Publish Date:May 11, 2023
శివసేన పార్టీలో తలెత్తిన సంక్షోభంపై ఉద్ధవ్ ఠాక్రే వర్గం, శిందే వర్గం దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ధర్మాసనం గవర్నర్ తీరును తప్పుపట్టింది. అలాగే షిండే జారీ చేసిన విప్ ను అప్పటి స్పీకర్ గుర్తించడాన్ని సైతం తప్పుపట్టింది.
అయితే సభలో విశ్వాస పరీక్షను ఎదుర్కొనకుండానే అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేసినందున ఆయనను తిరిగి సీఎంగా నియమించలేమని పేర్కొంది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఒక రాజకీయ పార్టీలో చీలికను బలపరీక్ష ద్వారా నిర్ధారించడానికి వీల్లేదని పేర్కొంది.
కొందరు ఎమ్మెల్యేలు పార్టీని వీడినంత మాత్రాన పార్టీ చీలిపోయిందని కాదనీ, పార్టీ శ్రేణులు, కార్యకర్తల స్థాయిలో చీలికను గుర్తించాలనీ పేర్కొంది. సరిగ్గా ఈ కారణంగానే తెలుగుదేశం పార్టీలో 1995 ఆగస్టులో తెలుగుదేశం పార్టీలో సంభవించిన సంక్షోభ సమయంలో చంద్రబాబునాయుడి నాయకత్వంలోని గ్రూపునే అసలైన తెలుగుదేశం పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. తెలుగుదేశం చీలిక వర్గం నేతగా చంద్రబాబు అప్పట్లో కేంద్ర ఎన్నికల సంఘానికి 1995 సెప్టెంబర్ 15, అదే నెల 29 అలాగే అక్టోబర్ 10, అక్టోబర్ 24 తేదీలలో వరుసగా లేఖలు రాశారు. అలాగే మొత్తం 3694 మంది పార్టీ జనరల్ బాడీ సభ్యులలో 2679 మందిఎన్టీఆర్ స్థానంలో తనను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకుంటూ చేసిన తీర్మానాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించారు.
అలాగే ఎన్నికల సంఘం వద్ద చంద్రబాబుకు మద్దతుగా న్యాయ న్యాయ నిపుణులు కపిల్ సిబల్, రాజేంద్ర చౌదరి, రాకేష్ శర్మ, ఎన్వీ రమణ (ఈయన ఆ తరువాత సీజేఐ అయ్యారు)లు వాదించారు. అయితే ఏక్ నాథ్ షిండే శివసేనను చీల్చిన సమయంలో ఈ ప్రక్రియ ఏమీ జరగలేదు. అయినా కూడా కేంద్ర ఎన్నికల సంఘం షిండే ను శివసేన అధ్యక్షుడిగా గుర్తించి పార్టీ గుర్తును కూడా కేటాయించింది. అయితే సుప్రీం కోర్టు మాత్రం ఏకపక్షంగా షిండే వర్గాన్ని అసలు శివసేనగా గుర్తిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై ఎటువంటి వ్యాఖ్యలూ లేయలేదు. అదలా ఉండగా షిండే వర్గం ఎమ్మెల్యేల అనర్హత విషయాన్ని తేల్చాల్సిన బాధ్యత మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ దేనని సుప్రీం కోర్టు పేర్కొంది. దీంతో ప్రస్తుత స్పీకర్ ఆ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. అయితే ఆయన నిర్ణయం ఎలా ఉన్నా సుప్రీం కోర్టు తీర్పుతో మహారాష్ట్ర ప్రజలకు ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వాన్ని అక్రమంగా పడగొట్టారన్న విషయం మాత్రం స్పష్టంగా తెలిసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/supreme-find-fault-with-maha-governer-25-155146.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?