Publish Date:Apr 27, 2012
నాలుగురోజుల పాటు పార్లమెంట్ నుంచి సస్పెండ్ అయిన టి-కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు ఇరకాటంలో పడినట్టు కనిపిస్తోంది. మొదటిరోజు ప్రత్యేక తెలంగాణా కోసం పార్లమెంట్ లో హడావుడి చేయడం, నాలుగురోజుల పాటు సస్పెండ్ కావడం, ఆ బ్రేకింగ్ న్యూస్ టెలివిజన్ లలో ప్రసారం కావడం, పత్రికల్లో పతాకశీర్షికల్లో వేయడం బాగానే అనిపించింది. కానీ తరువాత పరిణామాలు చూస్తుంటే పార్లమెంట్ లో అవసరానికి మించి హడావుడి చేశామా? అనే పశ్చాతాపం కనిపిస్తోంది.
ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు విషయమై ఎటువంటి హామీ ఇవ్వడానికీ కేంద్రం సిద్ధంగా వున్నట్లు కనిపించడం లేదు. సస్పండ్ చేసిన నాలుగురుజుల గడువు పూర్తవుతోంది. ఎటువంటి హామీ లేకుండా మరలా పార్లమెంట్ లో ప్రవేశిస్తే తమ పరిస్థితి ఏమిటనే ఆలోచనలో పడ్డారు. మొదటి రోజు హడావుడి చేసి, సస్పెండ్ కావడాన్ని కాంగ్రెస్ ఆడుతున్న నాటకం అంటూ తెలంగాణా ప్రాంత బిజెపి నేతలు, టి.ఆర్.ఎస్. నేతలు వ్యాఖ్యానాలు చేశారు. సస్పెండ్ కావడం, పార్లమెంట్ ఎదుట ధర్నాలు చేస్తున్నప్పటికీ పార్టీలోని నేతలు ఎవ్వరూ అంతగా పట్టించుకోకపోవడమం ఎటువంటి హామీలు లేకుండా పార్లమెంట్ లోకి ప్రవేశిస్తే నాటకం అని ప్రతిపక్ష నేతలు చేసిన ఆరోపణలు నిజమని ప్రజలు నమ్మే అవకాశం వుండటమే కాకుండా తాము అభాసుపాలు కావడం ఖాయమని టి-పార్లమెంట్ సభ్యలు ఆందోళన చెందుతున్నారు. ఆందోళన కొనసాగించాలా లేక మెల్లగా పార్లమెంట్ లో చేరిపోవాలా? అనే అంశంపై వారు మల్లగుల్లాలు పడుతున్నారు. సస్పెండ్ అయిన నేపథ్యంలో నాలుగురోజుల పాటు తెలంగాణలో పర్యటించాలని భావించినా, ఆ నాలుగురోజుల వ్యవధి ఢిల్లీ నుంచి రావడానికి, వెళ్ళడానికి సరిపోతుందని, దానివల్ల ప్రయోజనం లేదని విరమించుకున్నారు. తాజాగా అధిస్థానాన్ని బెదిరించడం కోసం టి-కాంగ్రెస్ సభ్యులు ప్రత్యేక ఫోరమ్ ఏర్పాటు చేయడమా లేక తెలంగాణా రాష్ట్ర సమితిలో చేరడమా? అనే అంశంపై ఆలోచన చేస్తున్నట్టు వార్తలను పత్రికలకు విడుదల చేశారు. ఈ బెదిరింపు సాకుగా గౌరప్రదంగా పార్లమెంట్ లో ప్రవేశించవచ్చని వారు భావిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/suspension-of-tcongress-mps-from-parliament-24-13671.html
Publish Date:Oct 10, 2026
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే రాష్ట్ర పండుగ బతుకమ్మ వేడుకలు శనివారం నుంచి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
తండ్రి అంటే పిల్లలకు ఒక భరోసా, కుటుంబానికి ఒక పెద్ద దిక్కు. బయట ఎంతటి బిజీ రాజకీయ జీవితం గడిపినా, ఇంట్లో తమ వారి కోసం వారు చూపించే ప్రత్యేక శ్రద్ధ ఎంతో మధురమైనది.
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో ఇక వర్షాలు అంతంత మాత్రమేనని వాతావరణ పరిశోధకులు చెబుతున్నారు. డిసెంబర్, జనవరిలలో శీతాకాలంలో చలి కూడా అంతంత మాత్రంగానే ఉంటుందనీ, డిసెంబర్ నుంచే రోహిణిని తలపించే ఎండలు మండిపోతాయని అంచనా వేస్తున్నారు.
కన్నబిడ్డకు అనారోగ్యం వస్తే ఏ తల్లైనా తల్లడిల్లిపోతుంది. బిడ్డకు నయం చేయించేందుకు తన దగ్గర ఉన్నదంతా ఖర్చు చేయడానికైనా వెనుకాడదు.
ఇండియాలో క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి అమెరికన్ ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఇదు అవుతుంది. అంటే ఇండియాలో ఏర్పాటు అవుతున్న అమెరికా యూనివర్సిటీ తెలంగాణకు తరలివచ్చిందన్న మాట.
తట్టి అన్నారం సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో కుక్కలు ఓ మృతదేహాన్ని పీక్కుతింటుండటాన్ని స్థానికులు గమనించారు. ఆ దృశ్యం చూసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. చివరకు ఆమెను ఓయూ మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన మంగమ్మగా గుర్తించారు.
ప్రభుత్వాలు స్వల్పకాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం మద్యంపై ఆధారపడటం వల్ల వైద్యం, శాంతిభద్రతల పరిరక్షణ, కుటుంబ సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు నిష్ప్రయోజనంగా మరుతున్నాయి.
ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన పీజీ, బీటెక్ తదితర విద్యార్హతల ధ్రువపత్రాలు సంబంధిత విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావనీ, అవి నకిలీ సర్టిఫికెట్లనీ నిర్ధారణ కావడంతో వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించిన 35 మంది లెచ్చరర్లను ఊస్ట్ చేస్తూ తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం 7,635.22 కోట్ల రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన 2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు