహారం తిన్న తర్వాత..

ఆహారం తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా ఉన్నా, బరువుగా అనిపించినా ప్రేగు ఆరోగ్యంగా బలహీనంగా ఉందని  అర్థం.  అయితే భారీ ఆహారం తీసుకున్నప్పుడు సాధారణంగానే ఉబ్బరంగా లేదా బరువుగా అనిపిస్తుంది. కానీ సాధారణ ఆహారం తీసుకున్నప్పుడు కూడా బరువుగా అనిపించడం, అది కూడా తరచుగా అనిపిస్తూ ఉంటే.. ప్రేగు ఆరోగ్యం బలహీనంగా ఉందని అర్థం.

మలబద్దకం..

ప్రేగు ఆరోగ్యం బలహీనంగా ఉందని చెప్పడానికి ఉండే అతిపెద్ద లక్షణం మలబద్దకం.  మలం గట్టిగా రావడం లేదా మలవిసర్జన చేసేటప్పుడు గట్టిగా బలవంతంగా విసర్జన చేయడానికి ప్రయత్నించడం వంటివి ప్రేగు ఆరోగ్యం బలహీనంగా ఉందని సూచిస్తాయి. అలాగే మలవిసర్జన ప్రతి రోజూ ఒకే సమయానికి కాకుండా అస్తవ్యస్తంగా రావడం కూడా ప్రేగు ఆరోగ్యం బలహీనంగా ఉందని సూచిస్తుంది.

గ్యాస్..

నేటికాలంలో చాలామంది ఎదుర్కుంటున్న గ్యాస్, ఎసిడిటీ,  ఛాతీలో మంట వంటి సమస్యలు అన్నీ కేవలం ఆహార అలవాట్లు సరిగా లేకపోవడం వల్ల వస్తున్నాయని అనుకుంటారు చాలామంది. కానీ ప్రేగు ఆరోగ్యం బలహీనంగా ఉంటేనే ఈ సమస్యలు వస్తాయి. అది కూడా గ్యాస్,  ఎసిడిటీ,  ఛాతీలో మంట వంటి సమస్యలు పదే పదే వస్తాయి.

నోటి ఆరోగ్యం..

నాలుక పైన తెల్లటి పూత రావడం, నోటి దుర్వాసన రావడం కూడా ప్రేగు ఆరోగ్యం బలహీనంగా ఉందని చెప్పడానికి ఒక సూచన. చాలామందికి నోరు ఎంత శుభ్రం చేసుకున్నా నాలుక మీద తెల్లని పూత,  నోటి దుర్వాసన వస్తుంది. ఇలాంటి వారిలో ప్రేగు ఆరోగ్యం బలహీనంగా ఉండే అవకాశం ఉంటుంది.

ఆకలి..

ఆకలి సరిగా లేకపోయినా లేదా  అతిగా ఆకలి వేసినా కూడా ప్రేగు ఆరోగ్యం సరిగా లేదని అర్థం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

                          *రూపశ్రీ.

By
en-us Political News

  
ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మలబద్ధకం. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే పైల్స్, గ్యాస్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఎలాంటి మందులు వాడకుండా, ఇంట్లోనే సహజంగా మలబద్ధకాన్ని ఎలా తగ్గించుకోవచ్చో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు..
మన శరీరంలో పొటాషియం స్థాయిలు హెచ్చుతగ్గులు కావడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, వాటి కారణాలు మరియు నివారణ మార్గాల గురించి ప్రముఖ వైద్యులు డాక్టర్ పాపారావు గారు ఈ వీడియోలో క్లుప్తంగా వివరించారు...
మూత్రపిండాలు శరీరం నుండి విషపదార్థాలను తొలగించడం, రక్తపోటును నియంత్రించడం,  శరీరంలో నీరు, ఖనిజాలను బాలెన్స్డ్ గా ఉంచడం వంటి   ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తాయి. అయితే, కొన్ని అనారోగ్యకరమైన..
చాలా మందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘తల తిరగడం’ (Vertigo/Dizziness) ఒకటి. హఠాత్తుగా కళ్ళు తిరగడం వల్ల భయం, అసౌకర్యం కలగడమే కాకుండా రోజువారీ పనులు చేసుకోవడం కష్టమవుతుంది.
చాలా మందికి రాత్రిపూట వేడివేడి అన్నం తింటే గాని నిద్ర పట్టదు. కానీ, బరువు తగ్గాలని లేదా ఫిట్‌గా ఉండాలని ప్రయత్నించే వారికి..
మనలో చాలా మందికి అద్దంలో చూసుకున్నప్పుడు కొన్ని శరీర భాగాలు నచ్చవు. ముఖ్యంగా ఎంత వ్యాయామం చేసినా, ఎంత కఠినమైన డైట్ పాటించినా తగ్గని మొండి కొవ్వు మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది...
ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మహిళలను వేధిస్తున్న అతిపెద్ద సమస్య పి.సి.ఓ.డి (PCOD). అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది..
ఈనాటి వేగవంతమైన జీవనశైలిలో మనకు తెలియకుండానే మనం అనేక ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నాము. ముఖ్యంగా, నేటి యువతలో సెక్స్ పట్ల ఆసక్తి తగ్గడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారుతోంది. ..
మధుమేహం (Diabetes) ఉన్నవారు చేసే మొదటి పని అన్నం మానేసి చపాతీలు తినడం. మరి నిజంగా చపాతీ తింటే షుగర్ తగ్గుతుందా? అన్నం తింటే పెరిగిపోతుందా? ఈ విషయంలో చాలా మందిలో..
నేటి వేగవంతమైన ఒత్తిడితో కూడిన జీవితంలో ఆందోళన ఒక సాధారణ సమస్యగా మారింది. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు కూడా మనసును అశాంతపరిచి, నిద్ర, ఆహరం, రోజువారీ జీవనశైలిపై  ప్రభావం చూపుతాయి...
కాలం మారినా మనిషి జీవన పోరాటం మాత్రం మారదు.  కొందరు కాలంతో పోటీ పడి ఎండ, వాన, చలి వంటి వాటిని లెక్క చేయకుండా సాగుతూ ఉండాలి. లేకపోతే వారితో పాటు వారిని నమ్ముకున్న కుటుంబాలు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.....
వేసవి అంటే మండే ఎండలు, వేడి గాలులు,  చెమటలు పట్టించే వాతావరణం.. ఇవన్నీ ఉంటాయి.  ఇలాంటి రోజుల్లో  రోడ్డు పక్కన అమ్మే చెరకు రసం తాగితే ఎంతో హాయిగా ఉంటుంది. నిమ్మరసం, నల్ల ఉప్పు, పుదీనా కలపడం వల్ల చెరకు రసం  రుచి మరింత ఇనుమడిస్తుంది...
సాధారణంగా తాంబూలం వేసుకోవడం అనేది మన సంప్రదాయంలో ఒక భాగం. కానీ, ఆ తాంబూలానికి కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద మూలికలను జత చేస్తే, అది గుండెను రక్షించే ఒక అద్భుతమైన ఔషధంగా మారుతుందని..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.