ఛీ ఛీ.. కొవిడ్ నిధులూ కొట్టేసిన జగనన్న!.. ఆర్థికం అధ్వాన్నం

Publish Date:Apr 14, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ అనగానే, ఎవరికైనా అప్పులే గుర్తుకు వస్తాయి. వైసీపీ ప్రభుత్వం మూడేళ్ళ పాలనలో ఏమి సాధించింది అంటే, అప్పుల్లో అగ్రస్థానం సంపాదించింది, అనే సమాధానమే ప్రధానంగా వినివస్తోంది. అలాగే, అప్పులు చేయడంలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి తనకు తానే సాటని నిరూపించుకున్నారు.అందుకే కావచ్చు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రివర్గ విస్తరణలోనూ, వద్దన్నా బుగ్గనకు మళ్ళీ ఆర్థిక శాఖని అప్పగించారు. బొత్స, పెద్దిరెడ్డి వంటి సీనియర్ల శాఖలు మార్చినా బుగ్గన శాఖను మాత్రం మార్చలేదు. నిజానికి, మంత్రి పదవి ఇవ్వక పోయినా ఫర్వాలేదు కానీ, ఆర్థిక శాఖ మాత్రం వద్దని బుగ్గన ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసినట్లు వార్తలొచ్చాయి. అయినా, చివరకు, ‘వీర దండం’ నుంచి ఆయన తప్పించుకోలేక పోయారు. అది ఆయన మెడకే చుట్టుకుంది. 

అదెలా ఉన్నప్పటికీ, ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి ఇంకో పెద్ద చిక్కు వచ్చిపడింది. నిజానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాలలో అప్పులు అదుపులో ఉంచుకోమని, ఏపీ ప్రభుత్వాని హెచ్చరించింది. నిజం అవునో కాదో కానీ, ఆంధ్ర ప్రదేశ్ శ్రీలంక దారిలో పరుగులు తీస్తోందని  ఆర్థిక శాఖ అధికారులు హెచ్చరించిన నేపధ్యంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించుకుని మరీ అప్పులు అదుపులో పెట్టుకోమని, ఆర్థిక క్రమ శిక్షణ పాటించమని గట్టిగా అక్షింతలు వేసి పంపారని, మీడియాలో వార్తలొచ్చాయి. ముఖ్యమంత్రి ఆ వార్తలను ఖండించారు, అనుకోండి. అది వేరే విషయం.  

అయితే ఇప్పుడు జగన్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అంతకు మించిన షాక్ ఇచ్చింది. కేంద్ర నిధులను ఇష్టారాజ్యంగా దారి మళ్ళించడం కుదరదని కుండ బద్దలు కొట్టింది. అంతే కాదు, స్టేట్ డిజాస్ట‌ర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్‌)కి కేటాయించిన నిధుల‌ను, పీడీ ఖాతాలకు మళ్లిస్తూ  రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సర్వోన్నత న్యాయ స్థానం నిలుపు చేసింది.ఈ వ్య‌వ‌హారంపై దాఖ‌లైన పిటిష‌న్‌ను విచారించిన సుప్రీంకోర్టు, నిధుల దారి మళ్లింపు రాజ్యంగ విరుద్ధమని చెపుతూ, జగన్ రెడ్డి ప్రభుత్వం నెత్తిన మొట్టి కాయలు వేసింది. ఈ సంద‌ర్భంగా ఏపీ స‌ర్కారు తీరుపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా తీవ్రంగా తప్పు పట్టింది. జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణ‌యం స‌రైన‌ది కాదంటూ కోర్టుకు తెలిపింది.

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పంద‌న‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. ఏపీ స‌ర్కారు తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అంతేకాకుండా ఎస్టీఆర్ఎప్ నిధుల‌ను దారి మళ్లించ‌డం కుద‌ర‌ద‌ని స్పష్టం చేసింది. ఈ మేరకు నిధులు మ‌ళ్లిస్తూ ఏపీ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యాన్ని నిలుపుద‌ల చేసింది. అనంతరం త‌దుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 28కి వాయిదా వేసింది.

నిజానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న, ఆర్థిక /అప్పుల విధానాన్ని పలి సందర్భాలలో తప్పు పట్టింది. ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని కేంద్ర ప్రభుత్వం అనేకమార్లు హెచ్చరించింది.  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఏపీ ఆర్థిక వ్యవస్థ క్రమశిక్షణ గీత దాటిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భారీగా బడ్జెట్‌ వెలుపల అప్పులు చేసినట్లు కాగ్’ ధృవీకరించింది. 2019 ఏప్రిల్ 1 నుంచి కార్పొరేషన్‌లు, కంపెనీల పేరుతో రూ.56,076 కోట్లు అప్పుగా తీసుకుందని కేంద్రం తెలిపింది.గతేడాది రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిన ప్రశ్నకు కేంద్రం ఈ మేరకు సమాధానం ఇచ్చింది. 

వివిధ బ్యాంకుల నుంచి ఏపీ ప్రభుత్వం తీసుకున్న అప్పుల్లో ఎక్కువగా ఎస్‌బీఐ నుంచి అత్యధికంగా రూ.15,000 కోట్లకుపైగా తీసుకుంది. ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ. 9వేల కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ. 7వేల కోట్లు, యూబీఐ నుంచి రూ.6,800 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రూ.5,700 కోట్లు, ఇండియన్ బ్యాంక్ నుంచి రూ.4వేల కోట్లకుపైగా ఏపీ అప్పు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విపరీతమైన అప్పులు చేస్తోందని, ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని తెలుగు దేశం, బీజేపీ సహా ఇతర  ప్రతిపక్ష పార్టీలు  ఎప్పటినుంచో చెబుతున్నాయి. రాష్ట్రంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాలనే డిమాండ్ ఎప్పటినుంచో వుంది అయినా, కేంద్రం ఎందుకనో, హెచ్చరికలతోనే సరిపెడుతోంది కానీ,కఠిన  చర్యలు తీసుకోలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దొరికిన కాడికి అప్పులు చేసి ఓటు బ్యాంకు పథకాలకు ఖర్చు చేస్తోంది. అందుకే ఏపీలో ఏ.. అంటే అప్పులు, పీ.. అంటే పందేరాలు అని అనుకోవలసి వస్తోందని అంటున్నారు.

By
en-us Political News

  
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.